Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శిరిడీ గ్రామ నివాసి కేశవ్ అనంత్ అలియాస్ అప్పా కులకర్ణి బాబా యొక్క భక్తుడు. అతడు శిరిడీ గ్రామంలో ఆదాయం అకౌంటెంట్ లేదా కరణం. అతను ఆత్మారామ్ కులకర్ణిగా కూడా పిలువబడేవారు. అతను ఒక సత్యవాది, ఎప్పుడూ సత్యం వైపు నిలిచేవాడు. కానీ అతను గొప్ప అహంభావి. బాబా పట్ల అతనికి ఎంతో విశ్వాసం. కానీ అతని పూర్వ జన్మ పాపాలు అతనిని వెంటాడుతుండటం వలన చాలా బాధలకు గురయ్యాడు.
ఒకప్పుడు గ్రామ ఖాతాల నుండి నిధులను అపహరించాడనే ఆరోపణ అతనిపై ఆరోపించబడింది. నిజానిజాలేవో ధృవీకరించకుండానే ఈ పుకారు గ్రామంలో చాలా వేగంగా వ్యాప్తి చెందింది. అప్పా కులకర్ణి ఒక మోసగాడు, డబ్బు విషయంలో మోసగించాడు అన్న అపవాదు వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. ఒక కేసు అతనిపై దాఖలు చేయబడిందని కూడా అందరూ అనుకోసాగారు.
అప్పటి జిల్లా కలెక్టర్ అధికారి అప్పాకు కబురు పంపించి, అతను వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పారు. అప్పా చాలా భయపడ్డాడు. “ఇక ఇప్పుడు, నేను ఇంటికి తిరిగి రాలేను” అని అనుకున్నాడు. ప్రయాణానికి ముందు, అతని అలవాటు ప్రకారం బాబా వద్దకు వెళ్ళారు.
అతను బాబా ఎదుట సాష్టాంగపడి, “బాబా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి. ఆ ఆరోపణ నిజమో అబద్ధమో మీకు తెలుసు. అప్పా బాబా యొక్క భక్తుడని అందరూ అంటారు కదా! అందుచేత నాకు ఏదైనా జరిగితే, అందుకు మీరు నిందింపబడతారు. అలా జరగకూడదు. అందువలన దయచేసి ఈ ప్రమాదం నుండి నన్ను రక్షించండి!” అని వేడుకున్నాడు.
అప్పా మాటలు విని, బాబా అతని మీద కనికరించి, “అప్పా, భయపడవద్దు. ప్రస్తుతం, జిల్లా అధికారి నేవాసా గ్రామంలో ఉన్నారు. అక్కడ మోహినీరాజ్ (విష్ణు భగవానుని మోహిని అవతారం) ఆలయంలో జ్ఞానేశ్వర్ మహారాజ్ తన 12 ఏళ్ళ వయస్సులో (జ్ఞానేశ్వరి) ‘గీత’పై వ్యాఖ్యానాన్ని రాయడం మొదలుపెట్టి, 1290 సంవత్సరంలో 15 సంవత్సరాల వయస్సులో దేవగిరి రాజ్యాన్ని పాలించిన యాదవరాజు రామచంద్ర సమయంలో పూర్తి చేశారు. నువ్వు ప్రవర నది ప్రక్కగా నేవాసా చేరుకొని, ముందుగా అక్కడ మోహినీరాజ్ దర్శనం చేసుకొని, నమస్కరించు! తరువాత సాహెబ్ వద్దకు వెళ్ళు! మోహినీరాజ్ నిన్ను రక్షించుకుంటాడు” అని చెప్పారు.
అప్పా సరిగ్గా బాబా చెప్పినట్లు చేశాడు. ముందుగా మోహినిరాజ్ కు నమస్కరించి, తరువాత అతను సాహెబ్ కార్యాలయానికి వెళ్లి తన వివరణ ఇచ్చాడు. అధికారి అది చదివిన తరువాత, “మీరు డబ్బును అపహరించలేదని నేను నమ్ముతున్నాను. అందువలన, నేను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను” అని చెప్పారు.
అప్పా ఈ అద్భుతమైన లీలకు మనస్సులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందంతో నాట్యం చేసాడు. మరుసటి రోజు అతను శిరిడీకి తిరిగి వచ్చి, మశీదుకు వెళ్లి బాబా పాదాలు గట్టిగా పట్టుకొని, “సాయి మహారాజా! భక్తజనుల కల్పద్రుమమా! పూర్ణ కామా! వైరాగ్యానికి నివాసమైన మీరే నన్ను రక్షించారు. కరుణామూర్తి నేను ధన్యుణ్ణయ్యాను. పుణ్యమూర్తీ! నా గౌరవ మర్యాదలను మీరే కాపాడారు ప్రభూ! నేను మీకు కృతజ్ఞుడను” అన్నాడు.
అప్పుడు బాబా, ”అప్పా! నేను ఎవరిని? ఇదంతా చేసింది ఆ పరమేశ్వరుడు. అతను అసాధ్యాన్ని సాధ్యం చేస్తారు”. అప్పా తన జీవితాన్ని బాబాకు అంకితం చేశాడు. బాబా కూడా ఇతర భక్తులను అప్పా ద్వారా తమ దగ్గరికి తీసుకువచ్చారు. అటువంటి భక్తులలో ప్రముఖమైన వ్యక్తి, బాగా చదువుకున్న మరియు ఉన్నతమైన హోదా గల ప్రభుత్వ అధికారి నానాసాహెబ్ చందోర్కర్.
బాబా శిరిడీకి సమీపంలో ఉన్న రాహతా మరియు నీంగావ్ కు తప్ప మరే ఇతర ప్రదేశాలకు ఎప్పుడూ వెళ్ళలేదు. అయినప్పటికీ ఆయనకు నేవాసా, అక్కడ ప్రవహించే నది పేరు, మోహినీరాజ్ ఆలయం మరియు జ్ఞానేశ్వర్ మహారాజ్ గురించి సర్వం తెలుసు.
1892లో కళ్యాణ్ లో నివసిస్తున్న నానాసాహెబ్ అహ్మద్ నగర్ కలెక్టర్ కి కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఒకసారి కోపర్గాఁవ్ లో డిప్యూటీ కలెక్టర్ అయిన నానాసాహెబ్ చందోర్కర్ పర్యవేక్షణలో జమాబందీ (రెవెన్యూ ఇన్స్పెక్షన్) జరుగుతోంది. దానికి అప్పాసాహెబ్ కులకర్ణి శిరిడీ నుండి వెళ్లవలసి ఉంది.
కోపర్గాఁవ్ వెళ్లడానికి ముందు అప్పాసాహెబ్ అనుమతి కోసం బాబా వద్దకు వెళ్లాడు. అప్పుడు బాబా అనుమతి ఇచ్చి, “నువ్వు వెళ్లి నానాసాహెబ్ ని నేను పిలుస్తున్నట్లు చెప్పి శిరిడీకి ఆహ్వానించమని” చెప్పారు. బాబా ఆజ్ఞను మన్నించి, నానాసాహెబ్ చందోర్కర్ తో బాబాను చూడటానికి శిరిడీ గ్రామానికి ఆహ్వానించాలని అప్పా నిర్ణయించుకున్నాడు.
బాబా సందేశాన్ని నానాసాహెబ్ కు అప్పా చెప్పగానే, ఒక చిన్న గ్రామంలో భిక్షమెత్తుకొనే ఫకీర్ తనని చూడటానికి ఎందుకు ఆహ్వానిస్తున్నారు అని ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నానాసాహెబ్ బాబా ఆహ్వానాన్ని తిరస్కరించి శిరిడీని సందర్శించలేదు.
అయితే బాబా రెండవసారి, మూడవసారి తమ ఆహ్వానాన్ని పునరావృతం చేశారు. అప్పుడు నానాసాహెబ్, “నేను ఎలా నమ్మగలను? బాబా నన్ను ఎందుకు పిలుస్తున్నారు? మీరు ఆయన పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? మీకు ఏమి కావాలో నాకు స్పష్టంగా చెప్పండి!” అన్నాడు.
అప్పుడు అప్పా, నానాసాహెబ్ కు వివరంగా అంతా చెప్పి, బాబా నిజంగా సందేశాన్ని పంపించినట్లు అతనికి తెలియచేసాడు. చివరికి, నానాసాహెబ్ శిరిడీని సందర్శించి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆ విధంగా నానాసాహెబ్ ను శిరిడీకి తీసుకురావటానికి అప్పాసాహెబ్ కీలక పాత్ర పోషించాడు.
రేపు తరువాయి బాగం…..
source: http://bonjanrao.blogspot.in/2013/01/appasaheb-kulkarni.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అప్పా కులకర్ణి రెండవ బాగం….
- అప్పా సాహెబు కులకర్ణి
- అబ్దుల్ బాబా మొదటి బాగం…..
- సాయి భక్త ముక్తారాం – మొదటి బాగం….
- శ్రీ. రావ్ సాహెబ్ వి.పి.అయ్యర్ – మొదటి బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments