సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ మూడవ భాగము.

Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba

సాయి బాబా     …          సాయి బాబా     …         సాయి బాబా     …          సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను. 

బి.వి. దేవ్ బాబా భక్తుడు.దక్షిణగూర్చి ఆయన  ‘శ్రీ సాయిలీలా మాసిక్ ‘ పత్రికలో ఇట్లు వ్రాసియున్నారు:

బాబా అందరిని దక్షిణ అడుగువారు కారు.అడగకుండ ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనెడివారు; ఇంకొక్కప్పుడు నిరాకరించువారు.

బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను.బాబా అడిగినచో యిచ్చెద మనుకొనువారివద్ద బాబా దక్షిణ పుచ్చుకొనెడివారు కారు.

తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైన దక్షిణ యిచ్చినచో,బాబా దానిని ముట్టేవారు కారు.

ఎవరైన దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పోమ్మనుచుండిరి.

బాబా అడిగెడు దక్షిణ పెద్ద మొత్తాములుగాని చిన్నమొత్తములు గాని  భక్తుల కోరికలు,భావము,వసతి బట్టి యుండును.స్రీలు,పిల్లల వద్ద కూడ బాబా దక్షిణ అడుగుచుండెను.వారు అందరు ధనికులనుగాని అందరు బీదలను గాని దక్షిణ అడుగలేదు.

తాము అడిగినను దక్షిణ యియ్యనివారిపై బాబా కోపించి యుండలేదు.ఎవరి ద్వారానైన భక్తులు దక్షిణ పంపినచో,తెచ్చిన వారు దానిని మరచునప్పుడు,వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ,ఆ దక్షిణను పుచ్చుకొనువారు.

ఒక్కోకప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి యిచ్చి పూజలో పెట్టుకొనమనెడివారు.దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను.

అనుకున్నదానికంటె ఎక్కువ యిచ్చినచో,కావలసిన దానినే యుంచుకొని మిగాతదానిని తిరిగి యిచ్చి వేయుచుండిరి.

ఒక్కొక్కప్పుడు భక్తులనుకొనిన దానికంటె ఎక్కువగా ఇవ్వమనుచుండువారు.లేదనినచో ఎవరివద్దనయిన బదులు పుచ్చుకొనిగాని,అడిగితీసుకొనిగాని ఇవ్వమనుచుండిరి.కొందరివద్ద నుంచి ఒకేరోజు మూడు,నాలుగు సారులు దక్షిణ కోరుచుండిరి.

దక్షిణ రూపముగా వసూలయిన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు,ధునికొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతాదానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు

50 రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును  ఒక్కొకరికి నిత్యము దానము చేయుచుండువారు.

శిరిడీసంస్థానములో నున్న విలువైన వస్తువులన్నియు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి యిచ్చిరి .ఎవరయిన విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు.

నానాసాహెబ్ చందోర్కరుతో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము ,ఒక విడిగుడ్డ,ఒక కఫనీ,ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికి భక్తులనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు.

మన పారమార్ధికమునకు ఆటంకములు రెండు గలవు;మొదటిది స్రీ.రెండవది ధనము.శిరిడీ లో బాబా యీరెండు సంస్థలను నియమించియున్నారు.అందొకటి దక్షిణ,రెండవది రాధాకృష్ణమాయి.తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచి పెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను.భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని, ”బడికి”(రాధాకృష్ణమాయి గృహమునకు)పంపుచుండిరి.

ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదమువలన వారి పారమార్ధికప్రగతి  శీఘ్రమగుట దృడపడుచుండెను.

సాయి బాబా     …          సాయి బాబా     …         సాయి బాబా     …          సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను. 

Latest Miracles:

Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba

Have any Question or Comment?

2 comments on “సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ మూడవ భాగము.

బాబా వారు నేను సేవకులకు సేవకుడిని అన్న పదానికి ఈ అనుభవము ద్వారా గరహించ వచ్చు.
సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా.

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles