Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
This audio has been prepared by Mrs Lakshmi Prasanna.
- Mir-1-Veeresh By Lakshmi Prasanna 3:22
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
ఈ రోజు సాయిభక్తులు వీరేష్ గారు తమ ఇష్టదైవమైన బాబా తమ జీవితంలో జరిగిన అద్భుతమైన అనుభవం సాయి బంధువులతో పంచుకున్నారు .బాబా వారిని అనుగ్రహించు గాక .
నా పేరు వీరేష్ ,మేము కరీంనగర్ జిల్లా ఆదోని లో నివసిస్తున్నాము .
మా అమ్మగారి పేరు రంగమ్మ .ఆమెకు 2015 లో పాదాలలో పుండ్లు వచ్చాయి .
అవి చాలా పెద్దవిగా ఉండి 5 నెలలు చాలా ఇబ్బంది పడ్డారు .కనీసం నడవలేక పోయైయువారు.
చాలా మంది డాక్టర్స్ దగ్గర చూపించారు .మందులు వాడితే కొంచెం ఉపశమనం అయ్యి మళ్ళీ ఎక్కువ అయ్యాయి .ప్రయోజనం లేక ఫలితం తాత్కాలికమే అయ్యింది .
మాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు .ఇలా ఉండగా నాకు తెలిసిన ఒక స్నేహితుడు అతని పేరు దొరబాబు .ఆయన మంచి సాయి భక్తుడు .
అతనితో ఈ విషయం చెప్పగా అయన బాబాను నమ్మి ప్రార్థిస్తే తప్పక ఈ వ్యాధి నయం అవుతుంది అని చెప్పారు .నేను వెంటనే బాబా ని ప్రార్ధించి మా అమ్మ వ్యాధి తగ్గిన వెంటనే బాబాకి షిర్డీవచ్చి వెండిపాడుకలు సమర్పిస్తానని మొక్కుకోమని చెప్పారు .
నేను మనసులో ఆర్తిగా బాబాని ఈ సమస్య తగ్గించమని పాదుకలు చేపిస్తానని ప్రార్ధించాను .
మా అమ్మగారికి తొందరగానే ఆశ్చర్యముగా పాదాలలో పుండ్లు మాయమైపోయాయి .
మళ్ళీ ఇంతవరకు ఆ సమస్య రానేలేదు .ఇదంతా సాయి మహిమేనని నా ప్రగాఢ విశ్వాసము.
మాకు బాబామీద భక్తి మరింత పెరిగింది .
బాబాలీలలు అనిర్వచనీయం .శ్యామా తన తల్లి మొక్కిన సప్తశృంగిదేవి వెండికుచములు మ్రొక్కును మరచినపుడు బాబా ఆ మ్రొక్కును తాను శ్రీ శ్యామాను వణి పట్టణానికి వెళ్లి చెల్లించమని ఆదేశించినట్లు బాబానే సమయానికి మాస్నేహితునికి ఈ ప్రేరణ కలిగించి తగిన సమయానికి ఈ సలహా పాదుకలు సమర్పించమని చెప్పారని నా విశ్వసం .
ఇదంతా ఆ సాయినాథుని కృపావీక్షణం మాత్రమే.సదా సాయి చరణారవిందాలని ఆశ్రయింతుము గాక.సర్వం సాయినాథార్పణమస్తు.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
Latest Miracles:
- నా మట్టి సమాధానమిస్తుంది,నా సమాధినుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని బాబా ఇచ్చిన అభయ హస్తపు జల్లులను గురూజీ నిరూపించారు.
- నా ప్రశ్నకి గురువుగారు ఫోన్ లో సమాధానమిచ్చారు.
- సుబ్బారావు గారు సాయి మందిరమును ఏర్పాటుచేయుట—Audio
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
- బాబా ఆశీర్వాదంతో నా వివాహం జరిగింది.-3
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments