బాబా,గురూజీల ఆశీస్సులతో మగబిడ్డ పుట్టాడు.వాడి చిట్టిపొట్టి మాటలతో మొదటగా అన్న మాట “బాబా” కావడం మాకు మరింత ఆనందంగా ఉంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

నా పేరు d.లక్ష్మి,మాది వెంటూరు గ్రామం.మావూరిలో సత్సంగం మొదలయి 8 సంవత్సరాలు అయింది.

బాబా,గురువుగారు నన్ను తమ వద్దకు చేర్చుకోవడంలో నిమిత్త మాత్రునిగా ఉంచిన వారు శ్రీ మేజర్ సురేష్ బాబు గారు.ముందుగా వారికి నా కృతజ్ఞతలు.

బాబా,గురుదేవుల అనుగ్రహాశీస్సులు వారికి నిండుగా,మెండుగా కలగాలని కోరుకుంటున్నాను.

నాకు బాబా,గురూజీ ఇచ్చిన ఎన్నో అనుభవాలలో రెండు మీతో పంచుకునేందుకు అవకాశం కల్గించిన గురుదేవులకు నా క్రుతజ్ఞతాభివందనములు.

మేము మొదటిసారి 2004 అక్టోబరు లో శిరిడీ వెళ్లి బాబా,గురూజీని దర్శించుకున్నాo.

తర్వాత 2005 లో జులైలో  మళ్ళీ శిరిడీ వెళ్ళే భాగ్యాన్ని గురువుగారు మాకు ప్రసాదించారు.

అప్పటి నుండి యింక ఎంత ప్రయత్నించినా శిరిడీ వెళ్ళలేకపోయాం.

ఒకసారి 2007 మే నెలాఖరులో అనుకోకుండా శిరిడి వెళ్లాం.బాబా దర్శనం చేసుకున్నాం.కాని గురువుగారిని దర్శించుకోలేకపోయాము.

మేము మే 31వ తేది ఉదయం శిరిడీ చేరాము.కానీ గురువుగారు మే 30వ తేది మధ్యాహ్నం శిరిడీ నుండి వెళ్ళిపోయారు అని గురుబంధువులు చెప్పారు.

ఎంతో ఆశతో వెళ్ళిన నాకు ఆ విషయం విన్నాక వారిని చూడాలనే కోరిక యింకా యింకా ఎక్కువైపోయింది.

గురువుగారిని ఎప్పటికి  చూడగలను?వారు నాకు ఎప్పటికి అవకాశం యిస్తారు?అని వారి గురించే ఆలోచిస్తూ వుండేదాన్ని.

ఎలాగైనా నాకు 2008 గురుపూర్ణిమకు మీ దర్శన భాగ్యం కల్పించండి తండ్రి! అని గురువుగారి పటంవద్ద తరచూ అడిగేదాన్ని.

తెనాలి గురుబంధువులు శ్రీ రత్తయ్య గారికి తరచూ ఫోన్ చేసి నా అనుభవాలు,సమస్యలు వారికి చెప్తూ ఉండేదాన్ని.

వారు మనకు బాబా గురువుగారు ఉన్నారు అని ధైర్యం చెప్తూ వుండేవారు.

నేను మేలో శిరిడీ వెళ్లివచ్చిన తరువాత వారికి ఫోన్ చేసి చెప్పాను.బాబా దర్శనం అయ్యింది గురూజీ దర్శనం కాలేదు అని చెప్పాను.

నా భర్తతో కలిసి శిరిడీ వెళ్లి బాబా గురూజీ దర్శనం చేసుకోవాలి అని నా మనస్సులో వున్న కోరికను గురువుగారి వద్ద ఉండే గురుబంధువు ద్వారా గురువుగారికి విన్నవించమని చెప్పాను.నేను కూడా ఈ విషయం గురించి తరచూ అడుగుతుండేదాన్ని.

2008 గురుపూర్ణిమకు 20 రోజుల ముందు కలిసినప్పుడు ఆ గురుబంధువుతో చెప్పడం కుదరక ఈ విషయం(నా భర్తతో కలిసి శిరిడీ వెళ్లి బాబా గురూజీని దర్శించుకోవాలనే నా కోరికను)మద్రాస్ యువకుల సత్సంగంలో ఒక ఉత్తరం రాసి బాబా,గురూజీ పాదాల దగ్గర పెట్టారట రత్తయ్యగారు.

వారు తెనాలి తిరిగి వచ్చిన మూడు రోజులకి నేను ఫోన్ చేసి గురువుగారు మా శిరిడీ ప్రయాణం కన్ ఫర్ము చేసారు అని రత్తయ్య గారికి చెప్పాను.

ఈ విషయం విని చాలా ఆనందించి వారు నా గురించి రాసిన పెట్టిన ఉత్తరం విషయం చెప్పారు.అది విన్న నాకు చాలా ఆనందం,ఆశ్చర్యం కల్గినాయి.

గురుపూర్ణిమకు మేమందరం శిరిడీ వెళ్లి బాబాను,గురుదేవులను తనివితీరా తృప్తిగా దర్శించుకొని ఎంతో ఆనందంగా యింటికి తిరిగి వచ్చాము.యిది నాకు గురువుగారు ఇచ్చిన అనుభవం.

జీవితంలో మరిచిపోలేనిది ఎందుకంటే వెంటవెంటనే శిరిడీ వెళ్ళడం అనేది నా భర్త మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం.

ఇది గురుదేవుల అనుగ్రహంతో సాధ్యమయింది.(నాభర్త దృష్టిలో తీర్థయాత్ర అంటే ఏ పుణ్యక్షేత్రం అయినా(శిరిడీతోసహా) 4,5 ఏళ్లకు ఒకసారి వెళితే చాలు అనేది తన ఉద్దేశ్యం)ప్రస్తుతం సత్సంగం,నామ సంకీర్తనలకు దూరంగా ఉన్న నన్ను త్వరలోనే నా భర్తలోని మార్పుతో తనతో కలసి సత్సంగాలకు వెళ్ళేలా అనుగ్రహించమని గురువుగారిని వేడుకుంటున్నాను.

మా మరిదికి 2007కు పెండ్లి అయి 5 సంవత్సరాలు అయ్యింది.మాతోడికోడలకి పిల్లలులేరు.

2006 ఆగష్టు 20కి మామరిదికి,తోడికోడలుకి లండన్ కి వెళ్ళడానికి వీసా వచ్చింది.

లండన్ వెళ్ళడానికి 10 రోజుల ముందు మా మరిది,చెల్లాయి వచ్చి వెంటూరులో ఒక వారం రోజులు వున్నారు.

అపుడు ఎదో మాటల సందర్భంలో పిల్లలు లేని కారణంగా తను పడేబాధను,కొంతమంది మాట్లాడే సూటి,పోటి మాటలను మా తోడికోడలు నా దగ్గర చెప్పుకొని బాధపడి కన్నీళ్ళపర్యంతం అయింది.

అప్పుడు నేను యిలా చెప్పాను.బాబా,గురూజీ కి ఒక ఉత్తరం రాసి పెట్టుకో గురువుగారు నీకు ఖచ్చితంగా పిల్లల్ని యిస్తారు.అనుమానం లేదు.

మీరు లండన్ నుంచి వస్తూ గురువుగారు ఇచ్చిన బుడతడితో తిరిగివస్తారు అని,నా దగ్గర ఉన్న సాయిపథం శిరిడీ అడ్రస్సు (పోస్టల్ అడ్రస్సు) ఉంటే యిచ్చాను.

తను రెండు ఉత్తరాలు రాసుకుని ఒకటి పోస్టులో వేసింది.ఇంకొకటి నాకు ఇచ్చింది సత్సంగంలో పెట్టమని.

నేను ఆ ఉత్తరాన్ని సత్సంగంలో గురువుగారి పటంవద్ద వుంచి వారికి బిడ్డల్ని ప్రసాదించమని మనస్పూర్తిగా అడిగాను.

మా అందరి మొర బాబా,గురూజీ ఆలకించారు.2007 ఫిబ్రవరిలో మేమందరం బొడ్డుపాడు నామసప్తాహానికి బయలుదేరడానికి ఒకరోజు ముందు లండన్ నుండి ఫోన్ వచ్చింది.

మాధవికి ప్రగ్నెన్సీ కన్ ఫర్ము అయ్యిందని.యిది ఖచ్చితంగా గురువుగారి అనుగ్రహమహిమ అని మరొక్కమారు మా అందరి మనసులలో ఆనందం కలిగింది.

బాబా,గురూజీ ఆశీస్సులతో వారికి 2007 అక్టోబరు 13న మగబిడ్డ పుట్టాడు.

2008 జనవరి లో వాళ్ళు గురువుగారు ఇచ్చిన ప్రసాదం(సాయినందన్)తో ఇండియాకి వచ్చారు.

వాడి చిట్టిపొట్టి మాటలతో మొదటగా అన్న మాట “బాబా” కావడం మాకు మరింత ఆనందం.

ఈ అనుభవంతో మా మరిదికి,చెల్లాయికి కూడా బాబా,గురూజీల మీద భక్తి,ప్రేమలు మరింత బలపడ్డాయి.తలచుకుంటే ఆనందంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

మనందరి మీద గురూజీకి ఎంత ప్రేమ.నాలో ఏ అర్హత లేకపోయినా నేను కోరినదల్లా యిస్తున్న ఆ సద్గురు దేవునికి మనస్సులతో…జన్మ జన్మలకి వారి బిడ్డగానే పుట్టాలని,బ్రతకాలని,నా గురుదేవులను కోరుకుంటూ వారి బిడ్డ… డి.లక్ష్మి,వెంటూరు,ఈస్ట్ గోదావరి

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles