గురువు తాను గురువును అని ఎవరికి చెపుకోడు,కానీ తన ఆచరణ ద్వారా తాను గురువు అని తెలుసుకుని సేవించుకోవలసినది మాత్రం మనమే.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భూమిపై చెడుని నాశనం చేసి మంచిని పెంపొందించడం తేత్రా,ద్వాపర,మొదలగు కాలాలలో చూసాము ఎందరో దేవతలు,అవతార పురుషులలాగా అవతరించి ధరణి పై చెలరేగుతున్న రాక్షసులను చెండాడి,మంచికి,మానవత్వానికి అండగా నిలిచారు.

ఆయా కాలాలలో వారు అవతరించింది రాక్షసులను , నాశనం చేయడానికే,అందుకే వారి కార్యం తీరిపోగానే వారు తమ అవతారాన్ని ముగించి దివికి వెళ్లిపోయారు. కానీ ఈ కలి కాలం లో అడుగడునా రాక్షస ప్రవృతి గల మానవులు ఉన్నారు.

వీరందని సంహరించడం కన్నా వారిలోని రాక్షస ప్రవృత్తిని నాశనం చేసి అధర్మం గా ఉంటున్న మానవుల మనసులలో ధర్మాన్ని పెంపొందించి,మంచి సంస్కారాన్ని అందించి,మనలని మానవత్వం నుండి దైవత్వం వైపు మళ్లించడానికే ఆ దైవం గురువుగా,సద్గురువుగా అవతరించాడు.

ఆ గురువు శంకు, చక్ర ,గదా ,ఖడ్గాలు ధరించి వాటితో దుష్ట సంస్కరణ చేయరు.మనలో ఒకడిగా ఉంటూ,మనలో కలిసిపోతూ,తన ఆచరణ ,బోధనల ద్వారా మనమే మనలోని దుష్ట సంస్కారాలని తొలిగించుకునేలా చేస్తాడు.

గురువు తాను గురువును అని ఎవరికి చెపుకోడు,కానీ తన ఆచరణ ద్వారా తాను గురువు అని తెలుసుకుని సేవించుకోవలసినది మాత్రం మనమే. గురువు తాను ఒక్కడే గౌరవనీయ స్థానంలో ఉండాలి అనుకోకుండా తన శిష్య్లు లు కూడా తనంత వారిగా కావాలని గురువు ఆశిస్తాడు.

అలా వెలుగుతున్న గురుశిష్య పరంపరలో ఎందరో గురువులు,మహాత్ములు భూమిపై నడయాడుతున్నారు.మనుషులందరి సంస్కారాలు, ఆలోచనలు ఒకరకంగా ఉండవు.అందుకే వారి సంస్కారాలు,ఆలోచనల నుండే వారిని ఉద్దరించడానికి పూర్వం అలాంటి ఆలోచనలతోనే ఉండి సాధనతో ఆత్మసాక్షాత్కారం పొందిన మహనీయుని వారికీ గురువుగా నియమిమిస్తాడు..అప్పుడు ఆ గురువు తాను అంతకుముందు అదే వాసనల నుండి వాటిని దాటి ముందుకు వచ్చిన వాడు కనుక ఇప్పుడు అదే దారిలో వెళ్ళవలసిన వారికీ మార్గం చూపించగలడు.అప్పుడు శిష్యునికి తాను వెళ్ళవలసిన మార్గం లో అంతకుముందే వెళ్లి ఏది మంచి ఏది చెడు అనే ఎత్తు పల్లాలని చూసి,గమ్యాన్నిచూసిన వాడు, చేరిన వాడు కాబట్టి అయన చెప్పిన తోవలో వెళితే నేను సులభంగా గమ్యాన్ని చేరుతాను అనే ఆలోచనతో గురువు చెప్పినట్టు నడుచుకోవాలి అని శిష్యుడు అనుకుని,గురువు చెప్పినట్టు నడుచుకుని ధర్మవంతుడవుతాడు.

అప్పుడే కదా కలి యుగంలో దైవం వేసిన ప్రణాళిక విజయవంతమయ్యేది.అందుకే ఒక గురువుని ఆశ్రయించి,సేవించి,గురువు చెప్పినదానికి అనుగుణంగా నడుచుకుని ఆత్మసాక్షాత్కారం పొందిన శిష్యుడే ఇంకొకరికి గురువు అవగలడు.

అలాంటి గురువులలోని గురువే నా గురువు శరత్ బాబూజీ గారు.ఏదో రోజు టెంపుల్ కి వెళుతూ సచ్చరిత్ర చదువుతూ,చుక్కాని లేని నావలా ప్రయాణిస్తున్న నాకు బాబా స్వప్న దర్శనం లో ఇక నా బాధ్యతలన్నీ బాబూజీ గారికి అప్పగిస్తున్నా అని చెప్పడం అప్పటి నుండి నేను శరత్ బాబూజీ గారిని గురువుగా భావించుకోవడం అవన్నీ అనుభవాలు ఇంతకూ ముందే పంచుకున్నాను.

గురువుగారు నా కళ్ళెదురుగా లేకున్నా అనేక స్వప్న దర్శనాల ద్వారా,నా ప్రొబ్లెమ్స్ కి మాత్రమే కాకుండా మా గురుబంధువుల సందేహాలకు కూడా నా స్వప్నం లో సమాదానాలు ఇచ్చేవారు.ఆలా వారి సందేహాలకు సమాదానాలు విని వారు ఆనందించిన సందర్భాలు ఉన్నాయి.

గురువుగారు స్వప్నం లో ఎందరో మహాత్ములని నాకు చూపించారు.అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆనందమే కానీ వారందరు కూడా సమాధి చెందిన మహత్ములే.నేను బాబాని సజీవంగా చూడలేదు, గురువుగారిని సజీవంగా చూడలేదు.గురువుగారు స్వప్నంలో చూపించిన మహాత్ముల ప్రేమ నాకు తెలుస్తున్న ఆ మహాత్ములనీ సజీవంగా చూడలేదు.

బహుశా మనసులో ఏ మూలో సజీవంగా ఉన్న మహాత్ములనీ చూసి వారితో మాట్లాడాలని ఆలోచన ఉందేమో మరి నాకు తెలియదు గురువుగారు అది కూడా తీర్చేసారు.గురువు గొప్పతనం గురించి ఎవరు చెప్పినా ఆ శిష్యునికి ఆనందం వేస్తుంది.అదే ఒక మహాత్ముడు ఆ గురువు ను గౌరవభావం తో ఆరాధిస్తే ఇక ఆనందం హద్దులు దాటుతుంది అదే నా విషయం లో జరిగింది.

గురువుగారు ఇతర మహాత్ములను ఎలా గౌరవిస్తారో స్వప్న దర్శనం లో చూపించారు.అలానే ఏవిదంగా అయితే సాయిబాబాను సమకాలీక మహాత్ములు ఆరాధించి,గౌరవించారో అలానే గురువుగారిని ఇతర మహాత్ములెలా ఆరాధిస్తారో అనేది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “గురువు తాను గురువును అని ఎవరికి చెపుకోడు,కానీ తన ఆచరణ ద్వారా తాను గురువు అని తెలుసుకుని సేవించుకోవలసినది మాత్రం మనమే.

Maruthi Sainathuni

Sree Sachhidanamda Sadguru Sainath maharaj ki jai,Sadguru Sree Sainathuni Sarath Babuji ki Jai.
Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles