బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ

పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

భక్తుడిని స్వప్న దర్శనం ఇచ్చి, షిర్డీ పిలిపించుకున్న బాబా!!

సాయిబంధువు రామకృష్ణగారిని (పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చినట్లు)బాబా స్వప్న దర్శనం ఇచ్చి షిర్డీ రప్పించుకున్న  లీల.

నాకు 1994  లో బాబా ఇచ్చిన లీల మీతో పంచుకుంటున్నాను.

ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రపోతున్నపుడు నాకు బాబా స్వప్నం లో దర్శనం ఇచ్చారు.

నేను అంతకముందు ఎప్పుడు షిర్డీ రాలేదు.

నేను బాబా మా ఇంటికి వచ్చారని కలలోనే చాలా సంతోషపడుతున్నాను.

బాబా తన నోట్లో అన్నం నమిలి తింటూ దానిని నన్ను తనకు దగ్గరగా తీసుకుని  నా నోట్లో పెట్టారు.

నాకు వెంటనే మెలుకువ వచ్చింది.అప్పటినుండి నేను బాబా వైపు ఆకర్షితుడయ్యాను.షిర్డీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నాను.

నాకు మొదటగా వచ్చిన స్వప్నం గురించి ఆలోచించినప్పుడు,బాబా నన్ను మాతృ ప్రేమతో తన బిడ్డగా స్వీకరించారని ఆనందిస్తాను.

ఎందుకంటే ఎవరో పెద్దల దగ్గర నేను విన్న మాట ఏమిటంటే

“పూర్వ కాలంలో గ్రామీణ ప్రాంతాలలో పొలాల్లో కష్టించి పని చేసే మహిళలు తమ పసిపిల్లలకు తాము తింటుండగా  అన్నాన్నినమిలి తమ నోటినుండి ప్రేమగా తమ పిల్లల నోటికి నేరుగా తినిపిస్తారని”.

ఇది వినటానికి అంత నాగరికంగా లేకపోయినప్పటకీ,ఆధునిక తరాలకు కాస్త వింతగా అనిపించినప్పటికీ  సైన్సు పరంగా ఆలోచిస్తే దీనికి  కారణం ఉంది.అలా చేయటం వల్ల తల్లి ప్రేమ పిల్లలకు తల్లి స్పర్శ ద్వారా చేరుతుంది మరియు ఆహరం బాగా జీర్ణం అయ్యి శక్తివంతులుగా అవ్వుతారు.బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.

“సృష్టిలో తల్లి ప్రేమ,మన అందరి తల్లి అయిన బాబా ప్రేమ వెలకట్టలేని మణిహారం.అది అవ్యాజమైన ప్రేమతత్వం”.

– సద్గురు సాయినాథార్పణమస్తు –
సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles