Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
ఎవరి బలహీనతవలన వారి పతనాన్ని వారు కొనితెచ్చుకొంటారుతప్ప చెడ్డవారితో చేరినంతమాత్రంచేత అనడం ఉత్తమాట ..
బాబా సశరీరంగా ఉన్న కాలంలో వారూ , వీరూ అని బేధం లేక అందరినీ ఆదరించారు ..
ఆయనకు ప్రతిరోజూ వొచ్చే దక్షిణలను ఆయనతో గడిపే బడేబాబాలాంటి వారికేగాక , భిక్షగాళ్లకు , సాధువులకు కూడా పైసా మిగుల్చుకోక ఏరోజుకారోజు పంచేసేవారట ..
కనీసం ఆయనరోజూ చేసి భిక్షాటనను కూడా ఆకలితో అలమటించే మూగజీవులను ఆదరించి , కడుపునింపేవారు ..
ఆయన ప్రతి మతాన్ని ఆదరించి , గౌరవించారు ..
సచ్చరిత్ర ఆసాంతం చదివి అర్ధంచేసుకొంటే , ఆశ్రయించినవారిలో అవసరాలు తీర్చుకోవాలని వొచ్చిన సంఖ్య ఎక్కువ ..
ఆయన సన్నిధిలో జన్మను సాధించుకొన్నవారి సంఖ్య ఆశ్రయించిన అంతమందిలో చాలా తక్కువే కనిపిస్తుంది ..
ఒక రౌతు తన గుర్రాన్ని అదిలించో , బెదిరించో గుర్రాన్ని నీటితొట్టి వరకు తీసుకుపోగలడుకానీ దాహంలేని గుఱ్ఱముచేత నీటిని తాగించడం వాడిచేతకానట్టు , ఒక సద్గురు ప్రేమను పంచగలడు , హితంకోరి నాలుగు చీవాట్లుపెట్టైనా కోపాన్ని ప్రదర్శించగలడు , యిదంతా తనను ఆశ్రయించిన వారి హితవుకోసమేతప్ప , ఇతర స్వార్ధప్రయోజనాలు ఆశించి కాదుకదా.
కేవలం మహాత్ములను దర్శించినంతమాత్రాన , అతి వినయంతో వారికి చేరువైనట్టు అభినయించినంతమాత్రాన దుస్సంస్కారాలు నశించిపోతాయని అనుకొంటే , అందుకూ సచ్ఛరిత్రలో పాము , కప్పలకధలో పూర్వ వృత్తాంతం చెన్నబసప్పల వివరాలు బాబా నోటివెంటే స్వయంగా అభివర్ణించబడింది.
బాబా ఇకలేరు అన్నవార్త దావానంలా వ్యాపించింది .. అప్పటివరకూ ఆ మసీదుమీదే ఆధారపడి,ఏ శ్రమా లేకుండా బ్రతికిన భిక్షగాళ్లు , సాధువులు , అవకాశవాదులు కనీశం అటువైపు తొంగిచూడకుండా , మరో ఉపాధికోసం గ్రామాన్ని విడిచివెళ్లిపోయారు ..
అంతవరకూ ఆయనతో నిత్యము హితబోధలు వింటూ గడిపినవారిలో కొందరు , ఆయన మహాసమాధి విషయంలొ కూడా రచ్చకెక్కి రగడకుదిగారు.
పురాణాలలొ చెప్పిన ధర్మాలైనా మహాత్ములు ప్రకటమౌతూ చేరదీసి, నూరిపోసే హిత వాఖ్యాలయినా లోకశ్రేయస్సుకోసమే ..
అవగాహనతో అర్థంచేసుకొని , అజ్ఞానమనే బలహీనతలు తొలిగిoచుకొని , యదార్దాన్ని గ్రహించడం అది మనిషి ప్రయత్నమే ..
బలహీనతకు బానిసై , తొలగించుకొనే ప్రయత్నం చేయనివాడు , సద్గురువును ఆశ్రయించినా , ఉత్తమ సంస్కారులతో పరిచయాలుపెరిగినా , వాడిలో స్ఫూర్తి మొదలుకానిదే అది సత్ఫలితాన్ని కలిగించదు అని పెద్దలమాట ..
శ్రీ గురు పాదార్పణమస్తు
***
Latest Miracles:
- బాబావారి మందిరం కట్టించి అక్కడే సాయిబాబా సేవ చేసుకుంటూ వున్నాడు
- బాబాకి పేద, ధనిక, కులం, మతం, తేడాలు లేవు, కావలసింది కేవలం బాబా మీద భక్తి, ప్రేమ, శ్రద్ధ మాత్రమే!
- ఊది మహత్మ్యం(భాగోజీకి బాబావారి రక్షణ)
- ఇస్తానన్న దక్షిణ మర్చిపోతే స్వప్నం ద్వారా గుర్తు చేసారు బాబా
- నా నుండి దక్షిణ స్వీకరించినది మీరేనా బాబా(దీక్షిత్)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments