Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
ఆయన సద్బోధలు , మనిషిని తీర్చిదిద్దగల ఒక మహా ఆయుధం.
*******
విత్తనాన్ని చూసి , ఇది పలానా చెట్టుకు సంబంధించింది అని ఆరితేరినవారుతప్ప అందరూ నిర్ధారించలేరు ….
మనిషి మాటలబట్టి వారి వారి మానసిక స్వభావాన్ని గుర్తించడం కూడా అంత కష్టమే ..
ఎంతటివారైనా ఇంటా , బయటా వ్యవహరించే తీరు ఒకలా ఉండదు ..
అంతవరకూ మామూలుగా ఉన్న వ్యక్తి , పరిస్థితుల ప్రభావంతో అతి ఉద్రేకానికి లోనైనప్పుడు , బలహీనతకు లోనై మందుకొట్టి మత్తులో తూలేవాడినోట అసలైన మనిషిలోపలి , మనిషి అంతర్భావాలు బయటకొస్తుంటాయి.
సమాజంలో సభ్యతకోసం వ్యవహరించేతీరుకు , సంసారంలో మనిషి నిత్యము వ్యవహరించేతీరుకు నేలకూ , ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది ..
మనిషి ఉన్నది ఉన్నట్టుగా , ముక్కుసూటిగా అన్నిచోట్లా వ్యవహరిస్తే యిటు సమాజంలోనేకాదు , సంసారంలోనూ కొన్ని ఇక్కట్లు పడకతప్పదు , కొంత శత్రుత్వాన్ని కొనితెచ్చుకొన్నట్టవుతుంది ..
నిజం నిష్కర్షగా చెప్పే అలవాటు ఉండొచ్చు అది ఉద్రేకాని కలిగించే విదంగా కాకుండగా , సౌమ్యంగా వ్యక్తపరిచే విదంగా వ్యవహరిస్తే , వినేవారిలో కూడా ఉద్రేకపడకుండా సహనాన్ని ప్రదర్శించగలరు ..
బాబా అంటారు ” పరిస్థితి అనుకూలించనప్పుడు , నీదికానిచోట వాదాలకుదిగక , తలవొంచుకొని ప్రక్కకు పోయినంతమాత్రాన నీకు పోయేది ఏముంది ” అని ..
ఆధ్యాత్మికం , మనిషి నడవడిని తీర్చిదిద్దే మహా ఆయుధం .. శ్రద్దగా దానిని అనుసరిస్తే , మనసును ప్రక్షాళన చేసి , అంతఃకరణశుద్ధిని ప్రసాదిస్తుంది …
ఒక సద్గురువు ఉపదేశానుసారం అంచెలంచలుగా ఒక స్థాయికి ఎదిగే వర్గంతోపాటు , ఆ ఉపదేశాల ఆధారంగా , మాటల చాతుర్యంతో తామే ఒక గురువులుగా చలామణి అవుతూ ,అంధకారంలో ముంచే వర్గమూ తారసపడుతుంది ..
విత్తనం మొలకెత్తి , మొలకగా ఎదిగేంతవరకూ ఏ ఫలజాతికి సంబంధించినదో లోకం గుర్తించలేనట్టు ఒక గురువును ఆశ్రయించిన శిష్యుల వైఖరినిబట్టి , ఆ గురువు తీరుతెన్నులు లోకానికి వెల్లడౌతుంటుంది ..
సమర్థుడైన సద్గురువు లోకహితంకోసం ప్రకటితమౌతాడు ..
మహిమములు చూసి ఆశ్రయించి , అక్కడికే పరిమితమయ్యేవారుకొందరు , జారీ శ్రేయాశ్రేయాల బారం గురువుకి అప్పజెప్పి , నిమిత్రమాత్రులుగా బోధలను తమ జీవితానికి అన్వయించుకొని , జన్మరాహిత్యానికి ప్రయత్నించేవారు కొందరు .
ఆశ్రయించిన ప్రతి పుష్పం పలమై , సిద్ధిపొందాలని యెదురుచూసే ఆయన మహాసమాధికి , తగిన రీతిలో సాధన చేస్తూ , ఆయన వారసులుగా మిగిలిపోవడమే ఆయన శతాబ్ది వేడుకల్లో , ప్రతి వారూ ఆయన ఋణం తీర్చుకునే మార్గమని పెద్దలమాట …
Latest Miracles:
- మనిషిరూపంలో- శిరిడీ సమాధిమందిరములో వుండే బాబావారి విగ్రహంముఖములా…Audio
- బాధే సౌఖ్యం…..సాయి@366 అక్టోబర్ 31….Audio
- మనిషిని ఆనంద స్వరూపుడిగా చేసే శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది అని బోధించిన బాబా వారు.
- నాకు ఒక బంగారు చైన్ దొరికింది,అది ఎవరిదో నా దగ్గరికి వచ్చి సరియైన ప్రమాణం చూపించి తీసుకెళ్లు వచ్చు
- ‘‘రాత్రి కలలో నేను చెప్పిందంతా నిజమే! వెళ్ళు, శివుడొస్తున్నాడు. త్రిశూలాన్ని గియ్యి.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments