సద్గ్రంథం-గుండె,ప్రచారం-ప్రాణవాయువు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా

Author:Kota Prakasam Garu

బ్రతికేందుకు అనేక మార్గాలున్నయి ఆధ్యాత్మికాన్ని వ్యాపారంగా మార్చుకొంటే , అందుకు తగ్గ చేదు అనుభవం కాచుకొనేఉంటుంది
*******

వెనకటి ఒకడికి అనుమానమొచ్చింది శరీర ఆధారానికి ప్రదాన అవయం ఏది అని ..” గుండె ” అని ఎక్కువ శాతం అభిప్రాయాన్ని వెల్లడించారు , సకలచరాచర జీవకోటికి ఆధారమేదని అడిగితే ప్రాణవాయువు అని టక్కున సమాదానం చెప్పారు …

మనిషికేకాక ఏ జీవి అయినాసరే ఆకారానికి చైతన్యం నశిస్తే , దానికి ,కట్టెకూ తేడాలేదని అందరికి తెలిసిన యథార్థమైన విషయమే ..

ఒక్క గుండె ప్రధానం అనుకొంటే, దానికి ప్రాణవాయువందకపోతే , ఫీజులేని బుల్బుకు , కరెంటు సరఫరా ఉన్నా వ్యర్థమే అయినట్టు ఆడేగుండె చతికిలపడాల్సిందే ,, నేనునేను అనుకొంటూ , ఈ శరీరం నాది అనుకొంటు బ్రమలో బ్రతికే మనిషి , నిజానికి లోపల జరిగే అవయవ విన్యాసాలలో ఏ లోపంవొచ్చి , బాధకు గురిచేసినా , అర్థంకాక , ఉపసమానానికి అనుభవమున్న వైద్యు డిని సంప్రదించి ఉపశమనం పొందక తప్పదు …

కళ్లు , కాళ్ళ మొదలూ ఊపితిత్తులు , కిడ్నీ ,లివర్ ,మెదడు వరకూ అలా ఏ ప్రదాన అవయాలుసహకరించరించకపోయినా ప్రాణవాయువు అందుతూ గుండె తనపని అది చేసుకుపోతున్నా , శరీరం మాత్రం నిర్జీవమైన కట్టెలాంటిదే …

సాధన మార్గంకూడా నిర్దుష్టంగా ఒక విధానానికే పరిమితంకాక ఎవరి మానసికాధరణకు తగ్గట్టు తొమ్మిదిరకాల ఉపాసనా పద్ధతులున్నాయి భాగవతం , బాబా తదితర గ్రంథాలలో పేర్కొనబడింది ..

ఆద్యాత్మిక మార్గానికి తొలుత జ్ఞానకాండ అంటే తెలుసుకోడం , రెండవది కర్మకాండ అంటే ఆచరణ , మూడవది భక్తి కాండ అంటుంది శ్రీ గురుచరిత్ర ..

ఒక సద్గ్రంథం గుండెలాంటిది , ప్రచారం ప్రాణవాయులా పాకకపోతే ఆ మూలమేదో జనాల నాడీకందదు ..

మూలంలో అనేక పాత్రలు భిన్న సంస్కారాలతో , భిన్న సాధన మార్గాలతో పరిచయమౌతాయి ..

అందుకు తగ్గట్టు అయా వ్యక్తుల మానసిక సంస్కారాలకు అణుగుణంగా భిన్న బోధనాపద్ధతులు అందించబడి , వెరసి ఒక సద్గ్రంథం లోకాచరణకు అందించబడుతుంది ..

శరీరతత్వానికి అన్ని అవయవాల పొందిక , తగినట్టు వాటి పనితీరు ఎంత అవసరమో , ఒక సద్గురువును ఆశ్రయించినవారి సాదన ఏ మార్గాన్ని అనుసరించినా , అది ఆ తత్త్వం నిత్యము అఖండంలా ప్రజ్వరిల్లుతూంటుంది ..

మనిషికి అవయవలోపంలా , అనుసరించే వ్యక్తిత్వాలలో ఎవరు ఏ దోషముచేసినా , అది ఆ గ్రంధమూలానికే చేటు కలిగించినవారు
కాగలరని పెద్దలమాట ..

జయ్ గురుదేవ సమర్థ
*****

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles