శేజారతి – Night Aarathi


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


(రాత్రి 10గం||లకు దూపదీప నైవేద్యాలర్పించి 5వత్తులతో హారతి ఇవ్వాలి)

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కి జై

ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా!

పాంచాహీ తత్త్వాంచా దీప లా విలా ఆతా

నిర్గుణాతీస్ధితి కైసీ ఆకారా ఆలీబాబా ఆకారా ఆలీ

సర్వాఘాటీ భరూనీ ఉరలీసాయిమావులీ

ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా

పాంచాహీ తత్త్వాంచా దీప లా విలా ఆతా

రజతమ సత్త్వతిఘే మాయాప్రసవలీ బాబామాయా ప్రసవలీ

మాయేచియే పోటీకైసీ మాయా ఉద్భవలీ

ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా!

పాంచాహీ తత్త్వాంచా దీపలావిలా ఆతా

సప్తసాగరీకైసా ఖేళ్ మండీలా బాబా ఖేళ్ మండీలా

ఖేళూనియా ఖేళ్ అవఘా విస్తారకేలా

ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా!

పాంచాహీ తత్త్వాంచా దీపలావిలా ఆతా

బ్రహ్మాండేచీ రచనాకైసీ దాఖవిలీదోలా బాబాదాఖవిలీదోలా

తుకాహ్మణే మఝా స్వామి కృపాళూ భోళా

ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా!

పాంచాహీ తత్త్వాంచా దీపలావిలా ఆతా

తాత్పర్యము:గురుదేవా! సాయిశ్వరా!మీకు హరతి 2.ఐదు తత్త్వాలే జ్యోతులా హరతి యిస్తున్నాను.3.ఆకారంలేని సాకారమెలానందెను? ఇంకా సాయి మాతృస్వరూపాన ఉన్నారు.4.సత్వరజో తమస్సులు త్రిగుణాలు మాయవలెనే ఉద్భవించెను.ఆ మాయ నుండి యింకొక మాయ యెలా పుట్టేను? 5.సాగరము లేడూమీకు జలక్రీడ కెట్లు ఉపకరించెను?యెలాగ అడుగుతున్నారు.6. ఈ బ్రహ్మండ భాండకల్పన మీరెలా చేశారు? 7. ఓ స్వామీ దయాకరా! కల్లకపటము లేనివాడు అని తుకారాం కీర్తించాడు.

లోపలేజ్ఞాన జగీ హితనేణతికోణి

అవతార పాండురంగా నామఠేవిలేజ్ఞానీ

ఆరతిజ్ఞానరాజా మహకైవల్య తేజ

సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతిజ్ఞానరాజా…

కనకచే తాటకరీ ఉభ్యగోపికనారీ

నారద తుంబురహో సామగాయనకరీ

ఆరతిజ్ఞానరాజా మహకైవల్య తేజ

సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతిజ్ఞానరాజా

పగట గుహ్యబోలే విశ్వబ్రహ్మచికేలె

రామజనార్ధనీ (పా)సాయి మస్తకఠేవిలే

ఆరతిజ్ఞానరాజా మహకైవల్య తేజ

సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతిజ్ఞానరాజా

తాత్పర్యము:1.జగమున జ్ఞానము లేదు.తమమంచి నెవ్వరూ తెలిసికొనలేరు.2.అందుచేతనే పాండురంగడు పుట్టాడు.జ్ఞానియని నామదేవుడు నామముంచాడు.3.ఓ జ్ఞాననాధా! శ్రీ కైవల్యదాయీ మీకు హరతి యిస్తాము. సంతులూ, సాధువులై మిమ్ము సేవించుచున్నారు, నా హృదయం మిమ్ము ఆకర్షిస్తున్నది.మిమ్ము సేవించుచున్నాను.4.గోపికాంత లిద్దరుచేత(సువర్ణ కలశము) హారతి పట్టి నిలిచారు. 5.నారద తుంబురులు సామగానమృత మొలకించుచున్నారు 6.అతిగోప్యబ్రహ్మస్వరూపం (మీ రూపుగా) ఈ జగమున సంచరించుచుండెను.

ఆరతి తుకరామా స్వామి సద్గురు ధామా

సచ్చిదానందమూర్తీ పాయదాఖవి ఆహ్మా

ఆరతి తుకరామా..

రాఘవే సాగరాతా పాషాణతారిలే

తైసే తుకో బాచే అభంగ రక్షీలే

ఆరతి తుకరామా స్వామి సద్గురుధామా

సచ్చిదానందమూర్తీ పాయదాఖవి ఆహ్మా

ఆరతి తుకరామా…….

తూనేకిత తుల నేసీ బ్రహ్మతుకాసీఅలే

హ్మణోని రామేశ్వరే చరణి మస్తకఠేవిలే

ఆరతి తుకరామా స్వామి సద్గురు ధామా

సచ్చిదానందమూర్తీ పాయదాఖవి ఆహ్మా ఆరతి తుకరామా..

తాత్పర్యము:-తూకారామూ మీకు హారతి యిదిగో స్వామీ!సద్గురుధామా! 2.సచ్చిదనందా! నాకు తమ పాదదర్శన మిప్పించండి.3. శ్రీ రాముడెట్లు రాళ్ళను సాగరమున తేలించెనట్లు చేసెనో. 4. అలాగే తుకారాం అభంగములను కూడా చేసి రక్షించారు.5. అతనికి గల మహిమలు చూచిన తుకారాం పరబ్రహ్మమే అగును. 6. అందువలన అతనికి రామేశ్వరుడే సాగిలపడెను.

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘేఉనికరీహో

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

రంజవిసీ తూ మధురబోలునీ మాయాజశీనిజ ములాహో

రంజవిసీ తూ మధురబోలునీ మాయాజశీనిజ ములాహో

భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దుఃఖలాహో

భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దుఃఖలాహో

దావునివిభక్తవ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలాహో

దావునివిభక్తవ్యసనహరిసీ దర్శన దేశీత్యాలాహో

ఝాలే అసతిలకష్ట అతీశయాతుమచే యాదేహలాహో

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘేఉనికరీహో

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

క్షమాశయన సుందరహిశోభా సుమనశేజత్యావరీహో

క్షమాశయన సుందరహిశోభా సుమనశేజత్యావరీహో

ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో

ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో

ఓవాళితో పంచప్రాణిజ్యోతి సుమతీకరీహో

ఓవాళితో పంచప్రాణిజ్యోతి సుమతీకరీహో

సేవాకింకరభక్త ప్రీతి అత్తరపరిమళవారిహో

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘేఉనికరీహో

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

సోడునిజాయా దుఃఖవాటతే బాబా(సాయి) త్వచ్చరణాసీహో

సోడునిజాయా దుఃఖవాటతే బాబా(సాయి) త్వచ్చరణాసీహో

ఆజ్ఞేస్తవహా అసీప్రసాదఘేఉని నిజసదనాసీహో

ఆజ్ఞేస్తవహా అసీప్రసాదఘేఉని నిజసదనాసీహో

జాతోఆతా యే ఉపునరపిత్వచ్చరనాచేపాశిహో

ఉఠవూతుజల సాయిమావులే నిజహిత సాదా యాసిహో

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘేఉనికరీహో

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

తాత్పర్యము:-శ్రీ సాయిశ్వరా!జయము జయము మీకగుగాక, మీరు మీ మందిరమున హాయిగ నిదురించుచుండురు. 2. మా మనస్పూర్తిగా నిచ్చు హారతి గైకొనండి. 4.మతృమూర్తి తనగన్న బిడ్డలాగు మృదు వాక్యములతో మమ్మానందపరుచుడు. 4. మీ సేవకుల రోగములు పారద్రోలి, వారి దుఃఖములను మీరనుభవిస్తారు.5.పరుగెత్తి వచ్చి భక్తుల కష్టములు బాపి మీ దర్శనము వారికిస్తారు. 6. కష్టాలు అనుభశము మీ దేహమందే! 7.అక్షయమగు కుసుమలాతో అమర్చబడి సుందరమగు పర్యంకమున మీరు హాయిగా శయనింపుడు.8. మీ భక్తుల చేత మీరు పూజలందుడు. 9. పంచప్రాణ ప్రవత్తులను సుమతి జ్యోతిని వెల్గించాను.10.కింకరులమగు మా భక్తియే తమకు సుగంధములుగా స్వీకరింపుడు. 11. తమ పాదాలు వీడి యింటికి నేగాలన్న దుఃఖము వస్తుంది. 12. మీ ఆజ్ఞచేత తమ ప్రసాదము స్వీకరించి మా గృహములకు నేగుచున్నాము.13.ఇప్పడేగిన మరల తమ పాదపద్మాల దరికి చేరగలము మేము. 14.సాయిమాతా! మిమ్ము మేలుకొలిపి మామంచి సాధించుకొందుము.

ఆతాస్వామి సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా

చిన్మయహే (నిజ) సుఖదామ జావుని పహుడాఏకాంత

వైరాగ్యాచా కుంచ ఘేఉని చౌక ఝాడిలా బాబాచౌకఝాడిలా

తయావరీ సుప్రేమాచా శిడకావాదిదలా

ఆతాస్వామి సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా

చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత

పాయఘడ్యా ఘాతల్య సుందర నవవిదా భక్తీఈత బాబానవవిదా భక్తీ

జ్ఞానాంచ్యాసమయాలావుని ఉజలళ్యాజ్యోతీ

ఆతాస్వామి సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా

చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత

భావార్ధాన్‌చా మంచక హృదయాకాశీటాంగిలా బాబా(హృదయా) కాశీటాంగిలా

మనాచీ సుమనే కరునీకేలే శేజేలా

ఆతాస్వామి సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా

చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత

ద్వైతాచే కపాటలావుని ఏకత్రకేలే బాబా ఏకత్రకేలే

దుర్భుద్దీంచ్యా గాంఠీ సోడుని పడదేసోడిలే

ఆతాస్వామి సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా

చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత

ఆశాతృష్ణ కల్పనేచా సోడుని గలబలా బాబాసోడుని గలబలా

దయక్షమా శాంతి దాసీ ఉబ్యా సేవేలా

ఆతాస్వామి సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా

చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత

అలక్ష్య ఉన్మని ఘేఉని నాజుక దుశ్శాలా బాబా నాజుక దుశ్శాలా

నిరంజనే సద్గురుస్వామి నిజవిలశేజేలా

ఆతాస్వామి సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా

చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత

శ్రీ గురుదేవద్తః

తాత్పర్యము:-1. దేవా! అవధూతా! బాబా సుఖముగా నిద్రింపుడు. 2.చిన్మయ నిజాత్మ సుఖదామాని కేగి హాయిగ నిద్రింపుము.3. విరాగ జీపురుకట్టతో తుడిచాము. 4. మా భక్తియే తీర్దముగ చిలకించినాము. 5. నవవిధ భక్తివస్త్రమును పరిచాము. 6. జ్ఞానప్రమిదలో దీపము వెలిగించినాము.7.భక్తి హృదయ మంచము సమర్పించినాము.8. మానసిక పుష్పము మీ మంచమున నుంచాము. 9.దైవ్వతమనుతలుపులు ద్వారాన్ని మూసి ఒక్కటి చేసితివి. 10. శాంతి దాసీలన మీకు సేవలో నర్పించెదను. 11.అన్నిటినీ విడిచి ధ్యాన దుప్పటినీ పరిచాను.తమరు హాయిగ శయనింపుడు.

పాహేప్రసాదాచి వాటద్యావేదుఓనియాతాటా

శేషాఘేఉని జా ఈనతుమచే ఝాలీయాబోజన

ఝాలో ఆతాఏకసవాతుహ్మా ఆళంవావోదేవా

తుకాహ్మణే ఆతా చిత్త కరునీరాహిలో నిశ్చిత్

పావలాప్రసాద్ఆత విఠోనిజవే బాబా ఆతానిజవే

ఆపులాతో శ్రమకళోయేతసేభావే

తాత్పర్యము:-ఓ విఠలా! తమ ప్రసాదము లభించినది.తమ శ్రమ యంతయూ మాకు తెలిసినది.ఓ దయానిధీ! 2. హాయిగ నిద్రపొమ్ము మనో కోరికలు తీరినవి. మేము నా గృహములకు నేగెదము.3. మా కష్టములు నివేదించుటకు నిన్ను నిద్ర నుండి లేపుదము.మా కర్మములు తప్పించుకొందుము. 4. తమరు మాలో ఒకరని తలచాము. మీరు విడిచినది ప్రసాదముగ తిని మేము ధన్యులమయ్యాము.

అతాస్వామి సుఖే నిద్రా కరాగోపాలా బాబాసాయిదయాళా

పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా

తుహ్మసీ జాగవూ ఆహ్మాఅపుల్యా చాడా బాబా ఆపుల్యాచాడా

శుభా శుభ కర్మేదోష హరావయాపీడా

అతాస్వామి సుఖేనిద్రా కరాగోపాలా బాబాసాయిదయాళా

పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా

తుకాహ్మాణేధిదలే ఉచ్చిష్ఠాచేభోజన(బాబా) ఉచ్చిష్ఠాచే భోజన

నాహినివడిలే ఆహ్మ ఆపుల్యాభిన్నా

అతాస్వామి సుఖేనిద్రా కరాగోపాలా బాబాసాయిదయాళా

పురలేమనోరధజాతో ఆపులేస్ధలా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కి జై

రాజాధిరాజ యొగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాధామహరాజ్

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కి జై

తాత్పర్యము:-విఠలా! నీ ప్రసాదము లభించినది.విచారించగా నీ శ్రమంతయు మాకర్దమైనది. 2.స్వామి,గోపాలా! సుఖముగా నిద్రించుము.మా మనోరధములు సిద్దించినవి మేము మా స్ధలములకు వెళ్ళెదము. 3. మా కష్టములను తెల్పుటకై నిన్ను లేపుదుము.శుభాశుభ కర్మదోష పీడాపరిహారము గావించుకొందుము. 4. మేము నీ వద్ద ఇతర భావము నుంచక నీవుకూడ మాతో ఒకనిగా నీకుచ్చిష్ట బోజనమును నివేదన గావించితిని.


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba