Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
గురుగీత 50 – 51 – 52 శ్లోకములు:
శిష్యుడు గురువుని సంతోషపరుచుటకు, ఆసనము – శయ్యను, వస్త్రమును – ఆభరణములను ఈయవలెను. కర్మ చేతను, మనసుచేతను, వాక్కు చేతను నిత్యము గురువుని ఆరాధించవలెను. దేహమును, యింద్రియములను, ప్రాణమును, ధనమును, సేవకులను, భార్యాపుత్రులను, తన వారినందరిని గురు సేవలో వినియోగించవలెను.
శ్రీసాయి సత్చరిత్ర 6 – 10 వ. అధ్యాయములు: సాయి భక్తులు ద్వారకామాయిని బాగుచేసి శ్రీ సాయి కూర్చుండుటకు ఆసనము – పరుండుటకు పనస చెక్క బల్ల – ధరించటానికి కఫనీలు – శేజ్ ఆరతి సమయములో ఆయన చేత ఆభరణాలు ధరింపచేయుట చేసేవారు. మేఘశ్యాముడువంటి భక్తుడు ఒంటికాలిపై నిలబడి శ్రీసాయికి ఆరతి ఇచ్చేవాడు. బాలాజి పాటిల్ నెవాస్కర్ శ్రీసాయి సేవలో తన శరీరాన్నే కాకుండ తన పొలమునుండి వచ్చిన పంటను శ్రీసాయికి అర్పించేవాడు. తన భార్యపుత్రుల చేత కూడ గురుసేవ చేయించేవాడు. శ్రీసాయి ఈతని భక్తికి మెచ్చి కుటుంబ సభ్యులు అందరికి బట్టలు, ధనము ఇచ్చేవారు.
అవిద్య అనెడి చీకటిచే దృష్టి లోపించిన వానిని జ్ఞానము అనెడి కాటుక పుల్లచే ఏగురువు నేత్రములను తెరిపించి దృష్టిని ప్రసాదించునో అట్టి గురుదేవునికి వందనము.
శ్రీసాయి సత్ చరిత్ర 18,19 అధ్యాయములు – సాయి సద్విచారములను ప్రోత్సహించి సాక్షత్కారమునకు ఎట్లు దారి చూపుచుండెడివారో మనకు తెలుసు. ఒక బుధవారము రాత్రి హేమాద్రిపంతు రాత్రి పరుండే ముందు యిట్లు తలచెను. రేపు గురువారము శుభదినము. శిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి రోజు అంతా రామనామ స్మరణతోనే కాలము గడపవలెను అని నిశ్చయించుకొనెను. శ్రీసాయి దయామయుడు. గురువారము తెల్లవారుజామున ద్వారకామాయిలో నుండి ఒక చక్కని పాట వినవచ్చెను. అది “గురుకృపాంజనపాయో మేరీ భాయి” అంటే గురువు కృప అనే అంజనము లభించినది. దాని వలన తన కండ్లు తెరవబడినను, దాని చేత తాను శ్రీరాముని లోపల, బయట, నిద్రావస్థలోను, జాగ్రదావస్తలోను, స్వప్నావస్థలోను, చూడగలుగుతున్నాను. శ్రీసాయి ఈవిధముగా హేమాద్రిపంతు యొక్క మనోనేత్రాలు తెరిపించి దృష్ఠిని ప్రసాదించును. అట్టి సాయినాధునికి సాయి భక్తులందరము వందనము చేద్దాము.
గురుగీత 80 – 81 శ్లోకములు:
కష్ఠ పరిస్థితి వచ్చుచుండగా మనలను రక్షించు ఏకైక బంధువు గురువే. గురువే అన్ని ధర్మముల స్వరూపుడు. అట్టి గురుదేవునికి వందనము. ఈప్రపంచము గురుదేవుని యందే ఉన్నది. ప్రపంచము నందు ఉన్నది గురువే. కనుక ప్రపంచ రూపము అంతయు గురు స్వరూపమే.
శ్రీ సాయి సత్చరిత్ర 33 వ.అధ్యాయము: నానా చందోర్కర్ కుమార్తె మైనతాయి పురిటినొప్పులతో బాధపడుచుండెను. టాంగా తోలేవానిగా బాబా, బాపుగిర్ బువాను జామ్నేరుకు తీసుకొని వెళ్ళెను. బాబా ద్వారకామాయినుంచి ఊదీని బాపుగిర్ బువా ద్వారా నానా సాహెబ్ చందోర్కర్ కు పంపి ఆమెను రక్షించిరి.
శ్రీ సాయి సత్చరిత్ర 7 వ.అధ్యాయము. ఒక దీపావళి రోజున బాబా మండుచున్న ధునిలో తనచేతిని పెట్టి, చాలా దూరములో నున్న ఒక కమ్మరి స్త్రీ ఒడిలోనించి ప్రమాదవశాత్తు మంటలలోకి పడబోతున్న బిడ్డను రక్షించారు. దీనిని బట్టి గురువు సర్వత్రా వ్యాపించిఉన్నాడనే విషయం మనకు అవగతమౌతుంది.
(యింకా ఉంది)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ శివ స్వరూపము – సాయి 3
- శ్రీ శివ స్వరూపము – సాయి 6
- శ్రీ శివ స్వరూపము – సాయి 2
- శ్రీ శివ స్వరూపము – సాయి 4
- శ్రీ శివ స్వరూపము – సాయి 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments