Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీశివ స్వరూపము – సాయి (7వ. భాగము)
గురుగీత 145 వ. శ్లోకం :
ఎవరైన గురువును నిందించినను అతని మాటను ఖండించవలెను. అలా చేయుటకు అసమర్ధుడైనచో వానిని దూరముగా పంపవలెను. అదియు వీలు గానిచో అట్టి దుష్టుని నుండి తానే దూరముగా వెళ్ళవలెను. శిష్యులు తమ గురు భక్తిని ప్రదర్శించటానికి యిది చక్కని మార్గము.
బాబా ఏనాడు తన భక్తులను/సేవకులను వివాదములలో దిగనీయలెదు.
ఒకసారి (2వ.అధ్యాయము) బాలా సాహెబు భాటే (డిప్యూటీ కలెక్టర్ కోపర్ గావ్) కు, అన్నసాహెబ్ ధబోల్కర్ హేమాద్రిపంతుకు గురువు యొక్క ఆవశ్యకత పై వివాదము శిరిడీ సాఠేవాడాలో జరిగెను. ద్వారకామాయిలో బాబా దానిని గ్రహించి కాకా సాహెబ్ దీక్షిత్ ని పిలిచి “సాఠేవాడాలొ ఏమి జరిగినది?” ఏమిటావివాదము? అది దేనిని గురింఛి ? ఈహేమాద్రిపంత్ ఏమి పలికెను?” అని పలికి హేమాద్రిపంతు మనసులోని చికాకును తొలగించెను.
గురుగీత 149 వ. శ్లోకం:
మునుల చేత, నాగులచేత, దేవతల చేత శంపించబడినను తుదకు మృత్యు భయము నుండి కూడా గురుదేవుడు శిష్యుని రక్షించుచున్నాడు.
శ్రీ సాయి సత్ చరిత్ర :: భీమాజీ పాటిల్ క్షయ రోగము, తాత్యాకోతే పాటిల్ – అనారోగ్యము, గోపాల్ ముకుంద్ బూటీ, మిరికర్ ల సర్పగండము.
గురుగీత 172 వ.శ్లోకం:
పార్వతీ ! జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, కీర్తి, శ్రీ , మరియు పూర్ణత్వము ఈ ఆరు ఐశ్వర్యములతో కూడిన భగవానుడు గురుదేవుడు.
శ్రీ సాయి ఈ ఆరు లక్షణాలు కలిగిన భగవానుడు.
గురుగీత 174 వ. శ్లోకం:
ఏపరమ పురుషుడు ఏకాకియై, స్పృహలేనివాడై, శాంతరూపుడై, దఃఖము, అసూయ లేక బాలుని వలె ప్రకాశించునో , బ్రహ్మజ్ఞాని అని అందరిచేత పిలువబడును.
శ్రీసాయి సత్ చరిత్ర 4 వ.అధ్యాయము : 1854 వ. సంవత్సరములో బాబా మొట్టమొదటిసారిగా వేప చెట్టుకింద 16 సంవత్సరాల బాలునిగా కనిపిం చారు. బాహ్యంగా బ్రహ్మజ్ఞానివలె ప్రకాశించారు. కలలోనైనా ఆయన ప్రాపంచిక కోరికలకు ఆశ పడలేదు.
గురుగీత 179వ. శ్లోకం:
గురు మార్గమును అనుసరించు వారికి ఉత్తమమగు మోక్షము లభించుచున్నది. అందువలన మోక్షము కోరువాడు గురుభక్తి కలిగి యుండవలెను.
శ్రీసాయి సత్ చరిత్ర 31వ. అధ్యాయము: శ్రీసాయిని గురువుగా పూజించి మోక్షమును పొందినవారు. 1) తాత్యాసాహెబ్ నూల్కర్ 2)బాలారాం మాన్ కర్ 3) విజయానందుడు 4) మేఘశ్యాముడు. మనము కూడా ఆ సద్గురుని అడుగుజాడలలో నడిచి మోక్షసాధనకు ప్రయత్నించాలి.
గురుగీత 288 వ. శ్లోకం:
పార్వతీ, జలములన్నిటికీ సముద్రము ఏలాగున రాజో, అలాగే ఈ గురువులందరికీ పరమ గురువు రాజుగా చెప్పబడును.
శ్రీ సాయిని యోగిరాజు, రాజాధిరాజుగాను, యోగులకు సామ్రాట్ గాను శ్రీ మెహర్ బాబాగారు చెప్పిరి. వాసుదేవానందస్వామి, టెంబేస్వామి, శ్రీసాయికి తమ ప్రణామాలు చెప్పి శ్రీసాయిని తమ గురువుగా పేర్కొనిరి.
(యింకా ఉంది)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments