Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: రజని
నివాసం: కావలి
సాయి బంధువులకి నా నమస్కారం. నా పేరు రజని. బాబా లీలను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
మాకు పెళ్ళైన కొత్తలో మేము కావలిలో ఉండే వాళ్ళము. అప్పుడు మాకు ఇంకా పిల్లలు కలగలేదు.
మా బంధువుల అక్కకి ఇద్దరు పాపలు. దాదాపు ఒకే వయస్సు ఉన్న వాళ్ళు కావడంతో వాళ్ళని చూసుకోవడం కష్టంగా ఉందని మా దగ్గర ఒక పాపను ఉంచారు. తన పేరు శిరీష.
మా ఆయన జాబ్ చేస్తూ, వాళ్ళ ఫ్రెండ్ ది కోళ్ల ఫారం చూసుకోమంటే సరే అని చూసుకుంటున్నారు.
రోజు సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి వచ్చేవారు. శిరీష అంటే తనకి ఇష్టం ఉండేది, కానీ ఎందుకో తెలియదు ఆ టైంకి వచ్చేసరికి శిరీషని ఏదో ఒక రీజన్ తో కొట్టేవారు. అన్నం సరిగా తినట్లేదని, ఒకేలా రాస్తోందని బాగా కొట్టేవారు.
దాంతో ఆ అమ్మాయి భయపడిపోయేది. ఆ టెన్షన్ కి అమ్మాయి జుట్టు ఎక్కడ పట్టుకుంటే అక్కడ వెంట్రుకలు ఊడి వచ్చేవి.
డాక్టర్ కి చూపిస్తే టెన్షన్ తో అలా అవుతుంది అనేవారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి చెపితే చిన్న పిల్లలకు కొడితేనే భయముంటుంది, ఏం కాదులే అనేవారు నాకేమి తోచేది కాదు.
పాపం అనిపించేది ఆ పిల్లని చూస్తుంటే. అలా ఒకసారి నేను కన్సీవ్ అయ్యాను.
అదే వంకతో అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిస్తే అయిన ఈ బాధ తనకి తప్పుతుంది కదా! అని వాళ్ళ పేరెంట్స్ తో నేను పని చేసుకోలేకపోతున్నాను, శిరీషని తీసుకెళ్లండి అని చెప్తే తీసుకెళ్లారు.
అలా తాను వెళ్లినప్పటి నుండి మా ఆయన రోజు సాయంత్రం కోళ్ల ఫారం నుండి ఇంటికి వచ్చేటప్పటికి, ఆ టైంలో ఏ రీజన్ లేకుండానే రోజు కొన్ని కోళ్లు చనిపోతూ ఉండేవి.
మా అయన టెన్షన్ తో మళ్ళీ వెళ్లి అన్ని చూసుకుని వచ్చేవారు. అందువలన సరిగా నిద్ర ఉండేది కాదు.
అప్పటి వరకు బాగానే ఉండే కోళ్లు ఆ టైంకే ఎందుకు అలా చనిపోతున్నాయి అని అర్దమయ్యేది కాదు. చాలా బాధనిపించేది.
అలా ఉండగా ఒక రోజు నేను నిద్రపోతున్నప్పుడు మెలుకువ వచ్చింది. ఎదురుగా ఒక బాబా ఫోటో ఉంటుంది. ఆ ఫొటోలో నుండి లైటింగ్ వచ్చింది. నేను లేచి కూర్చున్నాను.
బాబా పెదవులు మాట్లాడుతున్నట్టుగా కదులుతున్నాయి. బాబాతో ఏవేవో చాలా సేపు మాట్లాడాను. నాకు కన్నీరు ఆగలేదు. అలా నీటితో నా నైటీ అంతా తడిచిపోయింది. ఇంత జరుగుతున్నా పక్కన ఉన్న వాళ్ళకేమి తెలియకుండా పడుకున్నారు.
అప్పుడు కోళ్ల సంగతి బాబాని అడిగాను. అప్పుడు బాబా “అభం శుభం తెలియని చిన్న పిల్లని పట్టుకుని ఎలా పడితే ఆలా కొట్టారు మూర్తి. పాపం ఆ చిన్న పిల్ల ఈ టైంకి బాబాయ్ వస్తాడు మళ్ళి కొడతాడు అనే టెన్షన్ తో బాధపడింది.
అందుకే ఆ బాధని ఆ టెన్షన్ ని మూర్తి కూడా అనుభవించాలి. ఆ అమ్మాయికి టెన్షన్ తో ఎన్ని వెంట్రుకలు రాలేవో అన్ని కోళ్లు చనిపోవాల్సిందే తప్పదు” అన్నారు.
మరి తరువాత ఎలా బాబా అని అడిగితే “మళ్ళీ శిరీషని మీ ఇంటికే తెచ్చుకొని, పెద్దయ్యే వరకు మీ దగ్గరే ఉంచుకుని పెంచండి. అంతా బాగుంటుంది” బాబా అని చెప్పారు.
అప్పుడు అర్థమైంది అందరికి ఇన్ని రోజులు కోళ్లు ఎందుకు చనిపోయాయి అని. తరువాత శిరీషని మా ఇంటికే తెచ్చుకొని మా దగ్గరే ఉంచుకున్నాం.
అందుకే అంటారేమో కర్మ సూత్రం బలీయమైనది అని. బాబా చెప్పిన ఈ కర్మ సూత్రం వల్ల మనం చేసిన పనులకి మనకి శిక్ష తప్పదు అని మరోసారి క్లియర్ గా అర్థమైంది.
ఆయన ప్రేమను వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
***సాయిసూక్తి:
“అభయవచనంతో నేను నీకున్న నీలోని భయాలన్నీ తీసివేయి”.
Latest Miracles:
- నారాయణను సౌదీ అరేబియా లో శిక్ష నుండి తప్పించుట — Audio
- పారాయణ ఫలం బాబా స్వప్న దర్శనం
- దర్శన ఫలం…. మహనీయులు – 2020… సెప్టెంబరు 18
- సచ్చరిత్ర పారాయణ ఫలం …..సాయి@366 జూన్ 18…Audio
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (3వ.భాగమ్)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments