Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఇందిరా దేవి గారి అనుభవములు మూడవ భాగం
మూడవసారి పారాయణ చేసినప్పుడు నేను మా వారు పిల్లలు ఊర్లో ఉన్నాము. మా వారు మధ్యాహ్నం భోజనం చేసి హాల్లో పడుకున్నారు. నేను లోపల రూమ్ లో పడుకున్నాను.
అప్పుడు నాకో కల వచ్చింది. ఆ కలలో ఇద్దరు ముస్లింలు కర్రలతో ఇంటి లోపలికి వచ్చి, ఏడీ వాడేడీ అంటూ మావారి కోసం వెతుకుతున్నారు. చంపేస్తాము కనపడితే అంటున్నారు.
నేను పిల్లలు లోపల రూము లోనే వుండి తలుపులు వేసుకుని పైన వెంటిలేటర్ లోనుండి బయట ఏం జరుగుతుందో చూస్తున్నాము.
మమ్మల్ని వాళ్ళు గమనించి మీరు ఎవరూ బయటకి రావద్దు వాడు దొరికితే చంపి పడేయాలి అంటూ కర్రలతోటి వస్తున్నారు.
మా ఆయనతో నేను మీరు బయటకి రాకండి లోపలే ఉండండి వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు అంటున్నాను.
మా ఆయన బయట పడుకున్నారు కదా! ఆయనలోంచి ఆత్మ లాగా పడుకున్న మనిషి లోంచి తిన్నగా లేచింది. వాళ్ళు కొడుతున్నారు. నాకీ కల కూడా అర్ధం కాలేదు. నాకు మెలకువ వచ్చేసింది.
నేను పారాయణ చేసిన ప్రతీసారీ కూడా నాకిలాంటి కలలే వస్తుండేవి. నాకు దేనికి అర్థాలు తెలిసేది కాదు.
ఇలాంటి కలల గురించి ఇద్దరిముగ్గిరికి చెబితే నువ్వు బాబా పూజ చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నట్లు ఉన్నావు. అందుకే ఇలాగ కలలు వస్తున్నాయి అన్నారు.
నేను పారాయణ చేసిన ప్రతిసారి కూడా పారాయణ అనంతరం గుడికి వెళ్లి అర్చన చేయించి కొబ్బరికాయ కొట్టుకుని వస్తాను.
నాకు తప్పనిసరిగా ప్రతిసారి కూడా షిరిడి ప్రసాదమో, తిరుపతి ప్రసాదమో తప్పకుండ అందుతుంది. ఈసారి ఉదయం పారాయణం అవగానే నాకు గుడికి వెళ్ళడానికి కుదరలేదు.
రాత్రి అయ్యాక ఈ రోజు పారాయణ పూర్తి అయింది. ఉదయం నుండి నేను గుడికి వెళ్లనే లేదు అనుకొని రాత్రి హారతికి వెళ్లి గుడిలో ప్రసాదం తీసుకుని రాత్రి 11 గంటలకు నడుచుకుంటూ ఒక్కదాన్నే వస్తూ
ఈ రోజు తిరుపతి ప్రసాదం రాలేదు షిరిడి ప్రసాదమూ అందలేదు అనుకుంటూ తలవంచుకుని నడుస్తున్నాను.
మా ఇంటి దగ్గరే ఉన్న అపార్ట్ మెంట్ లోనే ఒక ముసలాయన పైన అయిదవ అంతస్థు లో ఉంటాడు.
ఆయన నన్ను చూసి, ఇంత రాత్రప్పుడు నువ్వు ఒక్కదానివే వస్తున్నావు అంటూ పలకరించాడు. ఆ వయసులో ఆయన ఆ చలికి పడుకోకుండా బయటకి ఎందుకు వచ్చాడో తెలియదు.
నేను గుడికి వెళ్లి వస్తున్నాను అన్నాను. నీకు షిరిడి ప్రసాదం ఇస్తాను వుంటావా అని అడిగాడు. నాకాశ్చర్యం,ఆనందం రెండూ కలిగాయి.
ప్రసాదం గురించి అనుకుని రెండు నిమిషాలు కాలేదు సరే అంకుల్ తెచ్చివండి, నేను ఇక్కడే ఉంటానంటూ అక్కడే బెంచ్ పైన కూర్చున్నాను.
ఆయన ఒక్కటే పెడా ఉంది అంటూ 5 అంతస్తులు వెళ్లి పెడా ఒక్కటి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయనకు 75 సంవత్సరాలు. అది తీసుకుని ఇంటికి వచ్చాను సంతోషంగా.
మరోసారి కలలో అడవిలాగా ఉండి పొడవైన రోడ్డు పైన వెడుతున్నాను. ఎదురుగా పొడుగైన వ్యక్తి ఎదురు వస్తున్నాడు దగ్గర దాకా వచ్చాక తెలిసింది, అది బాబా అని ఆయన నడుచుకుంటూ వచ్చి ఆ ప్రక్కనే ఉన్న గ్రామ దేవత గుళ్ళోకి వెళ్ళిపోయాడు.
నేను గబగబా ఆ గుడిలోకి (చాలా చిన్నగా ఉందా గుడి) తొంగి చూసాను బాబా కోసం. నాకు గ్రామ దేవత తప్ప బాబా కనపడలేదు. నాకూ గ్రామదేవతకీ కూడా బేధం లేదని నాకు చెప్పినట్టనిపించింది.
మరోసారి పారాయణ అయ్యింతరువాత నాకు ఎవరు కనపడినా బాబా అనుకుంటాను.
యధాప్రకారం నేను గుడికి వెళ్లి వస్తుంటే ఒకతను పరిగెత్తుకుంటూ నా వెనకాల వచ్చి “దీదీ ముజే చాలీస్ రూపాయా ధో , మై షిర్డీ జాతూ అన్నాడు”. ఆయన బాబా గా భావించి తనడిగిన నలభై రూపాయలు ఇచ్చాను.
ఒకసారి మా పాప అడ్మిషన్ కోసం ఒక కాలేజీ కి వెళ్లాను. అక్కడికి ఒక సాయి భక్తురాలు వాళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చింది.
మా ఇద్దరికీ అంతకు ముందు పరిచయం ఏం లేదు. అప్పుడే పరిచయం.
ఆమె నేను ఇన్నింటికీ లేచి ఇన్ని ప్రసాదాలు చేస్తానంటూ చెప్పింది. ఇన్నిసార్లు పారాయణ చేశాను, ఇన్ని నైవేద్యాలు చేసాను అని నేను, నువ్వు 4 గంటలకి లేస్తే నేను 3 గంటలకే లేచి బాబా కి నేనన్నీ చేస్తానంటూ చాలా అహంకారంగా చెప్పాను.
మరునాడు ‘ఈనాడు’ పేపర్లో అంతర్యామి అనే శీర్షిక లో ఆధ్యాత్మిక విషయాలు ప్రచురింప బడుతాయి. అది నా కంట పడింది.
అందులో చాలా స్పష్టంగా “ప్రతి వెధవా కూడా నా పారాయణం అన్ని సార్లు చేశానంటూ గొప్పలు చెప్పుకుంటారే కానీ, అందులో తత్వాన్ని ఎవరూ కూడా అర్ధం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు.” అని రాసి ఉంది.
నాకది చదివేటప్పటికీ చెంప మీద చెళ్ళున కొట్టినట్లయింది. ‘ఏంటి బాబా ఇంత స్పష్టంగా తనవాళ్ళకి చెపుతాడా అనిపించింది.
ఒకసారి వేరే చూడకూడని బొమ్మలు చూస్తుంటే కూడా, నా నెత్తిన మొట్టికాయ వేసినట్లుగా T .V లో స్క్రోలింగ్ లో అడ్డమైన బొమ్మలు చూడకండి అని వచ్చింది. కానీ T .V లో అటువంటి స్క్రోలింగ్ లు వేయరు. కానీ నేను చూసాను.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
ఇందిరా దేవి గారి అనుభవములు నాల్గవ భాగం తరువాయి….
Latest Miracles:
- బాబా స్వప్న దర్శనం….
- సచ్చరిత్ర పారాయణ ఫలం …..సాయి@366 జూన్ 18…Audio
- పారాయణ ఫలం…..సాయి@366 జూలై 7….Audio
- ఆరోగ్యానికి సాయి సచ్చరిత్ర పారాయణ–Audio
- నేను మీకు బిడ్డనే కదా.మరి నాకు మీరెందుకు స్వప్న దర్శనం ఇవ్వట్లేదు ?
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments