నేను మీకు బిడ్డనే కదా.మరి నాకు మీరెందుకు స్వప్న దర్శనం ఇవ్వట్లేదు ?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!

అప్పటి వరకు వరుసగా గురువు గారు,బాబా ఏదో ఒకలా స్వప్న దర్శనాలు ఇచ్చేవారు కదా.నేను గురువుగా ఆక్సిప్ట్ చేసిన తరువాత ఆరోజు గురువు గారు కానీ,బాబా కానీ ఎవరూ కనిపించలేదు.నాకు దిగులుగా అనిపించింది.గురువు గారితో అన్నాను.

బాబా  తన బిడ్డ బాధ్యతని ఇప్పుడు మరొకరికి అప్పగించాను అన్నారు.అంటే మీకు అప్పగించారు.ఇన్ని రోజులు బాబా నాకు స్వప్న దర్శనాలు ఇచ్చేవారు కదా.ఇప్పుడు నా బాధ్యత మీకు అప్పగించారు కాబట్టి , ఇక నాది తన డ్యూటీ కాదు కాబట్టి బాబా నాకు స్వప్న దర్శనాలు ఇవ్వరు.ఓకే .కానీ ఇప్పుడు నా బాధ్యత మీది కదా !ఇక నుండి మీరు స్వప్న దర్శనాలు ఇవ్వాలి కదా.

బాబా నన్ను తన బిడ్డ  అని చెప్పారు.ఇకనుండి నా బాధ్యత మీది అయినప్పుడు నేను మీకు బిడ్డనే కదా.మరి నాకు మీరెందుకు స్వప్న దర్శనం ఇవ్వట్లేదు ?అని అడిగా .

ఆరోజు కలలో,నేను ఒక ఇంటిలో 1 .ఫ్లోర్ లో ఉన్నాను.కలలో అది నేను మా ఇంటి లగే ఫీల్ అవుతున్నాను.ఒక మిడిల్ ఏజ్ ఆవిడ(అమ్మగారిది అదే మొదటి దర్శనం సో,వెంటనే అమ్మగారు అని గుర్తుపట్టలేక పోయా,కానీ చనువుగా ఉంటున్నాను కలలో ) నాకు ప్లేట్ లో అన్నం,కర్రీ పెట్టి బాబా దగ్గర నైవేద్యం పెట్టు అని ఇచ్చింది.నేను అక్కడ రూమ్ లో ఉన్న బాబా ఫోటో ముందు ఆ ప్లేట్ ని పెట్టి నమస్కారం చేసుకుని బయటకు వచ్చాను.

గురువు గారు మెల్లిగా స్టెప్స్ ఎక్కుతూ వస్తున్నారు.నడుస్తున్నప్పుడు కాలు కొంచం డిఫరెంట్ గా నడుస్తున్నారు అనిపించింది.నేను గురువు గారిని చూసి పాపం గురువు గారు చాల దూరం నుండి అలిసిపోయి వస్తున్నారు. నేను గురువుగారు ఎక్కడికో వెళ్లారని తెలియక ఎందుకు నా దగ్గరికి రాలేదు అని అడిగాను.పాపం అలిసిపోయి నీరసంగా ఉన్నట్టున్నారు.యెంత దూరం నడిచారో ,కాళ్ళు నొప్పి పెడుతున్నట్టున్నాయి అనుకున్నారు.

ఇంతలో గురువుగారు నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏం కర్రీ అని అడిగారు.నేను కంద కూర అని చెప్పాను.అప్పడు గురువు గారు, కంద కూర నా. ఈరోజు కంద కూర అని నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అన్నారు.

నేను కొంచం భయం తో,నేను బాబా ముందు పెట్టాను.బాబా ముందు పెడితే ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది కదా అని చెప్పలేదు అన్నాను.

దానికి గురువు గారు చనువుగా నా వెనక నుండి భుజాలపై చేతులు వేసి,చనువుతో కూడిన అల్లరితో,ఆలా కాదు ఇప్పుడు నువ్వు వెళ్లి నాకు కంద కూర తీసుకురా అని,ఒక బిడ్డతో తండ్రి యెంత చనువుగా, అల్లరిగా అంటాడో అంట చనువుగా మాట్లాడారు.

నేను సరే తీసుకొస్తాను అని చెప్పి,ఇందాక నాకు బాబా కీ నైవేద్యం పెట్టుమని చెప్పిన ఆమెకి,గురువుగారు కంద కూర కావాలంటున్నారు అని చెప్పాను.తాను నవ్వి నాకు ప్లేట్ లో అన్నం,కూర పెట్టి ఇచ్చింది.నేను తీసుకెళ్ళేసరికి గురువుగారు భోజనం కోసం కింద కూర్చుని ఉన్నారు.ఆ ప్లేట్ ని గురువు గారి ముందు పెట్టాను.గురువుగారు తింటున్నారు.

ఇంతలో ఇందాక ప్లేట్ ఇచ్చిన ఆవిడ వచ్చి నాకు ప్లేట్ లో అన్నం కలిపి తెచ్చి నాకు తినిపిస్తుంది.ఒకవైపు గురువుగారు కింద కూర్చొని అన్నం తింటున్నారు.ఇంకో వైపు ఆవిడ ,నేను నిల్చొని ఉన్నాం. తాను నాకు అలాగే అన్నం తినిపిస్తుంది.

ఉదయం నాకు హ్యాపీ గా అనిపించింది.నిన్న నేను,బాబా కీ బిడ్డను ఐతే మీకు బిడ్డనే కదా అని అడిగినదానికి,గురువు గారు అమ్మగారు ఆలా తల్లిదండ్రులుగా కనిపించారు అని.

గురువుగారు తండ్రిలాగా ప్రేమగా,చనువుగా ఉంటే,అమ్మగారు తల్లిలాగే ప్రేమగా అన్నం తినిపించారు.నేను అప్పటి నుండి గురువుగారిని నాన్న అని పిలుద్దాం అనుకుని అలాగే పిలుస్తాను.

మా టెంపుల్ లో గ్యాంగ్ అందరు బాబా ని డాడీ అని పిలిచే వాళ్ళు కానీ, నేను ఎప్పుడు ఆలా పిలవలేదు.ఒకరోజు లావణ్య అడిగింది.మేమందరం బాబా ని డాడీ అంటాము.కానీ , నువ్వు అనవు ఎందుకు?అని.

ఏమో నాకు బాబాని చుస్తే ఆలా పిలవాలని అనిపించదు.ఆలానేను బాబా కీ బిడ్డని అని చెప్పేంత దైర్యం లేదు.యెందుకంటే నాకంత సీన్ లేదనుకుంటాను ఆ లక్షణాలేవి నాకు లేవనిపిస్తుంటుంది .

బాబా ని బాబా అని పిలవడమే నాకు ఇష్టం.ఒకవేళ ఆలా ఏదైనా బంధం తో పిలవాలి అంటే నేను తాత అని పిలుస్తాను.బాబా ని చూస్తే తాత లాగా అనిపిస్తాడు కానీ నాన్న లాగా అనిపించడు నాకు అని చెప్పాను.

ఇప్పుడు బాబానే తనంతట తానే నా బిడ్డ అని అన్నాడు.గురువుగారు కూడా తల్లిదండ్రుల లాగా ప్రేమని చూపించారు కాబట్టి నేను గురువు గారిని నాన్న,అని అంటే గురువుగారికి బాబా తండ్రి లాంటి వాడు కాబట్టి,బాబా నాకు తాత అవుతాడు.

తాత కూడా మనవరాలిని అప్పుడప్పుడు బిడ్డ అని పిలుస్తారు కదా సో ఇప్పటి నుండి బాబా ని తాత అని గురువుగారిని నాన్న అని పిలవాలి అనుకున్నాను.

మాములుగా అందరం నేను బాబా బిడ్డని అని అనుకుంటాము కానీ,స్వయంగా బాబా నోటి నుండే నన్ను నా బిడ్డ అని అనడం నాకు చాల హ్యాపీ గా అనిపించింది.

గురువు గారు పరిచయం అయిన కొత్తలో, నాకు షిరిడి వెళ్లి సాయిపథం ఎలా ఉంటుందో చూడాలనిపించి షిరిడీకి 2014 లో న్యూ ఇయర్ కీ వెళ్ళినప్పుడు రజని అక్క, గురు చరణ్ ని చూపించి ఇందులో గురువుగారు ఉండేవారు అని చెప్పింది దగ్గరికి వెళ్లి చూస్తే,అక్కడి నుండి స్టెప్స్ కనిపించాయి.

కలలో గురువుగారు స్టెప్స్ ఎక్కుతూ,ఇంట్లోకి రావడం గుర్తొచ్చింది.అచ్చు అలాగే ఉన్నాయి ఆ స్టెప్స్.అక్కని అడిగితే,పై ఫ్లోర్ లోనే గురువుగారు ఉండేవారు అని చెప్పారు.నాకు హ్యాపీ అనిపించింది.

ఆరోజు నుండి గురువు గారు, నువ్వు ఏదైనా అడుగు.సమాధానం ఇవ్వకుంటే,…అడుగు.అన్నట్టుగా నేను అడిగిన ప్రతిదానికి సమాధానం ఇస్తూనే ఉన్నారు.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు మా ఈమెయిలు:

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నేను మీకు బిడ్డనే కదా.మరి నాకు మీరెందుకు స్వప్న దర్శనం ఇవ్వట్లేదు ?

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles