Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీ బీ.వీ. నరసింహస్వామి — బాబాని పూజించే విథానం
ఈ రోజు మనము శ్రీ సాయి అంకిత భక్తులలో ఒకరైన శ్రీ బీ.వీ. నరసింహస్వామి (శ్రీ భవాని నరసింహస్వామి) గారిని గురించి కొంత తెలుసుకుందాము.
శ్రీ నరసింహస్వామి వారు 1874 సంవత్సరములో కోయంబత్తూరు జిల్లాలో భవాని అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1895 లో ఈయన సేలం పట్టణంలో ప్లీడరు గా పనిచేశారు. 1926 లో వానప్రస్థాశ్రమమును స్వీకరించి దేశంలో ఉన్న అన్ని తీర్థక్షేత్రాలని, సాథు సత్పురుషులని దర్శించారు.
సద్గురువు కోసం అన్వేషిస్తూ 1936 లో కుర్దీవాడి లోని నారాయణ మహరాజ్ అనే యోగిని సందర్శించారు. ఆయనని దర్శించేముందు తన మనస్సులో “నేను ఒక రత్న వర్తకుణ్ణి, సరైన జాతి రత్నం యెక్కడ లభిస్తుందొ తెలియచేయవలసినది” అని అనుకున్నారు. భక్తుల హృదయాలని గుర్తించే శక్తిగల నారాయణ మహరాజ్ గారు “నీవు షిరిడీకి వెళ్ళు. నువ్వు కోరుకునే మహారత్నం అక్కడ లభిస్తుంది” అని చెప్పారు. నరసింహస్వామి గారు షిరిడీకి బయలుదేరి మధ్యలో సాకోరి వెళ్ళి అక్కడ శ్రీ సాయిబాబాని సేవించిన శ్రీ కాశీనాథ్ గోవింద ఉపాసనీ మహరాజ్ ని దర్శించి అక్కడ కొంతకాలం ఉన్నారు.
తరువాత శ్రీ నరసింహఅయ్యరు గారు సాకోరికి 3 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీ కి చేరారు. శ్రీ సాయిబాబా సమాధిని దర్శించారు. సమాధిమందిరంలో, ద్వారకామాయి మసీదులో, ధుని ముందు, బాబా భౌతింకంగా ఉన్నప్పుడు కూర్చున్న ప్రదేశంలో తాను కూర్చుని బాబాని ధ్యానించారు.
అక్కడ ఒకరోజున సమాధి మందిరంలో బాబా సమాధి దగ్గర ధ్యానంలో కూర్చుని “బాబా నీ అనుగ్రహానికి పాత్రుడనైతే, శ్రీ సాయి భక్తిని వ్యాపింప చేసే భాగ్యం నాకు కలిగే యెడల ఒక పిచ్చుక నా తలపై చేరి కూర్చుండేటట్లు అనుగ్రహించు” అని ప్రార్థించారు. అలా శ్రీ నరసింహస్వామిగారు ధ్యానంలో ఉండగా ఒక పిచ్చుక వచ్చి వారి తలపై నిలిచింది. బాబా గారి అనుగ్రహం ఈ విధంగా లభించింది ఆయనకి.
ద్వారకామాయి మసీదు నందు, సమాధిమందిరము నందు, బాబా చిత్ర పటముల ముందు ధ్యాననిష్ట యందు వారికి సచ్చిదానంద స్థితి లభించింది.
శ్రీ నరసింహస్వామి గారు సాయి ప్రచారాన్ని నిరాడంబరంగా చేసేవారు. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక సాయిబాబా పటం ఉండేది. ఎక్కడకు వెళ్ళినా సత్సంగంలో ఆ పటాన్ని ఉంచేవారు. బాబా ఫోటోలు, లాకేట్లు భక్తులకి పంచిపెడుతూ ఉండేవారు. శ్రీ సాయిబాబా అనుగ్రహాన్ని పొందటానికి యేమి చేయాలో శ్రీ నరసింస్వామి గారు భక్తులకు యిలా చెప్పేవారు:
“నీ పూజా మందిరంలో బాబా చిత్రపటాన్ని యెత్తైన ఆసనం మీద ఉంచు. దానిని పుష్పాలతో అలంకరించు. మువ్వత్తుల దీపమును వెలిగించాలి. అగరువత్తులను వెలిగించాలి. అక్కడ పాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తాంబూలము ఉంచాలి. బాబా కి సాష్టాంగనమస్కారం చేసి ఆసనముపై అమర్చిన బాబా పటానికి ఎదురుగా కూర్చోవాలి.
నీ చూపుని బాబా నేత్రముల మీద కేంద్రీకరించాలి. అష్టోత్తర శతనామములతో బాబాని అర్చిస్తూ పువ్వులతో పూజించు. నీకు చేతనైన విధంగా బాబాని సేవించు. బాబాని కీర్తనల ద్వారా ప్రార్థించు. నువ్వు సమకూర్చుకున్న పదార్థాలని సాయికి నివేదించు. తరువాత కర్పూరహారతి ఇచ్చి బాబాకు నమస్కరించు. గురు, శుక్ర, శనివారములలో నీ కుటుంబములోని వారితో గాని, అక్కడ చేరిన భక్తులతో గాని భజనలు చేయి.
ఈ విధంగా తన శక్తి కొలది బాబాని సేవించేవాడు శీఘ్రకాలంలో శ్రీ సాయిబాబాని దర్శించగలడు. బాబా కరుణకి పాత్రుడౌతాడు. ఆది వ్యాధులని పోగొట్టడానికి బాబాని ప్రార్థించి, ఊదీని ఉపయోగించు.”
బాబా కరుణతో కొందరు కొన్ని శక్తులు పొందవచ్చు. అలా పొందినవారు తానే సాయి అని భావించుకొని యితరుల వ్యాధి నివారణలు చేయడం తన శక్తి అని భావించేవారు తమ జీవిత లక్ష్యాన్ని పొందలేరు. అలా వచ్చిన శక్తి, వ్యాధులు తగ్గుట అంతా శ్రీ సాయిబాబా కరుణయే అని గుర్తుంచుకోవాలి.
చదివారుగా శ్రీ బీ.వీ. నరసింహస్వామి వారి గురించి క్లుప్తంగా, యింకా సాయిని సేవించే విధానం గురించి ఆయన చెప్పిన విషయాలు. ఇవన్నీ కూడా మనం ఆచరణలో పెట్టి మన సాయికి అంకిత భక్తులుగా ఉందాము. మనలో ఏశక్తి వచ్చినా అంతా సాయి ద్వారానే జరుగుతోందని మాత్రం భావించాలి. అందుచేత, ‘అంతా నేనే చేస్తున్నాను’ అనే అహంకారం ఉండకూడదు. ఆయన అనుగ్రహమే లేకపోతే మనలో ఏవిధమైన శక్తి ఉండదు. మనం ఉట్టి అనామకులం మాత్రమే.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బి.వి.నరసింహస్వామి
- దర్శనం…. మహనీయులు – 2020… అక్టోబరు 19
- డ్రైవర్ ఇంజనును నడుపుటకు ప్రయత్నించినాడు. కాని రైలు కదలలేదు.–Audio
- వీరిని చావకుండా రక్షించినవారు శ్రీసాయిబాబాయేయని శ్రీ రాధాకృష్ణస్వామి గ్రహించిరి–Audio
- యిస్తానన్నది మరి అడిగి తీసుకుంటారు బాబా–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments