బి.వి.నరసింహస్వామి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

మద్రాసు రాష్ట్రములోని – కోయంబత్తూరులో 1874లొ జన్మిచిన శ్రీ బి.వి.నరసింహస్వామి వారు బి.యల్ పట్టా పొంది న్యాయవాద వృత్తి ప్రారంభించిరి. 1895లొ సేలంలో స్థిరనివాసులైరి. సేలం పురపాలక సంఘమునకు అద్యక్షులైరి. అన్ని రంగములలో ప్రఖ్యాతి చెందిన వీరు విషాద సంఘటనలతో వారి జీవితమూ మార్పు చెందినది. కొంత కాలమునకు వారి పెద్ద కుమారుకు మరణించుట, అటు తరువాత కొంత కాలమునకు వారి ఇద్దరు పుత్రులు యింటి అవరణలొని బావిలో పడి మరణించుట, వీరిని దు:ఖ సాగరమున ముంచగా మనశ్శాంతిని పొందుటకు ఎన్నో పుణ్యక్షేత్రములు, ఆశ్రమములు దర్శించినను ఫలించలేదు. అట్టి సమయములో “ఒక సద్గురువును ఆశ్రయించి సర్వస్య శరణాగతి అయిన కైవల్యము సిద్దించును” అని ఒక సాధువు వీరికి చెప్పిరి.
అలా గురువు కొరకు అన్వేషణ చేయుచు తిరుగుచుండగా, 1936లొ కుర్దీవాడీలో నారాయణ మహారాజ్ అను యోగిపుంగవులను దర్శించ “నీవు షిరిడీకి పొమ్ము. అచ్చట నీవు కోరుమహరత్నము(గురువు) లభించును” అని తెలిపిరి. శ్రీ నరసింహస్వామి మార్గమధ్యములో సాకోరివెళ్ళి అచట ఉపాసనీ మహారాజ్ ను దర్శించి కొంతకాలమచట  యుండి 1936లొ షిరిడీ చేరిరి.
కోరగానే బాబా పిచ్చుక రూపమున అనుగ్రహించుట: శ్రీ నరసింహస్వామి గారు షిరిడీ చేరి సమాధి మందిరములో, ద్వారకామాయి మసీదులో, ధుని ముందు,బాబా అప్పుడు కుర్చుండు ప్రదేశములలో కూర్చుండి ధ్యానము చేసి మనశ్శాంతిని పొందిరి. వారికి సాయితత్త్వమును ప్రచారము చేయ సంకల్పము కలిగినది. వెంటనే సమాధి మందిరములో బాబా సమాధి ముందు కూర్చొని “నేను మీ అనుగ్రహముతో ఈ ప్రపంచమున మీపై భక్తిని వ్యాపింప చేయు భాగ్యము మీరు కలిగించుటకు గుర్తుగా నా తలపై పిచ్చుకగా నిలువుడని ప్రార్ధించి ధ్యాన నిష్ఠలోకి వెళ్ళిరి. ఆ ధ్యాన నిష్ఠలో యుమ్దాగా బాబా నరసింహస్వామి కోరినట్లు పిచ్చుకగా వచ్చి వారితలపై నిలిచి తన తత్త్వప్రచారమునకు అనుమతి యిచ్చిరి. ఎంత అద్భుతమా పిచ్చుకలీల. బాబా అప్పటి కన్నా ఇప్పుడే సులభ ప్రసన్నులైరి కదా! ఆ విధముగా బాబా అనుగ్రహము పొంది నరసింహస్వామి ప్రచారమునకు సన్నద్దులైరి. బాబా వారు 1918లొ దేహం త్యజించిన తరువాత 18 సంవత్సరాలకు అనగా 1936లొ జరిగిన సంఘటన ఇది.

సంపాదకీయం: సద్గురులీల ( ఫిబ్రవరి – 2014)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles