ప్రేలుడు కి గురయైన రైలు ని తప్పించిన వైనం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

ఒకసారి ఇండియాకి సెలవులు గడపడానికి వెళ్ళినప్పుడు షిరిడీ వెళ్లాను. అక్కడ ఓ పెద్దాయన తో పరిచయమైంది, వారికి చాలా జ్ఞానముంది, నా ప్రశ్నలెన్నిటికో వారు సమాధానాలిచ్చారు. అందుచేత ఆయనని నేను గురూజీ గా సంబొధించేదానిని. గురూజీ అంబర్ నాధ్ లో నివసించేవారు, నాకు తరచుగా ఉత్తరాలు వ్రాస్తూండేవారు, షిరిడీ విశేషాలను తెలుపుతూ వుండేవారు. ఒక్కోసారి ఆయన చదివిన సాయి సాహిత్యంలోని పుస్తకం లోని ఒక పేరా గురించి మాట్లాడేవారు, దాని అర్దాన్ని వివరించేవారు, చికాగో లో వున్నంతకాలం ఆయన వుత్తరాలు అందుకున్న నాకు ఆనందం కలుగుతూ వుండేది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండియా వెళ్ళినప్పుడు, పూనా వెడితే, అంబర్ నాధ్ లో వున్న ఆయన ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. గురూజీ ఇల్లు రైల్వే స్టేషన్ కి ఎదురుగానే వుండడంతో ఆయన ఇంటి బాల్కనీలోనుండి రైళ్ల రాక పోకలను చూడవచ్చు.

ఆ సమయంలో చాలా అశాంతి గా వుండేది, రైళ్లను ప్రేల్చివ్రేసిన సంఘటనలు ఎన్నో. కొన్ని రోజులు గురూజీ తో సంతృప్తి గా గడిపిన తర్వాత పూనాకి వాపసు పోదామనుకుని బాల్కనీ లో నిలబడి రైలు రాక కోసం ఎదురుచూస్తున్నాము. రైలు రావడం చూసిన గురూజీ నువ్వు త్వరత్వరగా వెళ్లగలిగితే ఆ రైలులో ఎక్కగలవు అన్నారు. నేను గురూజీకి పాదనమస్కారము చేసి బయలు దేరాను, కానీ రోడ్డదాటుతూండగా బాగా పండిన ఆపిల్ పండ్లను చూసి మా నాన్నగారికిష్టమని కొన్నాను, ఎందుకో తెలియదు కానీ కొంతసమయం అటూ ఇటూ అయిన తర్వాత టిక్కెట్టు కొనుక్కుని ప్లాట్ ఫారం మీదకు వెళ్లేడప్పటికి నేనెక్కాల్సిన రైలు చివరి బోగీ స్టేషన్ ని వదిలి వెళ్లిపోతోంది. ఆ వేగంలో ఆ రైలు ని అందుకోలేనని నాకు తెలుసు. మరో గంట తర్వాత వచ్చే రైలు లో వెడదామని అనుకున్నాను.

ఇంతలో అత్యవసర రైళ్లు కొన్ని ఆ మార్గం గుండా వెళ్లడమూ, అక్కడున్న రైల్వే వుద్యోగులలో ఉద్వేగపూరిత వాతావరణాన్నీ గమనించాను. చివరికి అక్కడున్న ఒకరిని పూనాకి తరువాయి బండి ఎన్నిగంటలకి వస్తుందని ప్రశ్నించాను. ఆయన తనకి తెలియదన్నాడు,  చివరికి విధినిర్వహణలో వున్న ఒక వుద్యోగి దగ్గరకు వెళ్లి అదే ప్రశ్నని ’ఏమి జరిగింది, అర్దరాత్రి కావస్తోంది, ఇంకా పూనా పోవల్సిన రైలు రాలేదు’ అని అడిగాను. అంతకు ముందు వెళ్ళిన చివరి రైలు బయలు దేరిన పదిహేను నిముషాలలో ప్రేలుడికి గురయ్యిందనీ, ఎందరో గాయపడ్డారని చెప్పారాయన. ఆయనలా చెప్పిన వెంటనే మోకాళ్లపై కూలబడి ఆ రైలు తప్పిపోయేలా చేసి, నన్నుకాపాడిన బాబా కి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. చివరికి కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ లో మరునాడు ఉదయం ఆరు గంటలకి పూనా చేరుకున్నాను.

విన్నీ చిట్లూరి ద్వారా వ్యక్తీకరణ.
అనువాదము, సేకరణ: సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, whatsapp 7033779935, Voice call: 9437366096.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ప్రేలుడు కి గురయైన రైలు ని తప్పించిన వైనం

W.Krishna Murthy

Very good experience

W.Krishna Murthy

Very good experience

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles