రైలు ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన బాబా గారు.(బాబా పైన ఉన్న భక్తి ఎదుటి వ్యక్తిని కాపాడే శక్తి గా మారిన కథ).



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భరత్ రావు గారి అనుభవములు ఐదవ భాగం

మేము ఒక సారి షిరిడి యాత్రకి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడు షిరిడికి వెళ్ళినా 40 మంది దాకా కలిసి రిజర్వేషన్ చేయించుకుని మేముగా గానీ వేరే బృందంతో కానీ వెళుతూ ఉంటాము.

ఒకసారి శ్రీ సాయి విశ్వచైతన్య స్వామి బృందం తో కలసి వెళ్ళాము. రాత్రంతా సాయి నామం చేసుకుంటూ అందరమూ చాలా సరదాగా ఒక కుటుంబం లాగా ప్రతి సంవత్సరం వెడుతూ ఉంటాము.

రైలు నాగర్ సోల్ చేరింది. అందరమూ రైలు దిగుతున్నాము. ఆ స్టేషన్ లో రైలు ఎక్కువసేపు ఆగదు.

ఇంతలో మాతోపాటు వచ్చిన ముసలావిడ రైల్ లోనే ఉండిపోయింది అన్నారు ఎవరో. నేను వెంటనే ఆవిడని పిలవటానికి రైల్ లోకి వెళ్లి ఆవిడను లేపి నేను, ఆవిడ రైల్ దిగాము.

ఇంతలో అదే రైల్ నుండి ఒకాయన గేట్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే రైలు కదులుతుంది.

కదులుతున్న ఆ రైలు నుండి ఆ పెద్దమనిషి హఠాత్తుగా దూకేసాడు. దూకటంలో అదుపు తప్పి రైల్ కి ఫ్లాట్ ఫారంకి మధ్యలో పడిపోయాడు.

నేను ఫ్లాట్ ఫారం మీదే ఉన్నాను. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి నేను వెంటనే స్పందించి అతన్ని బయటకు లాగుదాం అని పట్టుకున్నాను.

నాకు అతని చొక్కా కాలర్ మాత్రం దొరికింది. రెండు అంటే రెండు వేళ్లతోనే ఆ కాలర్  పట్టుకోగలిగాను.

ఆ రెండు వేళ్లతోనే అతన్ని బలంగా ప్లాట్ ఫారం మీదకి లాగాను. అంత బలం నాకు ఎక్కడిదో! ఆ రెండు వేళ్ళకు ఆ బలం ఎలా వచ్చిందో ? ఆ బాబాకే తెలియాలి.

ఆ లాగటంలో అతను నా మీద పడ్డాడు. ఇద్దరం కింద పడ్డాము. మాకు ఏ దెబ్బలు తగలలేదు. నా వేళ్ళు మాత్రం అతని షర్టు కాలర్ ను విడిచి రాలేదు.

బంకతో అతికించినట్టుగా అతని షర్టుకి అతుక్కుపోయాయి. ఆ తరువాత కొంతసేపటికి ఊడి వచ్చాయి.

బాబా కాపాడకపోతే (ఆ లీల జరగకపోతే) అతనికి అదే రోజు ఆఖరి రోజు అయ్యేది. ఆ తరువాత అతను శ్రీ సాయి సత్యవ్రతం చేసుకున్నాడు.

నా వయసు 60 సం లు, ఆ పడ్డ అతనికి కూడా అంతే వయసు ఉంటుంది.

అతన్ని లాగటానికి నా శక్తి ఎలా సరిపోతుంది? అందులోను రైలుకి ప్లాట్ ఫారంకి మధ్యలో పడి రైలు కదిలిపోతుంటే రైలు మనిషిని లాగేస్తుంది.

చాలా ప్రమాదం, అటువంటిది అక్కడ, బాబా దయ లేకపోతే నేను అతన్ని లాగా లేను, పైగా ఇద్దరికీ ఎటువంటి దెబ్బలు తగలలేదు. ఇది బాబా లీల కాదా?

The above miracle has been typed by: Shiva Kumar Bandaru

భరత్ రావు గారి అనుభవములు ఆరవ భాగం తరువాయి…..

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles