Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సాయిని దర్శించిన మద్రాసీ దంపతులలో భర్త పేరు గోవింద స్వామి. అన్ని వేళ్లు ఒకేలాగా ఉండనట్లు, సాయి సందర్శకులు ఒకేలాగా ఉండరు, ఒకేలాగా స్పందించరు కూడా.
గోవింద స్వామి భార్యకు సాయికి బదులుగా రఘరాముని దర్శనమైంది. ఆమె పులకించిపోయింది.
ఆ విషయాన్ని భర్త గోవింద స్వామికి చెప్పగా అతను ఆమెను పరిహసించాడు. మంచి గాని చెడు గాని తనదాకా వస్తే గాని నమ్మని వారుంటారు. వారిలో ఒకడు గోవింద స్వామి.
ఆనాటి రాత్రి అంటే సెప్టెంబరు 3, 1915న గోవింద స్వామికి స్వప్నం వచ్చింది.
పోలీసు అతడి రెక్కలను వెనుకకు విరిచి త్రాడుతో కట్టి బిగించి, పంజరంలో పెట్టాడు. సాయి పంజరం బయట ఉండి సాక్షీభూతుని వలె ఉన్నాడు.
గోవింద స్వామి ”నీ కీర్తి విని, నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా నిచట నిలచి యుండగా, ఈ ఆపద నాపై పడనేల?” అని వాపోయాడు.
”నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింప వలెను” సాయి జవాబు అది.
”ఈ జన్మలో నాపై ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు” అన్నాడు గోవింద స్వామి.
”ఈ జన్మలో కాకున్న గత జన్మలో నేమయినా పాపము చేసి యుండవచ్చు గదా?” అని సాయి అన్నాడు.
”నా గత జన్మలో ఏమయిన పాపము చేసి యున్నచో నీ సముఖమున దానినేల నిప్పు ముందు ఎండు గడ్డి వలె భస్మము కారాదు?” అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు గోవింద స్వామి.
”నీకట్టి విశ్వాసము కలదా?” సాయి ప్రశ్నించాడు. గోవింద స్వామి ”కలదు” అన్నాడు.
సాయి అతనిని కండ్లు మూసుకొనుమనెను. అతడు కండ్లు మూసి తెరచునంతలో అతడు బంధ విముక్తుడై ఉండెను.
సాయి ఈ స్వప్నంలో అందరకు కర్మ, దాని నివారణ తెలుపుతున్నాడని గ్రహించాలి.
మంచి గాని, చెడు గాని అనుభవానికి రావటానికి కర్మ కారణం అవుతుంది. అయితే ఆ కర్మను నిర్మూలించ గలిగేది సద్గురువే అని స్పష్టంగా తెలియ చేస్తుంది ఈ స్వప్నం.
అయితే ప్రతి వ్యక్తి, సద్గురు దర్శనంతో పాపపంకిలం నుండి విముక్తుడు కావాలి గదా? అలా ఎందుకు జరుగుట లేదు? అందుకు కారణం కూడా ఈ స్వప్నమే తెలుపుతోంది.
భక్తులకు సాయి ”కర్మ ధ్వంసి” అను విషయము నందు దృఢ విశ్వాసం ఉండాలి.
ఓం కర్మ ధ్వంసినే నమః
Compiled By:- ముళ్ళపూడి పాండు రంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఏమి నీ కోరిక? …..సాయి@366 సెప్టెంబర్ 4…Audio
- గోవింద రాం రాం గోపాల హరి హరి … మహనీయులు – 2020 – జనవరి 13
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
- ఓం చితంబరాయ నమః…. మహనీయులు – 2020… మార్చి 7
- కావవే మహానుభావ కరుణతో …. మహనీయులు – 2020… సెప్టెంబరు 13
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments