ఏమి నీ కోరిక? …..సాయి@366 సెప్టెంబర్ 4…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిని దర్శించిన మద్రాసీ దంపతులలోని భర్త పేరు గోవింద స్వామి. ఆయనకు సెప్టెంబరు 3, 1915న స్వప్నము వచ్చినది.

ఆ స్వప్నము సెప్టంబరు 3 అర్ధరాత్రిలోపు వచ్చి యుండవచ్చును,  లేదా అర్థరాత్రి దాటిన తరువాత 4న స్వప్నము వచ్చి యుండవచ్చును.

4న స్వప్నము వచ్చినచో స్వప్నము నందలి మరియొక విశిష్ట అంశమును గమనించ వచ్చును.

గోవింద స్వామి జైలు నుండి బయటపడ్డాడు. సాయి, గోవింద స్వాములు సంభాషించుకొన్నారు.

ఎన్నో ఏండ్లుగా సాధన చేస్తే గాని గురు దర్శనం లేదా దైవ దర్శనం లభించదు.

సాయిబాబా తన భక్తుల, సందర్శకుల భక్తి ప్రపత్తుల ననుసరించి, కోర్కెలు తీర్చేవారు.

బాబా తన భక్తులను ”నీకు ఏం కావాలి?” అని అడిగిన సంఘటనలు చాలా అరుదు. అలా సాయిచే అనుగ్రహింపబడిన వారి భక్తిని అంచనా వేయజాలము.

కొద్ది నిమిషాల వరకు సాయి అంటే గిట్టేది కాదు గోవింద స్వామికి. కానీ, ఆయన ఇవ్వబోయే ధనంపై ఆశతో ఉన్నాడతడు.

ఆ ఆశ జలగ వలె పీడించింది. ఆసహన పరునిగా చేసింది. అటువంటి వ్యక్తిని ”ఏమి నీ కోరిక” అని సాయి ప్రశ్నించటం ఆశ్చర్యకరమే అవుతుంది.

కొన్ని ఏండ్లుగా సాయిని నమ్ముకుని జీవిస్తున్న వారికి కలలోనైనా సాక్షాత్కరించని సాయి, గోవింద స్వామిని ఏదైనా కోరుకొమ్మనటంలో ఏదైనా కారణం దాగి ఉండవచ్చును.

అంతవరకు సాయి అంటే సదభిప్రాయం లేని గోవింద స్వామి, తన కష్టం నుండి (చెరసాల – పోలీసు – పంజరం బారి నుండి) గట్టెక్కించే సాధనంగా సాయి అతనికి కనబడ్డాడు.

సాయి అంత మాత్రంతో సంతసించడు. అతడిని పరీక్షించేందుకే ఏమి కావాలని అడిగాడు.

అతడు ఇంకా దురాశాపరుడుగా, ధనముపై వ్యామోహము ఉన్నవాడైన నిస్సంకోచముగా ధనమునే కోరి యుండెడివాడు.

అతడు ధనాన్ని కోరలేదు, తీర్థయాత్ర సుఖంగా జరగాలనీ కోరలేదు.

అతడు సజ్జనుడయ్యాడని భావించ వచ్చునా? అతడు ఆపదలో ఉన్నప్పుడు తన గురువును స్మరించ లేదు. ఎదురుగా ఉన్న సాయిని ప్రార్ధించాడు. ఇలా ఏ శిష్యుడు చేయరాదు.

ఆపద నుండి గట్టెక్కిన క్షణం, సాయి కోరుకోమనగానే, తన గురు దర్శనం కోరాడు. ఇదే సాయి కోరేది.

నిజానికి సాయి ఎవరైనా తన గురువును కాదని తనని పూజిస్తే సంతోషించడు. ఎవరు గురువులో, వారి వద్దకే సాయి తన సందర్శకులను చేరుస్తుంటాడు.

సాయిని కలలో సైతము మరువకుందుము గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By:  Mr:  Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles