Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
షేగాంలో గజానన్ మహారాజుండే వారు. ఒకసారి ఆయన తన భక్తుడైన భాస్కర్‌ను క్రిందపడవేసి, గుండెల మీద బలంగా మోదుతున్నారు.
బాలాభావ్ అనే మరో భక్తుడు అలా భాస్కర్‌ను మోదవద్దని ప్రార్ధించాడు. కాని భాస్కర్ ”ఆయన నా గురువు, దైవం, ఆయనను ఇష్టం వచ్చినట్లు చేయనీ. నాకు బాధలేదు సరికదా చక్కలిగింతలు పెట్టినట్టుగా ఉన్నది” అన్నాడు. అదేమి మాయయో ఎవరికి తెలుసు
నాథ సాంప్రదాయనికి చెందిన రామ మారుతీ బువ ఒకసారి మధ్యాహ్న ఆరతి జరుగుతుండగా సాయిని దర్శించాడు.
సాయి ఆరతిని తాత్కాలికంగా ఆపుచేయించి ఆయనను కౌగిలించుకుని తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. అటు తరువాత ఆ ఆరతిని కొనసాగించమన్నారు సాయి. ఇది రామ మరుతికి సాయి ఇచ్చే గౌరవం
రామ మారుతి సాయిబాబాను అధినాథుడు అనేవాడు. సాయిబాబా రామ మారుతిని భుజంగనాథుడు అనేవారు.
రామ మారుతి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా, ఆయన మామూలు భక్తునిగానే, మామూలు మనిషిగానే ప్రవర్తించేవాడు.
రామ మారుతి భజన సమయంలో గంతులు వేస్తూ చక్కగా నృత్యం చేసేవాడు. అది అందరికి ఎంతో చూడ ముచ్చటగా ఉండేది.
ఈయన ధ్యానం చేసేటప్పుడు భూమి నుండి ఎంతో ఎత్తుకు లేచేవాడు. ఆయనను అందరూ హనుమంతుని అవతారం అనేవారు
ఒకసారి ఆయన షిరిడీలో ఉన్నప్పుడు, సాయిబాబాకు ఎవ్వరి మీదానో కోపం వచ్చి ఆరతి సామగ్రిని, ప్రసాదం పళ్ళాలను దూరంగా నెట్టివేశారు.
ఆక్కడే ఉన్న రామ మారుతి బువాను ఎత్తి పారేశాడు. బువా ఆ సమయంలో తనకు అపారమైన ఆనందం కలిగిందని, ఉత్తమ లోకాలకు పంపినట్లు అనిపించిందని అన్నాడు
సద్గురువుగా ఖ్యాతి పొందిన రామ మారుతి బువా సెప్టెంబరు 28, 1918లో మహా సమాధి చెందారు. ఆయన సమాధి కళ్యాణ్‌లో ఉన్నది.
ఆయన 22 నామాల భాషను స్మరిద్దాం:
శ్రీరామ, జయ రామ, జయ జయ రామ, రామచంద్ర, రఘువీర, రఘుపతి, శివశంకర, భీమ శంకర, హర హర మహాదేవ, శివ శివ, విఠల, విఠోబా, పాండురంగ, గోవింద, గోపాల, గణపతి, హరి, గోపాలకృష్ణ, హరి నారాయణ, దత్తాత్రేయ, మారుతి, బలభీమ.
రామ మారుతిని స్మరిద్దాం! తరిద్దాం!!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సర్వ శక్తి సంపన్నుడు సాయి–Audio
- దెబ్బకు దెబ్బ…..సాయి@366 నవంబర్ 21….Audio
- గద్దె మీద బాబా లేరప్పుడు. అక్కడ మారుతి కూర్చుని ఉన్నాడు.
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
- దృఢ నిశ్చయానికి ఊతం సాయి …..సాయి@366 సెప్టెంబర్ 25…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments