Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సద్గురువులంతా ఒకటే. పేరు, రూపము, కాలములలోనే మార్పు కనిపిస్తుంది. సాయిబాబా, శేషాద్రి స్వామి సమకాలికులు
ఇద్దరూ బ్రహ్మచారులే. ఇద్దరూ తమ, తమ నివాసముల నుండి వేరొక చోట నిద్రించనే లేదు.
ఇద్దరూ భక్తుల భౌతిక కోర్కెలు తీర్చేవారే, ఇంకా ఆధ్యాత్మి పధం వైపు నడిపే వారు కూడా. ఇద్దరికి జాతి, మత, భాషా ద్వేషాలు లేవు. ఆ ఇద్దారు చేసే చేష్టల భావం అర్థం కాదు.
ఒక రోజు శేషాద్రి స్వామి ఒక శవ ఊరేగింపులో వెనుక వెళ్ళారు. శవాన్ని తాకి ఆశీర్వదించారు. అక్కడ నుండి దారిలో ఒక పెండ్లి జరుగుతున్న ఇంట్లోకి నేరుగా ప్రవేశించారు.
శవ ఊరేగింపులో వెళ్ళిన స్వామి కల్యాణ గృహంలోనికి ప్రవేశించటాన్ని చూచి కొందరు మనస్సులోనే ఆయనను తిట్టుకున్నారు, మరి కొందరు మొహాలు మాడ్చుకున్నారు.
అయినా ఆయన నేరుగా వంట ఇంట్లోకి వెళ్ళి సాంబారు కాస్తున్న అండాను నేల మీద పడవేశారు. సాంబారంతా నేలపాలైంది. నేలపాలైన సాంబారులో ఒక నాగు పాము చచ్చిపడి ఉంది.
శేషాద్రి స్వామి అలా చేయకుంటే ఎంతమంది చనిపోయేవారో ఆ సాంబారు తిని. అందరూ శేషాద్రి స్వామికి భక్తి ప్రేమలతో మొక్కారు.
సాయిబాబాను గురించి శ్రీ శివనేశన్ స్వామి గారు ఒక సంఘటనను తెలిపారు.
ఒకసారి బాబా, డేంగ్లే ఇంటికి పోగా అక్కడ ఉన్న పెరటిలో ఒక చెట్టుపై రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయి. పక్షి భాష తెలిసిన డేంగ్లేను సాయి ఆ సంభాషణను తనకు చెప్పమన్నారు.
ఆ రోజు షిరిడీలోని శనేశ్వరునకు సమర్పించే ప్రసాదాంలో విష సర్పం మరణించిందని, ఆ విషాహారం తిని 9 మంది భక్తులు మరణిస్తారని పక్షులు అనుకుంటున్నాయని డేంగ్లే చెప్పాడు.
వెంటనే సాయి టాంగా కట్టించుకుని షిరిడీకి వచ్చి భాగోజీ షిండేతో ఆ విషం కలిసిన ప్రసాదాన్ని నేలపాలు చేయించారు. అక్కడున్న వారు భాగోజీని కొట్టబోయారు.
సాయి వారిని వారించి, ఆ ప్రసాదంలో చచ్చిపడి ఉన్న పామును చూపారు. తమ ప్రాణాలు కాపాడినందుకు సాయిని కీర్తించగా బాబా ఆ కీర్తి డేంగ్లేకు చెందుతుందని చెప్పారు.
శ్రీమతి ఉమాదేవి అమ్మాళ్ శేషాద్రి స్వామి శిష్యురాలు. సాయి, శేషాద్రి స్వామి ఇరువురు ఒక్కటేనని తెల్పింది.
సాయినాథుడు సూక్ష్మ రూపంలో శేషాద్రి స్వామిని కలసినట్టుగ కూడా చెప్పింది.
ఆనాడు 24 సెప్టెంబరు 2000 స్థూల రూపంలో మరల వచ్చారని మాతాజీ చెప్పారు. సత్యమే అనునట్లు సాయీ శేషాద్రుల మూర్తుల నుండి రెండు పుష్పాలు రాలి పడ్డాయి.
”నమామీశ్వరం సద్గాురుం సాయినాథం”
”ఓం సద్గురు శేషాద్రి స్వామిగల్ తిరువడిక్క్తె”
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శేష మార్గము … మహనీయులు @2020 – జనవరి 4
- ఓం కర్మ ధ్వంసినే నమః…..సాయి@366 సెప్టెంబర్ 3….Audio
- గండాలు తప్పించే ‘గుండం’…..సాయి@366 ఆగస్టు 24….Audio
- అనుమానించకు! …. మహనీయులు – 2020… నవంబర్ 24
- దృఢ నిశ్చయానికి ఊతం సాయి …..సాయి@366 సెప్టెంబర్ 25…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments