Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
లలితానందస్వామి ఎవరో నిర్దారించ లేకపోయారు. కొందరు ములికి నాటి బ్రాహ్మణుడంటారు. సయ్యద్ మరుక్కాయర్ స్వామి తన సోదరుడంటారు, జయపురం లోని క్రైస్తవ వనిత తన భర్త అంటుంది ఆయనను.
ఆయనను సుబ్రహ్మణ్యంశుడంటారు. చరమ జీవితం తిరువణ్ణామలైలోని శేషాద్రి ఆదేశం ప్రకారం పశుమలలో గడిపారు. ఈయనను వాడదేవుల లలితానందుడంటారు.
ఈయన ఒకసారి యజ్ఞము చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని చూడటానికి ఎందరో వచ్చారు.
దుగ్గిరాల నుండి ఒక భక్తుడు తన భార్యను కాళ్లు లేని కుమారుని వద్ద ఉంచి వచ్చినాడు. అయితే ఆయన భార్యకు యాగం చూచే భాగ్యం లేకపోయే గదా అని విలపించసాగింది.
లలితానందులు ఆమెకు స్వప్నంలో కనిపించి, తృటికాలంలో యాగశాలకు తీసుకువచ్చి, విశేషాలన్నీ చూపించి, మరల ఇంటికి చేర్చారు.
ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు తెలియని యాగశాలలోని విశేషాలను ఆమె చెబుతుంటే, ఆశర్యపోయాడు. బంధువులు కూడా లలితానందుల కరుణకు ముగ్దులయ్యారు.
స్వామి అనేక యాగాలను చేసేవారు. అందుకు డబ్బు ఎలా వచ్చేదా అని భక్తుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
స్వామి ఆ వ్యక్తికి పిలిచి తన పెట్టెను చూడమన్నారు, అది ఖాళీగా ఉంది. అందులోంచి ఒక సంచీని ఆయన బయటకు తీసారు.
అది కూడా ఖాళీగానే ఉన్నది. ఆ ఖాళీ సంచిలో స్వామి చేయి దూర్చి గుప్పిళ్ల కొద్ది నోట్ల కట్టలు తీసి చూపించిన్నారు, అందరకూ పంచినారు కూడా.
ఆయన ఇంకా, “నాకు అమ్మ డబ్బు ఇస్తున్నది. ఇది దొంగ డబ్బు కాదు” అన్నారు. సత్పురుషునిపై అపోహలు పెంచుకొనటం తేలికైన పని.
“మా ఊరు పోవటానికి మంచి బాట ఉంది. కష్టాలను లెక్క చేయక ఆ బాటలో పోవలె.
సత్యం, శాంతం, సహనం ఉపకార బుద్ది కలిగి ఉండాలి. ఇతరుల బాధలలో పాలుపంచు కోవాలి…” అనే వారాయన.
“నేను పోవాలే, నేను పోవాలే…” అని ఆయన అనసాగారు. అందరకూ అనుమానం వచ్చింది….ఇక లలితానందుల తనువు చాలిస్తారని.
“నేను ఉన్న లేకపోయినా, మిమ్ములను విడువను, భయపడకండి. తల్లిదండ్రుల వలె మిమ్ములను కాపాడుతుంటాను” అని అభయమిచ్చారాయన.
సాయి కూడా తాను సర్వ కార్యములు సమాధి నుండి నిర్వహిస్తానన్నారు.
ఆయన మాట సత్యమే. అలాగే ఆయన కాపాడుతారు. కానీ, ఆయన తల్లి, తండ్రి వలె ప్రవర్తించటానికి యోగ్యమైన సంతానంగా ఉండటం అవసరం కదా!
ఆయన నవంబర్ 24, 1951లో దేహాన్ని పశుమల అనే గ్రామంలో విడిచారు.
ఆయనకు తగిన బిడ్డలమవుదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- కల నిజమాయెగా…. మహనీయులు – 2020… నవంబర్ 9
- ఇక్కడా, అక్కడా! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 24
- స్వర్ణ పత్రంలో స్వామి భోజనం…. మహనీయులు – 2020… నవంబర్ 16
- స్వామి నారాయణ …. మహనీయులు – 2020… జూన్ 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments