Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భరణీధరన్ అనే వ్యక్తి సాయిబాబాను దర్శించలేదు. సాయిని గూర్చి చదివాడు.
ఆయన ఒకసారి పూండిస్వామిని దర్శించటానికి వెళ్ళారు. ఎందరో భక్తులు స్వామిని దర్శించుకుని వెళ్లారు. పూండిస్వామి భరణీధరన్ వైపు చూశారు.
అంతే. చల్లని వెన్నెల కిరణాలు వారి(స్వామి) కన్నుల నుండి తనకు సోకుతున్నట్లు అనుభవం చెందాడు.
గతంలో సాయి చూపే కటాక్ష వీక్షణాలను గూర్చి మాత్రమే అతడు చదివాడు. ఇప్పుడు ఆ శక్తివంతమైన దృష్టి పారవశ్యానికి లోను చేసింది.
కొందరు స్వామికి సిగరెట్లను, సోడాను ఇవ్వగా స్వామి స్వీకరించారు. అసంకల్పితంగా తాను కూడా ఏదో ఒకటి స్వామికి సమర్పిద్దామనుకున్నాడు.
వెంటనే ఒక కప్పు కాఫీని తెమ్మని కబురు పెట్టారు భరణీధరన్. వెంటనే కాఫీ వచ్చింది.
ఆ కప్పు కాపీని స్వామికి అందించాడయన. చేతితో తీసుకున్నాడు స్వామి. స్వామి కాఫీ కప్పును పైకి ఎత్తలేదు. కనీసం తలను కూడా త్రిప్పలేదు.
కాఫీను త్రాగారు స్వామి. పిల్లి తన నాలుకతో త్రాగినట్లు కాఫీని ఆయన త్రాగారు. స్వామి సంతృప్తి కరంగా త్రాగారని, భరణీధరన్ ఆనందించాడు.
ప్రతిఫలం ఆశించకుండా, ప్రేమతో సమర్పిస్తే, పూండిస్వామి కాదనగలడా? సాయి కూడా కాదంటాడా?
సాయిబాబా తన వద్దకు వస్తున్న ఒక వ్యక్తిని చూచి “ఆవో షాహుకార్” అన్నారు. అతను అప్పుడు సాధారణంగానే ఆర్థిక పరిస్థితి ఉన్నా, ధనికుడయ్యాడు అతి కొద్ది కాలానికే.
ఒక భాగ్యవంతుని ఖరీదైన ఉంగరం పోయింది. ఆ ఉంగరం పోవటం, ఆయన భార్యలో అనేక సందేహాలకు తావిచ్చింది.
ఈ విషయాన్ని ఆ ధనవంతుడు అర్ధం చేసుకున్నాడు. తన స్నేహితుడు సలహా ఇస్తే, తడి బట్టలతో స్వామి వద్దకు పోయి నిలుచున్నాడు.
స్వామి “ఎవరు నీవు? ఎందుకు వచ్చావు?” అని అడగనైనా అడగలేదు. “జలదారి గుంటలో చూసుకో, పో” అన్నారు స్వామి.
ఆ ధనవంతుడు జలధారి గుంటలోని నీరంతా బయటకు తీయించాడు. లోపల ఖరీదైన ఉంగరం కనపడింది. దాన్ని వెలికి తీయించాడు.
ఇదంతా గమనించిన ఆ ధనికుని భార్యకు, భర్తపై అనుమానం తొలగింది.
ఆ ధనవంతుడు ప్రతి సంవత్సరం, ఉంగరం దొరికిన రోజున స్వామి కటాక్షం తనకు లభించిన ఆ రోజున అన్నదానం చేసేవాడు.
వివిధ వాయిద్యాలతో స్వామి చిత్రపటాన్ని ఊరేగింపు చేయించేవాడు. అయినా తనకేమి పట్టనట్టు పూండిస్వామి ఉండేవారు.
స్వామి వద్దన్నా భక్తులు స్నానం చేయిస్తున్నారు కూర్చోబెట్టి. “నన్నెందుకు కూర్చోబెడతారు? పడుకోనివ్వండి. ఒక్కసారిగా అభిషేకము చేయవచ్చును” అన్నారు స్వామి.
స్వామి మాటలు, సాయి మాటలు అర్దమయ్యేవి ఎవరికి? ఎంత మందికి?
అలా అనిన రెండు, మూడు రోజులకే పూండిస్వామి చెందారు. ఆ దినం 3 – 11 – 1978.
నేడు నవంబర్ 3, స్వామి మహా సమాధి దినం. స్వామిని స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- కల నిజమాయెగా…. మహనీయులు – 2020… నవంబర్ 9
- స్వర్ణ పత్రంలో స్వామి భోజనం…. మహనీయులు – 2020… నవంబర్ 16
- అడ్డదారి …. …. మహనీయులు – 2020… ఆగస్టు 3
- అనుమానించకు! …. మహనీయులు – 2020… నవంబర్ 24
- బాబా నిజంగా మీరు చమత్కారాలు, లీలలు చేసే దైవానివే అయితే నా ఉంగరం నీ ఓక్కడికే కనపడాలి.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments