Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రామ్
నా పేరు మణి.
బాబా మీద భక్తి ప్రేమలు ఉన్నందు వలన మేము పుట్టపర్తి లోనే settle అయ్యాము.
కానీ షిర్డీ సాయిని మేము చాలా నమ్ముతాము. మాధవి మేడం ద్వారా Saileelas. com.. గురించి తెలుసుకొని , నాకు జరిగిన ఒక బాబా లీలను మీతో share చేసుకుంటున్నాను.
భావ ప్రియుడు, భజన ప్రియుడు మన సాయి నాధుడు. ప్రతి గురువారం అన్ని బాబా మందిరాలలో భజనలు జరుగుతాయి.
మేము బరంపురం అనే ఊరిలో ఉండగా భజనలు చేసుకునే వాళ్ళము. అక్కడ ఒక పెద్ద బాబా మందిరం ఉంది.
నేను అన్ని భజనలకు వెళ్ళేదాన్ని. ఒకసారి నేను, మా వారు మా అత్తవారింటికి వెళ్తున్నాము. వెళ్లే తొందరలో నా చేతికి ఉన్న ఉంగరం బయట బట్టలు తీస్తుండగా ఎక్కడో పడిపోయింది.
పైగా అది నాది కూడా కాదు. మా వారిది. ఆయనకు తెలిస్తే ఇంక నన్ను తిట్టేస్తారు.
ఏడు రోజులు మేము వుండము. ఉంగరం బయట పడిపోయింది. ఎవరైనా తీసుకెళ్లి పోవచ్చు. నాకు దొరికే chance కూడా లేదు.
అప్పుడు నాకు బాబా వారి భజన పాట గుర్తు వచ్చింది. ఆ పాట “చమట్కార్ కా సాయి దర్బార్ హై, కెవల్ ప్యారక సాయి దర్బార్” అనే హిందీ భజన పాట, అంటే బాబా దర్బార్, చమత్కారాలు జరిగేది, అని అర్థం.
అప్పుడు ” బాబా, ఎన్నో రోజులుగా మేము ఈ పాట పాడుకుంటాము భజనలో, నిజంగా నువ్వు చమత్కారాలు, లీలలు చేసే దైవానివే అయితే నా ఉంగరం నీ ఓక్కడికే కనపడాలి, ఇంకా ఎవ్వరి కంటికి కనపడ కూడదు, అలా జరిగి నా ఉంగరం నాకు దొరికితే నేను ఈ పాట అయిదు వారాలు భజనలో పాడతాను, అని మనసులో మొక్కుకున్నాను.
ఏడు రోజుల తరువాత మేము బరంపురం వచ్చాము. వేతకగా, తులసి చెట్టు మొదలు లో నా ఉంగరం పడి ఉంది.
ఎవ్వరికంట పడకుండా బాబా కాపలా కాచారా అనిపించింది. ఉంగరం గురించి చెప్పడం నా ఉదేశ్యం కాదు.
బాబా కృప అపారం. మన అతి చిన్న కోరిక కూడా ఆయన తీరుస్తారు.
తరువాత అయిదు వారాలు ఆ పాట నేను భజనలో పాడినాను.
నమ్మితే చాలు. కొండంత సాయి దేవుడు అండగా ఉంటాడు అని నిస్సందేహంగా చెప్తున్నాను.
సర్వం సాయి నాతర్పణమస్థు.
Latest Miracles:
- బాబా నిజంగా మీరు చమత్కారాలు, లీలలు చేసే దైవానివే అయితే నా ఉంగరం నీ ఓక్కడికే కనపడాలి.–Audio
- భక్తురాలు అయిష్టముగా వెళ్లిన తీర్థయాత్రలో, బాబా వారు కలలో కనిపించి “నేను నీ కూడానే ఉన్నాను” అని అభయం ఇచ్చుట.
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- మాతాజీ కృష్ణ ప్రియా ను బాబా తాను పాదాలు చెంతకు చేర్చుకొనుట.
- మీరు బాబా ఫోటో, గురువుల ఫోటోలు మాత్రమే మీ ఇంట్లో ఉంచుకోండి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బాబా నిజంగా మీరు చమత్కారాలు, లీలలు చేసే దైవానివే అయితే నా ఉంగరం నీ ఓక్కడికే కనపడాలి.”
Soujanya
July 19, 2018 at 6:59 pmSai mayam sarvam sai mayam intakanna aemi cheppagalam.