Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు శచీ దేవి. నేను సామాన్య గృహిణిని. మేము ముందు కాకినాడ దగ్గర కందికొప్పులో ఉండేవాళ్ళం.
నాకు వివాహం జరిగి ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు కలగక పోవటాన ఆ విషయం పై ట్రీట్మెంట్ కోసం తరచూ చెన్నై వెళుతూ ఉండేవాళ్ళం.
అది ఎలాగంటే కాకినాడ వచ్చి అక్కడ నుండి వెళుతుండేవాళ్ళం. కాకినాడలో మాకు ఒక సొంత ఇల్లు ఉంది. ఆ ఇంటిని మేము అద్దెకి ఇచ్చాము.
ప్రతిసారి కందికొప్పు నుండి కాకినాడ రావడం, అక్కడి నుండి చెన్నైకి వెళ్లడం తిప్పలుగా మారి ఇంకా అలా చేయలేక కాకినాడలో ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళని ఖాళీ చేయించి, మేము కాకినాడకు మారిపోయాము.
మేము కందికొప్పులో ఉన్నప్పుడే, నాకు అప్పుడప్పుడు వీధిలో బొమ్మలు అమ్మేవి వస్తుంటే అవి కొనడం అలవాటుంది.
అలాగే ఒకసారి బొమ్మలు కొంటున్నప్పుడు రకరకాల బొమ్మలతో పాటు ఒక చిన్నదైన సాయిబాబా బొమ్మ ముద్దుగా బావుందని కొన్నాను. అది షో కేసులో పెట్టుకున్నాను. బాబా అలా మా ఇంటికి వచ్చారు.
ఆ తర్వాత మేము కాకినాడ వచ్చాక, మాకు ఒకాయన పరిచయం అయ్యారు. ఆయన శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తుంటారు.
ఆయనకీ ఒక భజన బృందం కూడా ఉంది. కొత్తగా మేము కాకినాడ వెళ్ళాం కాబట్టి భజన పెట్టుకుంటే బావుంటుంది అనిపించింది.
భజన వాళ్ళని పిలిపించి భజన చెయ్యమన్నాము. ఈ భజనకి కొవ్వాడ సుబ్బారావుగారు అన్న ఆయన హారతి ఇస్తామంటే రమ్మనమన్నాము, ఆయన వచ్చి హారతి ఇచ్చి వెళ్లిపోయారు.
నాకు ఆ భజన బాగా నచ్చింది. వాళ్ళకి నేను బాగా మర్యాదలు చేశాను.
అప్పటి నుండి నేను వాళ్ళతో పాటు బాబా భజనలకి వెళ్లడం మొదలు పెట్టాను. వాళ్ళు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణాలు కూడా చేయిస్తుంటారు.
నేను ఒక పారాయణానికి వెళితే అక్కడ వాళ్ళ ఇంట్లో పెద్ద బాబా ఫోటో ఒకటి చూసాను.
అది నాకు చాలా నచ్చింది, మన దగ్గర కూడా ఇలాంటి ఫోటో ఉంటే బావుంటుందని అని అనుకున్నాను.
గురువు గారు ఎక్కడ పారాయణ అయిన అలాంటి ఫోటో ఒకటి తీసుకొచ్చి, అక్కడ పెట్టి పారాయణ అయిపోయాక ఆ ఫోటో ఆ ఇంటి వారి కోసం వుంచేస్తారట.
మనం ఇప్పుడే గురువు గారికి పరిచయం అయ్యాం, అలాంటి ఫోటో మనంగా అడిగితే ఏం బాగుంటుంది అనుకుంటున్నాము.
ఇలా అనుకుంటూ ఇంటికి వస్తున్నాము. ఆ మర్నాడు మా పెళ్లి రోజు. మా ఇంటికి మేము చేరే సమయానికి గుమ్మంలో గురువుగారి అబ్బాయి, మరో అబ్బాయి ఒక ఫొటోతో నిలబడి ఉన్నారు.
మాకు ఆయన (సుబ్బారావు గారు) గిఫ్ట్ పంపించారు. అదే ఫోటో నేను అంతకముందు పారాయణం జరిగిన వాళ్ళ ఇంట్లో చూసింది.
ఆ తర్వాత మా ఇంటి ముందు ఒక చిన్న బంగారు బాబా ఉంగరం దొరికింది. నేను అందర్నీ అడిగాను, ఎవరిదీ ఉంగరం అని, అందరు నాది కాదు అన్నారు.
నేను గురువు గారిని అడిగితే ఆయన నన్ను ”నీ పూజ మందిరంలో బాబా మొహంపైకి వచ్చేటట్టు ఒక కుంకుమ భరణిలో పెట్టుకో” అని చెప్పారు. నేను అలానే చేశాను.
అంతకు ముందు ఒకసారి గురువు గారు, బాబా పరిచయం అయిన తర్వాత, మా అక్కయ్య వాళ్ళు తిరుపతికి వెళదామని, కళ్యాణం కూడా బుక్ చేసాము రమ్మంటే, నేను బాబాని, గురువు గారిని వదిలి రాలేను అని చెప్పాను. ”అప్పుడు గురువు గారు మొక్కు అంటున్నారుగా వెళ్లి రమ్మని” నాకు చెప్పారు.
అందుకని మేము బయలుదేరాము కానీ లైన్లో అంతా కూడా నేను ”బాబా బాబా” అనే అంటున్నాను.
కొండపైకి వెళ్ళాక ఏ కారణం చేతనో నాకు మోషన్స్ అయ్యాయి. నేను బాబా బాబా అంటూనే ఉన్నాను. మా వాళ్ళు కళ్యాణం చేయించారు, అన్నిటా నేను పాల్గొంటూనే ఉన్నాను కానీ, నాకు ఎలాగో ఉంది.
ఆ రోజు నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో బాబా దర్శనం ఇచ్చి ”నేను నీ కూడానే ఉన్నాను” అన్నారు.
మర్నాడు కొండదిగి వచ్చేటప్పుడు నన్ను ఎవరో పక్కనుండి చూస్తున్నట్లుగా, నన్ను అనుసరిస్తున్నట్లుగా అనిపించి, తల తిప్పి పక్కకు చూసాను,
ఫోటోలు అమ్మే వాళ్ళు ఉన్నారక్కడ. ఫోటోల మధ్యలోనుంచి బాబా ఫోటో, అభయ హస్తంతో ఉన్నది నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది. అంతే గబుక్కున వెళ్లి ఆ ఫోటో కొనుక్కుని తెచ్చుకున్నాను.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- పెండ్లి కావటం లేదు అని భాదపడుతున్న భక్తురాలికి, కలలో కనిపించి అభయం ఇచ్చిన బాబా వారు.
- తనకు ఆరోజు నైవేద్యం పెట్టలేదని భక్తుని కలలో కనిపించి గుర్తుచేసిన బాబా వారు
- ఆకలితో వున్నా భక్తురాలు వేదనగా సాయిని ప్రార్ధించగా ఆహారంతో పాటు జీవనోపాధిని చూపించిన బాబా వారు–Audio
- బాబా నిజంగా మీరు చమత్కారాలు, లీలలు చేసే దైవానివే అయితే నా ఉంగరం నీ ఓక్కడికే కనపడాలి.
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments