తనకు ఆరోజు నైవేద్యం పెట్టలేదని భక్తుని కలలో కనిపించి గుర్తుచేసిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒక రోజు మేము సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము. నైవేద్యం కి అవసరం అయిన బూరెలు, పులిహోర అన్ని తయారు చేసాం.

పూజా మందిరంలో అన్ని సర్దుకొని పంతులు గారికోసం ఎదురు చూస్తున్నాము.

ఇంతలో నేను కుర్చీలో కూర్చున్నాను, నాకు మగతగా నిద్ర కూడా పట్టేసింది ఆ నిద్రలో నాకో కల ఆ కలలో బాబా నడుచుకుంటూ మా ఇంట్లో పూజ గదిలోకి వచ్చి పులిహోర గుప్పెటితో గుప్పెడు తీసుకొని తిన్నాడు అదీ కల.

అంతలో మెలకువ వచ్చి పూజ గదిలోకి వెళ్లి చూస్తే పులిహోర పళ్ళెం లో గుప్పెడుతో తీసినట్టుగా గుంట కనపడింది. అది చూసి మా అందరికీ మతి పోయింది.

నేను రోజూ ఉదయాన్నే బాబా ఫోటో చూస్తా, ఒక రోజు అలా కాకుండా లక్ష్మి దేవి ఫోటో చూసాను. ఇదేంటి ఈ రోజు ఇలా అయింది అనుకోని కలత పడ్డాను.

ఆ రోజు రాత్రి బాబా నాకు కలలోకి వచ్చి ” నేను లక్ష్మి దేవి ఒక్కటే ఇద్దరికీ తేడా లేదు, ఆమె మొహం చూసాను అని కలత చెందనవసరం లేదు, అది సరే కానీ మధ్యాహ్నం ఏమైనా తిందామని మీ ఇంట్లోకి వచ్చాను, ఏమీ దొరకలేదు, ఖాళీ కడుపుతో తిరిగి వెళ్ళిపోయాను ” అని అన్నాడు.

నాకు మెలకువ వచ్చింది. మా ఆవిడని లేపి ”ఈ రోజు మధ్యాహ్నం బాబా కి నైవేద్యం పెట్టలేదా అని అడిగాను, నాకు పని ఉండి పిల్లల్ని పెట్టమన్నాను, వాళ్ళు గాని పెట్టలేదేమోనని వాళ్లకు కూడా లేపి అడిగితే, అయ్యో ! మర్చిపోయాం అన్నారు” వాళ్ళు .

”బాబాకి మనం పెడితేనే కడుపునింపుకుంటాడా! అప్పుడప్పుడు మనల్ని ఉద్దరించడానికి ఇలా చేస్తుంటాడు ”.

మా మనవడు వయస్సుకు తగ్గట్టు ఎదగడం లేదని అందరూ వాడిని హాస్పిటల్లో చూపించండి అంటూ పోరుపెడుతుంటే తీసుకెళ్లి చుపించాము డాక్టర్స్ పరీక్ష చేసి చాలా నీరసంగా ఉన్నాడు, మరో పరీక్ష చేయాల్సి ఉంది, ఆ రిపోర్ట్ కనుక వస్తే మీరు పది సంవత్సరాల పాటు విడవకుండా మందులు వాడాల్సి ఉంటుంది అని చెప్పి పరీక్ష చేసాడు.

ఈ లోపు మేము బాబా ని ప్రార్ధించగా పరీక్షల్లో ఎటువంటి ప్రమాదం లేదని వచ్చింది.

బాబా వారు మాయందు ఎటువంటి కరుణ కటాక్ష వీక్షణాలతో చూస్తున్నాడో…….!

సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles