Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిరాం..అందరికి.
నా పేరు సత్య సౌజన్య.
నేను మాధవి మేడం ద్వారా మీ సాయి లీలాస్ సైట్ చూసాను. బాబా అనుగ్రహం మీ అందరికి ఉందని, అందుకే ఈ సైట్ బాబా కృపతో చాలా బాగా నడవాలని మనసా కోరుకుంటున్నాను.
నాకు బాబాతో జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
నేను ప్రెగ్నెట్ గా ఉండగా, ఏడవ నెలలో నాకు చాలా తీవ్రంగా జ్వరం వచ్చింది.
105° temp ఉండేది. నన్ను ఆస్పత్రి లో అడ్మిట్ చేశారు. అప్పుడు మా అమ్మ నాకు చేతిలో ఒక చిన్న వెండి బాబా విగ్రహం పెట్టింది.
నేను, మా అమ్మ, చెప్పాలంటే మా ఇంట్లో అందరూ బాబాను నమ్మేవాళ్ళమే.
ఆస్పత్రి లో నాకు సెలైన్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే నాకు, కడుపులో బేబీ కి, ఏమి అవ్వకూడదని. అసలు ప్రెగ్నెట్ అప్పుడు ఆలోపతి మందులు ఇవ్వాలంటే డాక్టర్స్ కూడా ఆలోచిస్తారు.
ఇలా రెండు రోజులు జ్వరం తగ్గలేదు. బాబా, నువ్వే చూసుకోవాలి, అని అమ్మ బాబా నామస్మరణ చేస్తూనేవుంది.
ఇంకా ఎంతకు జ్వరం తగ్గక పొయ్యేసరికి అమ్మ ఒక తెలుగు హోమియో పతి మందుల బుక్ తీసి, బాబా మా అమ్మాయి కి ఏమి మందు వేయాలో నువ్వే చెప్పాలి, అని ఒక పేజీ తెరిచి చూసింది.
దానిలో టైఫాయిడ్ జ్వరం మందు( bapttisa 200.హోమియోపతి) వెయ్యమని వచ్చింది. ఆశ్చర్యం, అప్పుడే నా Blood టెస్ట్ లో టైఫాయిడ్ ఉందని వచ్చింది.
మా నాన్నగారు హోమియోపతి డాక్టర్ అయ్యినందువలన ఆ మందు వేసుకున్నాను. ఇంకా ఆస్పత్రి లోనే వున్నాను only సెలైన్ ఇస్తున్నారు.
మూడు రోజులు అస్సలు నిద్ర లేదు జ్వరం వలన. అమ్మ ఇచ్చిన బాబా విగ్రహం నా చేతిలో అలానే ఉంది.
మూడు రోజుల తరువాత కొంచెం నిద్ర పట్టింది. కల కూడా వచ్చింది. బాబా కలలో నా గుండె పైన రోలు పెట్టి ఏదో నూరుతున్నారు.
ఒకసారి ఆకుపచ్చ, ఒకసారి పసుపుపచ్చ, ఒకసారి ఏదో మట్టి రంగు..ఇలా ఏమిటో నూరి నాకు తాగిస్తున్నారు.
నేను “బాబా నాకు వద్దు” అంటున్నాను. బాబా, జ్వరం పోవాలిగా, నోరుముసుకొని నేని ఇచ్చే మందు వేసుకో, అని బలవంతంగా నాకు తాగించారు.
నిజంగా, నన్ను నమ్మండి, అద్భుతమైన కల. ఒక గంట తరువాత నేను నిద్ర లేచాను. చూస్తే నాకు జ్వరం మొత్తం పోయింది. నార్మల్ గా ఉంది temp..
నాకు తరువాత ఏ కష్టము లేకుండా పాప పుట్టింది. నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇప్పటివరకు ఏటువంటి అనారోగ్యం లేదు.
బాబా నన్ను యెంత అనుగ్రహించారో మాటల్లో చెప్పలేను. మనం రోజూ అష్టోత్తరం లో చదువుతాము కదా, “ఓం ఆరోగ్యక్షేమదయా నమః, ఓం మృత్యుంజయాయ నమః,” అవి అక్షరసత్య నామాలు.
ఆ విధంగా బాబా నన్ను కాపాడినారు. మనం సాయి చరిత్ర లో కూడా చదివాము కదా భీమాజి పాటిల్ ను బాబా కలలో రక్షించారు .
అందుకే మాధవి మేడం చెప్పినట్లు మన జీవితాలే సాయి చరిత్రలు.
మనం పుట్టినరోజు నుంచి చనిపోయే రోజు వరకు వచ్చే అన్ని సమస్యలకు సమాధానం సాయి చరిత్ర అని నేను గట్టిగా నమ్ముతాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్థు.
Latest Miracles:
- భక్తురాలి అనారోగ్యానికి బాబా కలలో కనిపించి చేసిన వైద్యం–Audio
- నైవేద్యం ఏమి పెట్టలేదని బాధపడుతున్న భక్తురాలి కలలో కనిపించి బీసీ బెల్ బాత్ అడిగిన బాబా వారు.
- సచ్చరిత్ర పారాయణ ఫలితం – కలలో వచ్చి వైద్యం చేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేసిన బాబా గారు.
- కలలో కనిపించి పసుపు కుంకుమ ఇచ్చి, భక్తురాలి ఐదవ తనాన్ని కాపాడిన బాబా వారు.
- మందిర నిర్మాణ ప్రదేశం పట్ల భక్తురాలి కలలో ఇష్టత చూపిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “భక్తురాలి అనారోగ్యానికి బాబా కలలో కనిపించి చేసిన వైద్యం”
b vishnu Sai
July 5, 2018 at 12:48 pmAdbhutamaina Leela
T Rajesh
July 7, 2018 at 12:54 pmLife is full of happiness and tears be strong and have faith in God.He will Solve all problems.Om Sai Ram