కలలో కనిపించి పసుపు కుంకుమ ఇచ్చి, భక్తురాలి ఐదవ తనాన్ని కాపాడిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మాకు వివాహం జరిగిన చాలా ఏళ్ళకి సుమారు 25 సంవత్సరాలు గడుస్తూన్నా సంతానం కలగలేదు.

అందుకని ఇక్కడ అంటే ఇండియాలో చాలా చోట్ల మందులు వాడాము, ఏమీ ఫలితం లేకపోయింది. అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నాము.

అక్కడ ఉన్న మా స్నేహితురాలి ద్వారా అన్ని ప్రయత్నాలు చేసుకున్నాము.

ట్రీట్మెంట్ కి ఎన్నాళ్ళు సమయం పడుతుంది, ఆ సమయంలో నేను ఊరికే ఉండకుండా నాకొక ఉద్యోగం కూడా చూసి పెట్టింది. ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇంక మేము వెళ్ళటమే తరువాయి.

ఎలాగో అమెరికా వెళుతున్నాము, అక్కడ చాలా డబ్బులు సంపాదించుకు వస్తాము అని అలోచించి ఇక్కడ శక్తికి మించి అప్పులు చేసి ఇల్లు విలాసంగా కట్టుకున్నాము.

అన్ని వసతులతో హంగులతో మా ఇల్లు పూర్తయిపోయింది. గృహప్రవేశం రోజు నాకు బాబా కలలో ఫోటో రూపంలో దర్శనం ఇచ్చాడు. మా స్నేహితురాలు శ్రీదేవి మా ఇంటికి  (కలలో) వచ్చింది . ఇల్లంతా చూసింది,

అక్కడ ఉన్న బాబా ఫోటో ఒకటి చూపించి ”నిర్మలా ఆ ఫొటోలో బాబా చూడు వంకరగా కూర్చున్నాడు” అంది.

నేనా ఫొటోకేసి చూసి ”ఏం బాబా వంకరగా కుర్చున్నావా” అన్నాను. అంతే ఆ ఫోటో లోనే బాబా లేచి నిలబడి పంచె సర్దుకొని తిరిగి గద్దెమీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చెయ్యి ఎత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా పెట్టాడు.

ఆ రోజు వచ్చిన కలను నేను అసలు మర్చిపోలేను. మేము రాంనగర్ నుండి వనస్థలిపురం మారిపోయాము.

మా ఇంటికి ఒకరోజు మా దగ్గర బంధువు ఒకాయన వచ్చి ఈ ఇల్లు వాస్తు ప్రకారం సరిగ్గా లేదు. తూర్పుకి స్థలం వదిలి ఇల్లు కట్టాలి,

మీరు పడమరన స్థలం వదిలి ఇల్లు కట్టారు. దీని వలన చాలా సమస్యలు కష్టాలు వస్తాయని అన్నాడు.

”నేను ఏమీ భయం లేదు, నాకు బాబా ఉన్నాడు ఆయనే అన్నీ చూసుకుంటాడు అన్న ధైర్యం నాకు ఉంది” అన్నాను.

1999 డిశంబర్లో ఒకరోజు నిద్రలో ఒక గొంతు వినపడింది. ”నీకు 27 నెలలు పాటు కష్టాలు రానున్నాయి, నేను ఆదుకుంటాను” అని వినిపించింది. నాకు భయం వేసింది.

ఏం జరగాబొంతుందో అని భయపడ్డాను. నేను ఆదుకుంటానని అభయహస్తం ఇచ్చాడు, కాబట్టి ధైర్యం కూడగట్టుకున్నాను.

ఆ సమయంలో నేను పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో ఏ మనిషికైనా అమ్మ తర్వాతే ఎవరైనా అటువంటి అమ్మ బ్రెస్ట్ కాన్సర్ ను గుర్తించిన కొద్ది రోజులకే అమ్మ మరణించింది.

మా వారికీ ఉద్యోగంలో ఏవో సమస్యలు, నాకు రాక రాక వచ్చిన కడుపు తొలి నెలలోనే రెండు సార్లు వెంట వెంటనే గర్భస్రావం అయింది. నేను చాలా కృంగిపోయాను.

నేను ఇంక జీవితంలో అమ్మా అని పిలిపించుకోలేనేమో అనిపించింది. అదే అదనుగా చుట్టాలందరూ దగ్గరి వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. పరాయి వాళ్ళు కాదు ఇంక నీకు పిల్లలు పుట్టరు, గొడ్రాలివిగా బ్రతకాల్సిందే అనేవాళ్ళు.

దాంతో నేను ఇంకా మానసికంగా నలిగిపోయాను. నీకు పిల్లలు లేరు అంటూ చుట్టాలందరూ మా ఇంటికి రావటం మానేసారు.

నాకు మరో వ్యాధి పట్టుకుంది. పిల్లలు పుట్టరేమో అని ఏడవనా? అమ్మా పోయిందనుకు ఏడవనా? ఈయన ఆఫీసులో సమస్యలకి ఏడవనా? చుట్టాలందరూ నన్ను వేలివేసినందుకు ఏడవనా? దేనికి ఏడవను?

27 నెలలు అని చెప్పాడుగా ఆ గడువు పూర్తి కావస్తుండగా ఒక రోజు మధ్యాహ్నం నేను అనుభవిస్తున్న బాధల గురించి తలచుకుంటూ సోఫాలో కూర్చొని ఉన్నాను.

అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సోఫాలో అలాగే వాలి నిద్రలోకి జారిపోయాను.

ఇంతలో ఒక కల వచ్చింది, ఆ కలలో ఎవరో తలుపు కొట్టారు. (కలలో) నేను తలుపు తీసాను. ఒక ముసలాయన గుమ్మంలో నిలబడి కనపడ్డాడు.

ఎవరండీ? అని నేను అడిగే లోపలే ఆ వచ్చిన ముసలాయన రెండు పాకెట్స్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు.

నేను ఈ రెండు పొట్లాలు ఏమిటని వాటిని పరీక్షించాను. అందులో ఒకటి పసుపు, మరొకటి కుంకుమ పాకెట్స్, నాకు టక్కున మెలకువ వచ్చేసింది.

నా చేతులలో పొట్లాలకేసి వెతుకున్నాను. అది కల అని అప్పుడు అర్ధం అయ్యింది. బాబా నుంచి పసుపు కుంకుమ అందుకున్న ఆ చేతులు బాబాకి అలాగే చూపించి ఆయనకి నమస్కారం చేసుకున్నాను.

ఆ రోజు సాయంత్రం మా వారు ఇంటికి వచ్చి ”ఈ రోజు ఏమీ జరిగిందో తెలుసా నిర్మలా! నేను ఆఫీస్ నుండి ఇంటికి వస్తూంటే నా బండి నడి రోడ్డు మీద ట్రాఫిక్ లో ఆగిపోయింది.

బండి పక్కకి తీయటానికి కూడా వీలు లేని ట్రాఫిక్ ఉంది. కిక్కు కొట్టాను, ఒకసారి, రెండుసార్లు అయ్యింది, కానీ స్టార్ట్ అవ్వలేదు.

ఎందుకో వెనక్కి చూసేసరికి శరవేగంతో దూసుకువస్తున్న లారీ, నేను మళ్ళీ కిక్ కొట్టాను, ఈ సారి స్టార్ట్ అయ్యింది, వెంటనే బండిపైన కూర్చొని బండి పక్కకి లాగాను.

అంతే ఎంతో వేగంగా నన్ను దాటేసి దుమ్ము రేపుకుంటూ ఆ లారీ వెళ్ళిపోయింది. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది. లేకపోతే నేను కాదు, నాదీ అనే శరీరపు ముద్ద ఇల్లు చేరేది అని చెప్పారు మా వారు.

అది వినేటప్పటికీ నాకు ఒళ్ళు చల్ల బడిపోయింది. మధ్యాహ్నం నాకు వచ్చిన కల గుర్తుకువచ్చింది.

నా భర్తకి జరగవలసిన ప్రమాదాన్ని తాను నివారించినట్లుగా ”శ్రీ సాయి నాథుడు” నాకు స్వయంగా కలలో పసుపు కుంకుమలు అందజేసి నా ఐదవతనాన్ని కాపాడాడు,

27 నెలలు నేను కాపాడతానని మాట అన్నాడుగా, అన్న మాట నిలబెట్టుకున్నాడా ప్రభువు, దయామయుడు, దీనజనోద్ధారకుడు.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles