Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక ఐ.సి.యస్. అధికారి మహీపతి, మరాఠీ భాషను కాక వేరేదైనా ప్రాచుర్యంగల భాషను ఎన్నుకున్నట్లెతే, ఆయన పేరు విశ్వ కవుల జాబితాలో అగ్రగామిగా ఉండేది అంటారు.
సాయి సచ్చరితను వ్రాసిన దభోల్కర్ సాయి భక్తుడైన దాసగణును మహీపతితో పోలుస్తారు.
జ్ఞానేశ్వరుని భావార్థ దీపిక భగవద్గీతను మహారాష్ట్రులకు ఇచ్చినట్లు, మహీపతి భక్తుల చరిత్రలను కూడా వారికి అందించారు.
ఆయన జన్మమే విచిత్రం. ఆయన తండ్రి పేరు దాదోపంత్. ఆయన వార్కరీ సంప్రదాయానికి చెందిన భక్తుడు.
సూక్షంగా చెప్పాలంటే పండరీనాథుని దర్శించే వారిలో ఒకరు. అంత భక్తునకు కూడా సంతానం లేదు.
63 సంవత్సరాలు వచ్చాయి. పుత్రుడు లేకుండా గతిస్తే, పండరీపురంలోని పండరినాథుని దర్శించి, కొలిచే వారు తన వంశంలో లేకుండా పోతారన్న బాధతో ఆయన భగవానుని ప్రార్ధించాడు.
ఆయనకు వయసు మీరింది. అయినా భగవంతుని కటాక్షం వలన ఒక అందమైన, చురుకైన శిశువు జన్మించాడు. అతడికి మహీపతి అనే పేరు పెట్టాడు దాదోపంత్,
దాదోపంత్ అడుగు జాడలలో మహీపతి పాండురంగని దర్శించి, సేవించేవాడు.
మహీపతి వృత్తి రీత్యా తహరాబాద్ కరణం. తహరాబాద్ అహమ్మద్ నగర్ జిల్లాలోనిది. అది మహమ్మదీయుల ఏలుబడిలో ఉండేది. మహీపతి మహమ్మదీయుల వద్ద పని చేసేవాడు.
ఒకనాడు మహీపతి తను నిత్యం చేసుకునే పూజా కార్యక్రమంలో ఉన్నాడు. మహమ్మదీయ అధికారి, వెంటనే మహీపతిని తన వద్దకు రమ్మని కబురుపెట్టాడు.
పూజ చేయుచున్నానని, ఆ పూజ పూర్తి కాగానే వస్తానని కబురుపెట్టాడు అధికారికి.
అలా కాదని, వెంటనే రమ్మని అధికారి నుండి కబురు వచ్చింది. ఇక ఏమి చేయలేక, అధికారి వద్దకు పోయి, కావలసిన వివరాలన్నీ ఇచ్చి, తాను సేవ నుండి విరమిస్తున్నానని అప్పుడే చెప్పి ఇంటికి వెళ్లాడు.
తన దైవము ఎదుట తాను నిత్యము ప్రభుత్వపరంగా వాడే కలాన్ని పెట్టి, తానిక ఆ కలాన్ని ప్రభుత్వపరంగా అంటే వృత్తి రీత్యా వాడ దలచుకోలేనని, అందులకు దైవాన్ని కోరాడు. వృత్తి రీత్యా ఆయన కలాన్ని వాడలేదు.
ఆయనే కాదు 7, 8 తరాల వరకు మానవుల వద్ద కొలువు చేయలేదు మహీపతి వంశం.
సాయి భక్తుడు నూల్కర్ తన కలాన్ని వదలి వేశాడు. మహీపతి యోగుల జీవిత చరిత్రలు చదివే వాడు, సేకరించేవాడు.
స్వప్నంలో తుకారాం ఆయనను దీవించాడు, గురువైనాడు. తుకారాం ఆదేశంతో ఆయన మహా భక్తుల జీవిత గాథలను రచించాడు. తన రచనలలో మహా భక్తులను ఆకాశానికి ఎత్తి చూపాడు.
ఆయన రచించిన మహా భక్త విజయము మొదలైనవి భక్తుల పాలిట వరములు కాదు, భక్తులకు తరగని సంపద. (తేదీ, వివరములు లభించలేదు).
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నేను ఎల్లప్పుడు నీతో లేనా? ఇంట్లో ఉండు, నా నామం స్మరించు
- గురుపాదమునుంచ నేను …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 17
- ప్రార్దించు! …. మహనీయులు – 2020… జూలై 14
- ప్రయాణంలో ప్రళయం…..సాయి@366 ఆగస్టు 4….Audio
- సాయి తారక మంత్రము…. మహనీయులు – 2020… మే 15
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments