Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
R.B.పురందరే ప్రభుత్వ రైల్వే శాఖలో పనిచేస్తూ ఉండేవాడు. అతను ఒకసారి షిర్డీ వెళ్ళడానికి సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటే, సెలవు ఆమోదించడంతోపాటు వారి ప్రయాణానికి అవసరమగు ట్రైన పాసులు కూడా లభించాయి. అతను సంతోషంగా తన గురువుని చూడడానికి షిరిడీకి వెళ్ళడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్నాడు.
తన ప్రయాణానికి ఒకరోజు ముందు అతని ఉన్నత అధికారి అతన్ని పిలిచి, రాబోయే కార్మికుల సమ్మె కారణంగా ఆ పర్యటనను రద్దు చేసుకోమని అతనిని కోరాడు. హఠత్తు పరిణామానికి పురందరే తీవ్రంగా నిరుత్సాహపడ్డాడు. ఎలా ఈ పరిస్థితి నుండి భయటపడాలి? “ఏదైనా ఇతర స్థల సందర్శన అయితే, నేను వెంటనే రద్దు చేసుకోగలను. కానీ, షిర్డీ పర్యటనను రద్దు చేసుకోవడం కంటే నేను చనిపోవడమే మేలు” అని అతను అనుకున్నాడు.
పరిస్థితి చక్కబడిన తర్వాత శలవు మంజూరు చేస్తానని అతని అధికారి వాగ్దానం చేసినప్పటికీ, అతను షిర్డీ వెళ్ళే ప్రణాళికను వాయిదా వేయలేనని మొండిగా ఉన్నాడు. ఆ రాత్రి, బాబా అతనికి కలలో కనిపించి కోపంగా “రేపు షిర్డీ రావడానికి నీవు ధైర్యం చేయవద్దు” అని చెప్పారు.
బాబా ఆజ్ఞ ప్రకారం పురందరే మరుసటిరోజు సాదరణంగా కార్యాలయానికి హాజరు అయ్యాడు. పురందరే రాకతో అధికారి ఎంతో సంతృప్తి చెందాడు. తరువాత పురందరే సహాయంతో సమ్మె జరగుకుండా సర్దుబాటు జరిగింది.
ఒక నెల తరువాత అధికారి సెలవు తీసుకొని షిర్డీకి వెళ్లి రమ్మని పురందరేని అడిగాడు. అప్పుడు అతను షిర్డీ వెళ్లి ద్వారకామయికి వెళ్ళినప్పుడు బాబా “పిచ్చివాడిగా ఉండకు, మనకు ఇంకా చాలా బాధ్యతలు నిర్వర్తించడానికి ఉన్నాయి. నేను ఎల్లప్పుడు నీతో లేనా? ఇంట్లో ఉండు, నా నామం స్మరించు” అని అన్నారు.
source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- నాక్కావలసింది ఈ నాణేలు కాదు, నేను కోరేది నిష్ఠ, సబూరీ
- గురువారం నాడు గృహప్రవేశం పెట్టుకో
- ఎంత వడ్డించిన ఎంతకీ తరగని ఆహరం – అద్భుతమైన బాబా లీల
- అన్నపూర్ణ సిద్ది …..సాయి@366 మార్చి 30….Audio
- నన్ను శరణుజొచ్చు వారిని రక్షించుటయే నా కర్తవ్యం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments