అన్నపూర్ణ సిద్ది …..సాయి@366 మార్చి 30….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


బొంబాయి నుండి తరచుగా వచ్చి సాయిని దర్శించే వారిలో ఆర్‌.బి. పురందరే ఒకరు.

అది ఏ సంవత్సరమో తెలియదు గాని, ఒక గుడ్‌ ఫ్రైడే నాడు (మార్చిలో) జరిగిన సంఘటన ఇది. గుడ్‌ ఫ్రైడే అనగానే క్రీస్తు జ్ఞప్తికి రావటం సహజమే. ఈ దిగువ సంఘటనలో ఆ విషయం ఉన్నది కూడా.

ఒకసారి యేసు వద్దకు జనులు వచ్చిరి. అప్పికే భోజన వేళ దాటింది. ఇక జనులను భోజనము చేయుటకు ఇంటికి పంపుదామని శిష్యులు చెప్పిరి.

”వారు వెళ్ళనక్కర లేదు. మీరు వారికి భోజనము పెట్టుడు ” అని ఏసు అన్నాడు.

”మా వద్ద ఉన్నవి 5 రొట్టెలు, 2 చేపలు మాత్రమే” అనగా వాటిని ఏసు తెప్పించి, ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, రొట్టెలను విరచి, ఇక వడ్డించుడు అన్నారాయన.

స్త్రీలు, పురుషులు, పిల్లలు సుమారు 5 వేలమంది భుజించిరి. ఇంకను పన్నెండు గంపలనిండా ముక్కలు మిగిలి ఉన్నాయి. దీనినే అన్నపూర్ణ సిద్ధి అంటారు.

”మీ ఇంటికి భోజనానికి వస్తాను” అన్నారు పురందరేతో సాయి. ”ఏమి చేయించమంటారు?” అన్నాడు పురందరే.

”అన్నం, కిచిడి, సీరా, ఒకటి, రెండు కూరలు; మనంకాక మరో ఇద్దరు ముగ్గురు ఫకీర్లకు” అన్నాడు సాయి. పురందరే భార్యచే ఐదుగురికు వంట చేయించాడు. మధ్యాహ్న ఆరతి అయింది.

ఐదుగురు ఫకీర్లు వచ్చి భుజించారు. పోతూ, పోతూ, ”ఇంకా భోజనానికి వస్తున్నారు” అని హెచ్చరించారు. అన్నం చాలదేమోనని, అన్నం వండింది పురందరే బార్య.

ఇంకో ఇరవైమంది వచ్చి భోజనం చేసిపోయారు. వారు పోగానే మరో పదిమంది వచ్చి భోజనం చేసి వెళ్ళారు. ఇంకా ఎవరూ వచ్చే సూచనలు లేవు.

పురందరే, సాయిబాబా వద్దకు వెళ్ళాడు పిలుచుకు రావటానికి. ”నేను కడుపు నిండా తిన్నాను” అన్నాడు సాయి. ”ఇతడిని భయపెట్టాను ” అన్నాడు సాయి అక్కడున్న వారితో.

ఆ వచ్చిన వారంతా సాయి రూపులు అని అర్థం. పురందరే తన వెంట ఉన్న తాంబూలం సాయికి సమర్పించాడు. సాయి ఆశీర్వదించాడు.

”బాలా షింపేని భోజనానికి తీసుకువెళ్ళు” అన్నాడు సాయి. అతడిని వెంటపెట్టుకుని వెళ్ళి అందరూ భుజించారు. మారు వండిన అన్నం అలాగే ఉన్నది.

చేసిన పదార్ధాలన్నీ సరిపోవటమే కాక, ఇంకా రెండు, మూడు రోజులకు సరిపడా మిగిలాయి.

ఇంకా మిగిలినవి బొంబాయి తీసుకువెళ్ళారు పురందరే దంపతులు – అది సాయి ప్రసాదం.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles