Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-190-2212-పురందరే బార్యకు 3:34
పురందరేకు బాబాపై అంతులేని ధృఢమయిన విశ్వాసం.
ఆయన తన కూతురుకు గాని భార్యకుగాని ఎప్పుడయినా అనారోగ్యం కలిగితే, చూసుకోవడానికి బాబా ఉన్నారనే ధీమాతో ఉండేవాడు.
ఒకసారి ఆయన భార్య ఉదయం 3 గంటలనుంచి 8 గంటల వరకు ఆగకుండా వాంతులు డయేరియాతో బాధపడసాగింది.
ఆవిడకు వాంతులు, నీళ్ళ విరోచనాలు ఆగకుండా అవుతూ ఉండటంతో 8 గంటలకి ఒళ్ళంతా చల్లబడి పోయి నాడి కూడా బలహీనంగా కొట్టుకోసాగింది.
వెంటనే వైద్యుణ్ణి పిలిపించారు. ఆయన పరీక్షించి ఆవిడ ఒకగంట కన్నా ఎక్కువ బ్రతకదేమోననే సందేహాన్నివ్యక్తం చేశారు.
ఆ సమయంలో పురందరే గారు తన మేనకోడలికి బంగారు నగ చేయించుదామని కంసాలి ఇంటిలో ఉండటంవల్ల ఈవిషయం ఆయనకు తెలియదు.
పరీక్ష చేసిన వైద్యుడు పురందరే భార్య బ్రతికే అవకాశం లేదని చెప్పడంతో ఒకతను ఈవిషయం చెప్పడానికి పురందరే వద్దకు ఏడుస్తూ వెళ్ళాడు. ఈ వార్త విని పురందరే ఇంటికి బయలుదేరారు.
పురందరేగారు ఇంటికి వెళ్ళేదారిలో దత్త మందిరం ఉంది.
ఆయనకు అక్కడ బాబా ఒక ఫకీరుగా చేతిలో జోలితో కనిపించారు. ఆ ఫకీరు ఆయనను ఓదారుస్తూ “నీ భార్య గురించి ఏమీ భయపడకు. ఆమె మరణించదు.
నీటిలో ఊదీని కలిపి ఆమెచేత త్రాగించు. ఒక గంటలోఆమెకు నయమవుతుంది.
మిమ్మలనందరినీ నేను కాపాడుతూ ఉంటాను.” అన్నాడు.
పురందరే ఇంటికి చేరుకునేటప్పటికి అందరూ ఏడుస్తూ ఉన్నారు.
ఆయన ఇంటిలోకి వెళ్ళి బాబా ఊదీని నీటిలో కలిపి భార్య పడుకున్నమంచం వద్దకు వచ్చారు.
ఆవిడ పళ్ళు బాగా గట్టిగ కరుచుకొని ఉన్నాయి. అందువల్ల ఆయన బాబా తీర్ధాన్ని ఆవిడ నోటిలో పోయడానికి ఒక చెమ్చాను నోటిలో పెట్టి తెరవడానికి ప్రయత్నించారు.
ఇది చూసి చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులంతా చాలా భయపడ్డారు.
బలవంతంగా తీర్ధాన్నిగొంతులో పోయవద్దని చెప్పారు. వారి మాటలేమీ పట్టించుకోకుండా ఆయన బాబా ఊదీ తీర్ధాన్నిఆవిడ నోటిలో పోశారు. కొంత ఊదీని ఆమె శరీరమంతారాశారు.
ఆతరువాత ఆయన స్నానం చేసి బాబాకు పూజచేసి నైవేద్యం సమర్పించారు.
ఇక ఎవరి కోసం ఎదురు చూడకుండా ఏమీ పట్టనట్టుగా, భోజనం చేశాడు.
ఒక గంట తరువాత వైద్యుడు వచ్చి ఆమె ని పరీక్షించాడు. ఆశ్చర్యకరంగా ఆవిడ కోలుకోవడం గమనించాడు. శరీర ఉష్ణోగ్రత మామూలు స్థాయికి వచ్చి నాడి కొట్టుకోవడం మొదలయింది.
మందు ఏమిచ్చారని పురందరేని ఆశ్చర్యంగా అడిగాడు. బాబా ఊదీ తీర్ధం తప్ప మరింకేమీ ఇవ్వలేదని పురందరే సమాధానమిచ్చాడు.
తరువాత వైద్యుడు కొన్ని మందుల నిచ్చి వాడమని చెప్పి వెళ్ళిపోయాడు. ఫకీరు చెప్పినట్లుగానే ఆమె మరణాన్ని జయించి కోలుకుని ఆరోగ్యవంతురాలయింది.
ఈ సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- నాక్కావలసింది ఈ నాణేలు కాదు, నేను కోరేది నిష్ఠ, సబూరీ
- గురువారం నాడు గృహప్రవేశం పెట్టుకో
- అన్నపూర్ణ సిద్ది …..సాయి@366 మార్చి 30….Audio
- నేను ఎల్లప్పుడు నీతో లేనా? ఇంట్లో ఉండు, నా నామం స్మరించు
- అనారోగ్యముతో భాదపడుతున్న భక్తురాలిని ఆరోగ్య వంతురాలిగా చేసి, బిడ్డను ప్రసాదించిన బాబా వారు…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments