అనారోగ్యముతో భాదపడుతున్న భక్తురాలిని ఆరోగ్య వంతురాలిగా చేసి, బిడ్డను ప్రసాదించిన బాబా వారు…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: Mrs Jeevani


నా పేరు గౌరీశంకర్‌, మా ఆవిడ పేరు సుబ్బలక్ష్మి. మాకు ఇద్దరు అబ్బాయిలు.

మేము హైదరాబాద్ వనస్థలిపురం హిల్‌ కాలనీలో నివాసం ఉంటున్నాము. నేను వృత్తి రీత్యా ఎలక్టీషియన్ని. మా ఆవిడ స్కూల్‌లో టీచరుగా పని చేస్తోంది.

మా అసలు ఊరు అమలాపురం దగ్గర ఒక చిన్న గ్రామం, పేరు మురుముళ్ళ.

ఆ ఊర్లో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం మా తాత తండ్రుల కాలంలో మా వాళ్ళే కట్టించారు.

ఆ శివాలయంలో రోజూ నిత్య కళ్యాణం, పచ్చ తోరణం వుండాలి, అంటే రోజూ పచ్చ తోరణం కట్టి తప్పని సరిగా కల్యాణం చెయ్యాలి.

ఒకవేళ అలా కనుక చెయ్యకుండా వుంటే, ఆ ఊరిలో ఏదో ఒక మూల నిప్పు అంటుకుంటుంది.

అందు వలన తప్పని సరిగా కళ్యాణం చేస్తారు. వివాహం కాని కన్య కానీ, అబ్బాయికానీ అక్కడ పూజ చేయిస్తే

ఏనక్షత్రంరోజు పూజ చేయిస్తారో అదే నక్షత్రం మరల తిరిగే లోగా, అంటే ఒక నెలలోగా తప్పని సరిగా వివాహం కుదిరిపోతుంది, అని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం.

ఆ విధంగా మా ఉరు ప్రసిద్ధి. మేము ఆ  శివుడ్నే కొలుస్తూంటాము. అలాగే వేంకటేశ్వర స్వామిని కూడా కొలిచేవారం.

మా పెళ్లి అయిన కొత్తల్లో నేను వైజాగ్‌ లో S.R.M.T  లో పని చేసేవాడిని.

కటక్‌ ట్రాన్సఫేర్‌ చేసేటప్పటికి అంతదూరం వెళ్ళలేక ఆ ఉద్యోగం మానుకున్నాను. ఆ తర్వాత ఒక పెట్రోల్‌ బంకు లొ క్యాషియర్‌ గా పని చేసాను.

పెళ్లి అయిన ఒక ఏడాది లోపూ మా ఆవిడకి డబుల్‌ టైఫాయిడ్‌ వచ్చింది. చాలా సమస్య అయింది. కడుపులో మచ్చలుగా అయిపొయింది.

ఆపరేషన్‌ చెయ్యాలన్నారు. బాగా వీక్‌ అయిపోయింది. ఆపరేషన్‌ చేస్తే తను బ్రతుకుతుందో లేదో అన్నారు.

చెయ్యకపోతే సంతానం కలగదు అన్నారు డాక్టర్‌. ఆ సమయంలో నేను మా ఆవిడని చూడటానికి వైజాగ్‌ నుండి కాకినాడ వెళ్ళే బస్సు. ఎక్కాను. (అప్పుడు మా ఆవిడ వాళ్ళ పుటింట్లో ఉంది)

అందులో ఒక ముసలాయన పిఠాపురంలో ఎక్కాడు. – ఎక్కిన దగ్గరనుండి ఆయన “నీకీ మధ్యనే పెళ్లి అయింది కదా!” అన్ని పరిస్థితులు చక్కబడతాయి, ఇదిగో ఇది చదువుకో అంటూ బాబా “చరిత్ర పుస్తకం” నా చేతిలో పెట్టాడు.

నాకప్పటికి ‘బాబా’ అంటే అసలు, తెలియదు. ఈయనెవరో నాకు తెలియదు ఇది నేను చదవను, నాకొద్దు అన్నాను.

“నీ దగ్గర ఉండనీ, ఒక సారి చదువు, నీకు నచ్చకపోతే దీన్ని ఎక్కడయినా పెట్టేయ్‌” అన్నాడు.

పుస్తకం తీసుకున్నాను, ఆ ముసలాయన నాకా పుస్తకం ఇచ్చాక కాసేపటికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను, మెలుకువ వచ్చేటప్పటికి ఆ ముసలాయన లేడు,

ఎక్కడ దిగిపోయి ఉంటాడో అనుకున్నాను. ఆ పుస్తకం తీసుకొని నేను ఆసుపత్రికి వెళ్లాను.

మా ఆవిడకి ఆపరేషన్‌ అయింది.పాపం ఆ టైఫాయిడ్ కి మొత్తం జుట్టంతా ఊడిపోయింది. చాలా ఇబ్బందిగా తయారయింది.

ఆ తర్వాత ఏడాదిలోపే మా ఆవిడ గర్భవతి అయ్యింది. నేను అప్పుడప్పుడు ఆ ముసలాయన ఇచ్చిన పుస్తకం చదవాలని తెరిచి చదువుతూ ఈయనెవరో మనదేవుడుకాడు, అని అనుకునేవాడిని.

మా ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు మేము హైదరాబాదు దిల్‌సుఖ్‌నగర్‌ చేరుకున్నాము. బాబా గుడికి దగ్గరగా ఉండేవారం.

నేను హైదరాబాద్‌ లో ఒక ఉద్యోగంలో చేరాను. నేను ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళగానే మా ఆవిడ ఒకత్తే ఇంట్లో ఉండేది.

మాకు దగ్గరలోనే వాళ్ళ పిన్నీ బాబాయ్‌ వాళ్ళు ఉండేవారు. మాచిన్నఅత్తగారు రోజూ “బాబా” గుడికి తీసుకువెళుతూ ఉండేది.

రోజూ హారతికి హాజరు అవుతూ ఉండేది. అలా రోజూ బాబా గుడికి వేళుతూండటం మూలంగా ప్రశాంతంగా వుంటూ వుండేది.

తనకు ఆపరేషన్‌ అవసరమని చెప్పారు. పైగా పొట్ట కూడా చాలా పెద్దగా ఉండేది.

ఆ పొట్ట చూసి అందరూ భయపడేవారు. ఇది కనలేక చనిపోతుందేమోఅని కూడా అనుకునేవారు. ‘బాబా’అలాంటి ఇబ్బందులేమీ లేకుండానే నార్మల్‌ డెలివరీ అయ్యేటట్లు చేసాడు.

The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles