బాబాకి పేద, ధనిక, కులం, మతం, తేడాలు లేవు, కావలసింది కేవలం బాబా మీద భక్తి, ప్రేమ, శ్రద్ధ మాత్రమే!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భరత్ రావు గారి అనుభవములు ఎనిమిదవ మరియు చివరి భాగం

మా అబ్బాయి ఏడాదిలో ఒక నెలరోజుల పాటు అఖండ దీపం పెట్టి ఒక వారం గురుచరిత్ర, ఒక వారం శ్రీ సాయి లీలామృతం ఇలా నెలంతా చదవటం అలవాటు.

ఇలా చదువుతున్నన్నాళ్ళు జయమ్మ నిష్ఠగా నియమంగా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా రోజూ బాబాకి ఎదో ఒక ప్రసాదం చేసి తీసుకు వచ్చేది.

రోజు నైవేద్యానికి సమయం కూడా మించకుండా శ్రద్ధగా చేసుకువచ్చేది, చూసి చూసి మా వాడు “జయమ్మ! ఎందుకే రోజూ మీ ఇంట్లో చేసుకుని వస్తావు, మీ ఇంట్లోనే సత్సంగం పెట్టుకుని పూజ చేసుకోవచ్చుకదా” అని అన్నాడు.

దానికి జయమ్మ “మా ఇంటి ప్రసాదం ఎవరు తింటారు. మీరు కాబట్టి తీసుకుంటున్నారు, తింటున్నారు కానీ మా ఇంటికి ఎవరు వస్తారు? అన్నది.

ఆమాట మా ఆవిడా విని జయమ్మ తో – మీ ఇంట్లో సత్సంగం చేసుకుంటాను అని ఏనాడు అనలేదు కదా అది మాకు ఎలా తెలుస్తుంది?

మీ ఇంట్లో సత్సంగం పెట్టించమంటావా అని ఆ సత్సంగం వాళ్ళతో నేను మాట్లాడుతాను, నేను వాళ్ళని ఒప్పించి మీ ఇంట్లో సత్సంగం పెట్టిస్తానని, మా ఆవిడ వాళ్ళందిరికీ ఫోన్లు చేసి మాట్లాడి ఒప్పించింది.

ఆ నెలలో జయమ్మ ఇంట్లో సత్సంగం జరిగింది, దాని ఆనందానికి అవధులు లేవు.  బాబాకి పేద, ధనిక, కులం, మతం, తేడాలు లేవు, ఆయనకు అందరూ సమానమే.

ఆ సత్సంగం అయిన రోజు బాబా జయమ్మకు కలలో కనిపించాడట, బాబా నేను పనిమనిషిని అందరూ గొప్పవాళ్ళు, నా ఇంటికి ఎవరు వస్తారు అన్నదట.

దానికి బాబా “అందరూ ఎక్కడో అక్కడ పనిమనుషులే” అది కాదు ముఖ్యం, నేను చూసేది నా మీద భక్తీ, ప్రేమ, శ్రద్ధ, మాత్రమే! అని అన్నాడట.

సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles