పిలిచి అవకాశం ఇవ్వటం బాబా కృప కాకా మరేమిటి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ

పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

అన్నపూర్ణ గారి బాబా ఇచ్చిన మరో స్వీయ అనుభవం…

This Audio prepared by Mr Sri Ram

  1. Mir-224-పిలిచి అవకాశం 2:18

ఆగష్టు ,2015 న మేము సత్సంగం లో అందరం కలిసి తిరువణ్ణామలై వెళ్ళాము.శ్రావణ పౌర్ణమి సందర్భంగా అక్కడకి వెళ్ళాము.

ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు బాబా నామం చెప్పేందుకు బాబూజీ గారి హరితాచల్ లో తెనాలి సత్సంగ సభ్యులకు  అవకాశం ఇచ్చారు.

నేను కూడా బాబా నామం చెప్తూ అలానే ఉండిపోయాను.నాకు నిద్ర,అలసట రాకుండా నామం చెప్పినందుకు చాల సంతోషం వేసింది.

ఎందుకంటే సాయిబాబాను  మన హృదయం అంతరాలనుండి పిలిచే ఆ పిలుపు కాలాన్ని గుర్తు చేయదు.

అక్కడ రోజు ఉదయం 5గంటలకు  అభిషేకం చేస్తారు.కానీ నాకు ఆ విషయం తెలియదు.అలానే ఉండిపోయాను.అందరు ఫ్రెషప్ అయ్యి వచ్చేసారు.

మొదట కుటుంబం తో వచ్చిన వాళ్లకు  అభిషేకం చేసే అవకాశం అన్నారు.నేను మా ఫామిలీ నుండి ఒక్కదానినే వెళ్ళాను.నేను బాధపడ్డాను.

తర్వాత నిర్ణయం మార్చి కొంతమంది  స్త్రీలకు కూడా చేసే అవకాశం ఇచ్చారు.అక్కడ చాలా మంది కూర్చుని ఉన్నారు.అప్పుడు మా సత్సంగం గురు బంధువు నన్ను పిలిచారు అభిషేకానికి.

నాకు అభిషేకం విషయం తెలియక ఫ్రెషప్  అవ్వలేదు అన్నాను .బాబా దయ వల్ల టైం ఇచ్చి తొందరగా రమ్మని చెప్పారు.

“త్వరగావచ్చి నేను అభిషేకము చేశాను.అభిషేకం చేస్తున్నపుడు బాబా కి ప్రత్యక్షంగా చేసినట్లు అనిపించింది.నాకు సంతోషంతో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి.”

“అక్కడ చాలా మంది కూర్చుని ఉన్నానన్ను పిలిచి అవకాశం ఇవ్వటం బాబా కృప కాకా మరేమిటి”. ఈ అనుభవం నేను ఎపుడు మరిచిపోలేను.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles