Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
అది 1998 సెప్టెంబర్ 03వ తేదీ గురువారం డ్రైవింగ్ టెస్ట్ కోసం ముందుగా షెడ్యూల్ లేకుండానే నా డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్ నన్ను పిలిచాడు, నిజానికి నాకు అక్టోబర్ చివరి వారంలో పరీక్ష కోసం తేదీ ఇవ్వబడింది.
డ్రైవింగ్ పరీక్ష కోసం కోర్సు తీసుకోకుండానే నేను డ్రైవింగ్ టెస్ట్ ఆఫీసుకు అతనితో పాటు వెళ్ళాను. ఈరోజు డ్రైవింగ్ ఆఫీసుకి వెళ్లి ఈరోజు నేను పరీక్షకి హాజరు కావడానికి ఏమైనా అవకాశం ఉందా అని అడిగాను. డెస్క్లో ఉన్న మహిళ వెంటనే నా అభ్యర్ధనకు ప్రతిస్పందించింది. డ్రైవింగ్ టెస్ట్కు అవసరమైన ఛార్జీలు చెల్లించమని అడిగి, ఆ రోజు టెస్ట్ కు హాజరు కావడానికి వేచి ఉండమని చెప్పంది.
నెలల ముందు నుండి వెయిటింగ్ లిస్టు ఎల్లప్పుడూ ఉంటుంది, అంటువంటిది నాకు ఆరోజున అవకాశం ఇవ్వడం నమ్మలేకపోయాను. సరే నేను ఫీజు మొత్తన్ని కట్టాను. నేను అంతకుముందు ఆ టెస్ట్ కి హాజరు కానప్పటికీ డ్రైవింగ్ టెస్ట్ ఫారం నింపిన మహిళ నేను G2 ఇదివరకే పరీక్షకు ఒకసారి హాజరు అయ్యాను అని రాసారు.
నా డ్రైవింగ్ బోధకుడు నాకు గుడ్ లక్ చెప్పి, నాకు ఒక కఠినమైన పరీక్ష ఉందని చెప్పాడు, ఎందుకంటే నా కారులో సాధారణంగా ఒకరికి బదులుగా ఇద్దరు శిక్షకులు కూర్చుని ఉంటారు అని చెప్పాడు. నేను ఇప్పటికే ఒత్తిడిని మరియు కష్టాలను ఎదుర్కొంటున్నానని బాబా మీకు తెలుసు ఈ పరీక్షలో విఫలమైతే మరోసారి పరీక్షకు నేను హాజరు కావడం నాకు చాలా పెద్ద సమస్య అని నేను నా సాయిబాబాకు ప్రార్థన చేసాను.
నా పర్సులో ఎప్పుడు సాయిబాబా లాకెట్ ని ఉంచుకోవడం అలవాటు. నేను సాయిబాబా లాకెట్ ని తీసుకుని నా చొక్కా జేబులో ఉంచుకున్నాను. పరీక్ష కోసం నేను సిద్ధంగా ఉన్నానా అని డ్రైవింగ్ ఇన్స్పెక్టర్లు నన్ను అడిగారు. ఇంజిన్ ప్రారంభించటానికి ముందు నేను మళ్ళీ “బాబా దయచేసి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా నాకు సహాయం చేయండి” సాయిబాబాను ప్రార్థించాను.
నేను కారును స్టార్ట్ చేశాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్లను నాకు సూచనలు ఇచ్చారు. ఒక సందర్భంలో నేను పొరపాటు చేశాను అందువలన నేను విఫలమవుతాను అనుకున్నాను. చివరగా డ్రైవింగ్ పరీక్ష పూర్తయింది మరియు ఇన్స్పెక్టర్లు నా రిజల్ట్ధ్ గురించి చర్చించుకుంటున్నారు.
ఆశ్చర్యంగా నేను ఒక తప్పు చేసినప్పటికీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్లు ‘మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను’ అని అన్నారు. నా ఆనందానికి ఎటువంటి సరిహద్దులు లేవు. నా ప్రార్థనలను నా బాబా విన్నారు. సాయిబాబా మీకు ధన్యవాదాలు.
రవీందర్ తోట, కెనడ
source: http://forum.spiritualindia.org/your-experience-with-sai-baba/a-sai-devotee-5086/
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి నవ గురువార వ్రతం
- బాబా ఇప్పించిన డ్రైవింగ్ లైసెన్స్
- బాబా షిర్డీ లో బ్యాంకు మేనేజర్ రూపంలో వచ్చి నను టెస్ట్ చేసి నాకు సహాయం చేసారు
- బాబా గురువుగారి అనుగ్రహం వల్ల మగ బిడ్డ ప్రసవం.
- బాబా దయ అనుగ్రహం వల్ల మా పాప క్షేమంగా ఉంది–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments