సాయి నవ గురువార వ్రతం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

USA నుండి ఒక భక్తురాలి అనుభవం: సాయిరాం అందరికి, నేను 2008 నుండి సాయిబాబా యొక్క భక్తురాలిని. నా జీవితంలో ఉన్న ప్రతిది నా బాబా ఇచ్చినది అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. బాబా నా తప్పులకు క్షమించుము, ఎప్పటికీ నాతో ఉండండి. దయచేసి నా పేరు మరియు ఇమెయిల్ ఐడిని బహిర్గతం చేయవద్దు. దయచేసి ఏ తప్పులు ఉన్న సవరించడానికి సంకోచించకండి.

నేను సాయి నవ గురువార వ్రతం గురించి నా అనుభవాన్ని వర్ణించాలనుకుంటున్నాను. 2013లో మేము ఒక ఇంటిని కొనుగోలు చేయాలని ప్రణాళిక వేసుకున్నాము మరియు నేను నా ఉద్యోగంలో చేరాలి అని అనుకున్నాను. మేము ఇంటికోసం చాలా ప్రయత్నించాము, కానీ ఎక్కడ కొనుగోలు చేయాలో, ఎంత బడ్జెట్ లో తీసుకోవాలో నిర్ణయించుకోలేక చాలా గందరగోళంలో పడ్డాము. మేము చాలా మానసికంగా ఒత్తిడికి లోనయ్యాము.

అదికాక నేను దాదాపు 6 నెలలు నిరంతరాయంగా ప్రయత్నించిన ఉద్యోగం పొందలేకపోయాను. అందువలన చాలా కలత చెందాను. నా సమస్యలన్నీ క్లియర్ చేయడానికి నాకు ఒక మార్గం చూపించమని నేను బాబాకు ప్రార్థించాను.

అప్పుడు బాబా యొక్క ఆశీర్వాదంతో, ఒక బ్లాగులో నేను సాయి నవ గురువార వ్రతం గురించి తెలుసుకున్నాను. నేను వ్రతం చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత ఒకరోజు నేను నా కలలో సాయి బాబాని చూశాను. దానితో బాబా నేను ఈ వ్రతం చేయాలని కోరుకుంటున్నారు అని నాకు అనిపించింది.

నేను మూడు కోరికలు నెరవేరాలని వ్రతం ప్రారంభించాను. మొదలుపెట్టిన కొద్ది రోజులకే అద్భుతం జరగటం ప్రారంభమైంది. 2 వారాల పూర్తయిన తర్వాత, నాకు ఒక అందమైన గృహ సముదాయంలో ఒక ఇల్లు బాగా నచ్చింది  మరియు  మంచి ఒప్పందం కుదరటంతో కొత్త ఇల్లు కోసం సంతకం చేసాను, కానీ మా బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ. ఇంకా చాలా అద్భుతాలు మా ఇల్లు సంఖ్య 27. 2 ప్లస్ 7 ఇస్తుంది 9. కాబట్టి మేము బాబా యొక్క ప్రసాదంగా భావించం. మరియు సాయిబాబా స్వయంగా ఆ ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా మాకు అనిపించింది.

మా ప్రణాళిక కంటే ఎక్కువ అయినప్పటికీ బాబా ఆ విషయంలో ఖచ్చితంగా మాకు తగిన  ఏర్పాటు చేస్తారని కూడా మేము ఆశించాము. అంత అందమైన ఇల్లు ఇచ్చినందుకు బాబా మీకు మా ధన్యవాదాలు.

నా 9 వారాలు వ్రతం పూర్తి అవ్వడానికి కొన్ని వారాల ముందు మరొక అద్భుతం జరిగింది. నా స్నేహితుల్లో ఒకరు మేము నివసిస్తున్న నగరంలో కొత్త ఉద్యోగం సంపాదించి, మా స్థలాన్ని సందర్శించారు. నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నానని తెలుసుకుని, కొద్ది రోజులు తన పాత ఉద్యోగాన్ని నన్ను నిర్వహించమని అతను అడిగారు. నాకు కొంత జీతం కూడా ఇస్తాను అన్నారు.

చూసారా! నాకు యెంత అద్భుతంగా ఉద్యోగము వచ్చిందో. నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ఈ పని నుండి కొంత పని అనుభవాన్ని నేను పొందుతాను. నాకు ఉద్యోగం ఇచ్చినందుకు బాబాకు చాలా చాలా ధన్యవాదాలు. బాబా లేకుంటే ఇలా ఎప్పటికి జరిగేది కాదు.

ఇక నా మూడవ కోరిక డ్రైవింగ్ లైసెన్స్ పొందడం. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఈ దేశంలో చాలా కష్టం. నేను ఇప్పటికే నేను చిన్న తప్పులతో పరీక్షలో విఫలమయ్యాను. ఈసారి నేను చాలా ఈ విషయంగా చాలా ఆందోళనగా ఉన్నాను. నేను ఈ విషయం గురించి సాయిబాబా యొక్క ప్రశ్న మరియు సమాధానాల సైట్ లో బాబాను అడిగాను. అందులో ఒక అనుకూలమైన జవాబు వచ్చింది.

గత వారంలోనే నేను డ్రైవింగ్ పరీక్షను తీసుకున్నాను, బాబా యొక్క కృప వలన ఈసారి నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. పరీక్ష ఈసారి చాలా సులభంగా ఉండటమే కాకుండా పరిశీలకుడు కూడా చాలా సహనంతో ఉన్నారు.

కేవలం బాబా వలన  మాత్రమే నాకు డ్రైవింగ్ లైసెన్స్ నేడు వచ్చింది. దయచేసి బాబా, నాతో మరియు నా కుటుంబంతో ఎప్పటికీ ఉండండి. నా జీవితంలో ప్రతి క్షణం మీ పవిత్రమైన పాదాలను పట్టుకొని ఉండేలా నాకు శక్తిని ఇవ్వండి. మేము చేసిన తప్పులను క్షమించి, ఎల్లప్పుడూ మాకు సరైన మార్గాన్ని చూపించండి. ధన్యవాదాలు బాబా.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయి నవ గురువార వ్రతం

baaga raasavu sai…navaguruvara vratha mahima amogham..naaku telusu..

Thank you mam..for your comments..please encourage Baba devotees to share their views…Sai Baba…Sai Baba.

Eemi korika lekunna ee vratham prathi saibaba devoties cheyyali..sarvejana sukhinobhavanthu..anukoni cheyyali….

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles