Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: లక్ష్మీ సౌజన్య
నివాసం: హైదరాబాద్.
నేను 2014లో “నవగురువారాల వ్రతం” మొదలు పెట్టాను. అయిదు గురువారాలు ముగిసాయి. వచ్చే గురువారం విజయదశమి వచ్చింది అనుకున్నాను. ఆ గురువారం వచ్చింది.
ఆరోజు నేను వ్రతం చేసి ఉపవాసం ఉన్నాను. ఉదయం నుండి ఏమి తినలేదు. అలాగే నేను నాచెల్లి, నా బండి మీద RTC క్రాస్ రోడ్డు కి వెళ్లుతున్నాము.
వెళ్ళే దారిలో నాకు ఆటో వచ్చి తగిలింది. నేను రోడ్డు మీద పడిపోయాను. నాకు మాట కూడా లేదు అంతలా గాయపరిచి ఆటోవాడు వెళ్ళిపోయాడు.
అక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు నన్ను, మా చెల్లిని కూర్చోబెట్టారు.
మా చెల్లికి కొంచెం దెబ్బలు తగిలాయి. అక్కడున్న వాళ్ళు అందరు చూస్తున్నారు గాని, ఎవరు ముందుకు రావడం లేదు. నాచుట్టూ చాలా మందే ఉన్నారు, కానీ ఉపయోగం లేదు.
ఎవరో తెలియదు అంతలో ఒక ముసలమ్మ వచ్చి నా కాళ్ళు, చేతులు బాగా రుద్ది, నన్ను పట్టుకుని ఆటోలో ఎక్కించి ఆటో వానితో, దగ్గరలో సాయివాణి హాస్పిటల్ ఉంది, అక్కడకు తీసుకోని వెళ్లి అందులో జాయిన్ చేయ్యి అని చెప్పింది అంట.
ఆ ఆటో అతను అక్కడకు నన్ను తీసుకు వెళ్లి జాయిన్ చేసి, బల్ల మీద పడుకోబెట్టాడు అంట. మాచెల్లి అతనికి మనీ ఇద్దాము అని వచ్చేలోపు అతను అక్కడలేడు అంట.
చూసారా! ఆ వచ్చింది ఎవరో తెలిసినదా! ఆ రూపంలో బాబా వచ్చి నన్ను బ్రతికించారు. ఆరోజు నేను చేసిన వ్రతం మహిమ అది.
నన్ను అప్పుడు, ఇప్పుడు నావెంట ఉంటూ నడిపిస్తున్నారు బాబా.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
*** సాయి సూక్తి :
“లోకంలో సమస్త జీవులలో నేను నిండి ఉన్నాను”
Latest Miracles:
- 9 గురువారాల వ్రత మహిమ–Audio
- నమ్మకం వమ్ము కాదు (సాయి వ్రత మహిమ)
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
- సాయి నవ గురువార వ్రతం
- గురు చరిత్ర మహిమ
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments