Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
నమ్మకం వమ్ము కాదు (సాయి వ్రత మహిమ)
2011వ సంవత్సరంలో 9 గురువారముల వ్రతం మొదలు పెట్టగానే బాబా చూపిన లీల:-
మన నమ్మకమే మనని సదా రక్షిస్తుంది. అందులోనూ బాబా మీద మనం పెట్టుకున్న నమ్మకం అదే మన పెట్టుబడి. ఈ పెట్టుబడిలో మనకి నష్టం వస్తుందన్న చింతే లేదు. అంతా లాభమే. ఈ రోజు చదివే లీల లో చూడండి. సాయి వ్రతం మొదలు పెట్టిన మరుసటి రోజునే బాబా తన అనుగ్రహ వర్షాన్నియెలా కురిపించారో. ఒకొసారి మనం చూస్తూ ఉంటాము. అనుకోకుండా పెద్ద వర్షం వచ్చి మనమంతా తడిసిపోవడం. అలాగే అనుకోని విథంగా బాబా అనుగ్రహపు జల్లులో మనం యెంతో సేదతీరతాము. ఆయన అనుగ్రహం కూడా మనం ఊహించని విథంగా ఉంటుంది. బాబా యెవరిని యెప్పుడు యెలా అనుగ్రహిస్తారో అది అనుభవించాకే మనకి అర్థమవుతుంది.
సాయీ నీ లీలలను పొగడతరమా, నిన్ను అర్థం చేసుకోవడం మాతరమా, ఆ శక్తి ని మాకు నువ్వే ఇవ్వాలి.
విశాఖపట్నములో వుండే మా మా తోడల్లుడు గారి అన్నగారి అమ్మాయి 9 గురువారముల సాయి వ్రతము చేస్తూ, కొంత మందిని కూడా పిలిచి తాంబూలం ఇవ్వడం జరిగింది. అప్పుడు వీరి యింటి పక్కనే ఉన్నావిడ కూడా వచ్చి మాటల సందర్భంలో తన బాథలు చెప్పుకోవడం జరిగింది. వారు అంత స్థితిపరులు కాదు. వాళ్ళమ్మాయి చాల బాగా చదువుతుందనీ, యింటర్మీడియట్ లో చేర్పించడానికి తగిన ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఒకాతను ఆర్థికంగా సహాయం చేస్తానన్నాడట. కాని ఆఖరికి అమ్మాయిని కాలేజీలో చేర్పించే సమయం వచ్చేటప్పటికి తను డబ్బు ఇవ్వలేనని. చెప్పడం జరిగిందిట. యెంత బతిమిలాడినా కుదరదని చెప్పాడట. యెలాగోలా తరువాత సద్ది మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తామని అన్నా కూడా ఆ వ్యక్తి డబ్బు సహాయం చేయలేనని చెప్పేటప్పట్కి వీరికి యేమి చేయాలో పాలు పోలేదు. సాయి 9 గురువారముల వ్రతం చూడటానికి వచ్చి తను కూడా వ్రతం చేస్తానని పుస్తకం ఇవ్వమని అడిగారట. మా తోడల్లుడుగారిఅన్నగారి అమ్మాయి, (అంటే ఆడపడుచు కూతురు)మా మరదలు యింటికి వచ్చి “అత్తయ్యా పుస్తకం నా వద్ద ఒక్కటే ఉంది, నేను పూజ చేసుకుని హారతి ఈచ్చేటప్పటికి 12 అవుతుంది, యెలాగా అని మా మరదలుతో చెప్పింది. అప్పుడు మా మరదలు తను వ్రతం పూర్తి చేసుకున్న తరువాత మిగిలిన రెండు పుస్తకాలలోఒకటి ఇచ్చి ఆమెకు ఇమ్మనమని చెప్పారు. మా తోడల్లుడు గారి అమ్మాయి ఆ పుస్తకం తీసుకుని వెళ్ళి ఇచ్చారు. ఆవిడ మొదటి గురువారము నాడు శ్రథ్థగా వ్రతం మొదలుపెట్టారట. వారి యింటి పక్కనే బాబా గుడి ఉంది. మరునాడు శుక్రవారమునాడు ఆమె యింటిలో కుర్చీలో కూర్చుని గుడిలో బాబా ఆరతి అవుతుంటే వింటు మనసులో ఇలా అనుకున్నారట, “బాబా నీ మీద యెంతో నమ్మకంతో ఈ వ్రతం మొదలు పెట్టాను. అమ్మాయిని కాలేజీలో చేర్పించాలి. థన సహాయం చేస్తానన్నఆయన డబ్బు సద్దలేనంటున్నాడు. యెలా బాబా” అని అనుకున్నారట. అనుకున్న 5 నిమిషాలలోనే యింతకు ముందు సహాయం చేస్తానన్న వ్యక్తి ఆవిడకి ఫోన్ చేసి తను డబ్బుఇస్తానని, కాలేజీ ఫీజు కట్టడానికి నేరుగా కాలేజీ కే వచ్చి ఫీజుకట్టేయమంటారా, లేకె మీ యింటికే వచ్చి డబ్బు ఇమ్మంటారా అని అడిగాడట. ఈ విడకి బాబా వ్రతం మొదలుపెట్టగానే బాబా చూపించిన ఈ లీలకి యెంతో ఆశ్చర్యం, ఆనందం వేసి, యింటికేవచ్చి డబ్బు ఇమ్మని చెప్పడం జరిగింది.
ఆత్రేయపురపు త్యాగరాజు
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నవ గురవార వ్రత మహిమ
- 9 గురువారాల వ్రత మహిమ–Audio
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
- బాబా మొదటి విరాళం ఇప్పించాడు. నా నమ్మకం వమ్ము కాలేదు!–Audio
- మొదటిసారి షిరిడీయాత్ర : అనుభవాల మాలిక రెండవ బాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments