Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
9 గురువారాల వ్రత మహిమ
మరొక బాబా లీల. బెంగళూరు నుండి ఒక సాయి భక్తుడు పంపిన లీల. ఆయన పేరు, ఆయన కోరిక ప్రకారం వెల్లడించటంలేదు. ఆయన మాటలలోనే చదవండి.
నేను ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఎప్పటినుండో నేను సాయిని పూజిస్తున్నాను.
సాయి నాజీవితంలో ఎన్నో లీలలు చూపించి అనుభూతులనిచ్చారు. ఈ మధ్యనే జరిగిన ఒక అధ్బుతమైన లీల మీకు వివరిస్తాను. ఐ.టి. ఫీల్డ్ ఎలా ఉంటుందో మీకందరికీ తెలుసు.
ఎక్కువ జీతం వచ్చే కంపెనీలోకి, పాత కంపెనీ వదలి పెట్టి మారిపోతూ ఉంటారు.
దురదృష్టం కొద్దీ నాకు మరొక కంపేనీలో ఉద్యోగం వచ్చింది. దాంతో కారణం ఏమీ లేకుండానే నేను పనిచేస్తున్న కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి 5 నెలల క్రితం ప్రవేశించాను.
కాని నాకు ఈ కొత్త కంపెనీలో ఉద్యోగం అంతగా నచ్చలేదు. నాకు ఈ కంపనీ ఎందుకు నచ్చలేదో నాకు అర్ధమయ్యేది కాదు. చాలా అసంతృప్తిగా ఉండేది.
రాత్రు నిద్రకూడా పట్టేది కాదు. ఎంతో బాధపడి బాబాని ప్రార్ధించి 9 గురువారాల వ్రతం మొదలు పెట్టాను.
అనుకోకుండా ఒకరోజు యింతకుముందు నేను పనిచేసిన కంపెనీ మానేజరు ఫోన్ చేసి తిరిగి మళ్ళి యిదే కంపెనీలో చేరడం నీకు ఇష్టమేనా అని అడిగాడు.
నాకు ఎంతో సంతోషం కలిగింది. వెంటనే ఒప్పేసుకొన్నాను. ఇదంతా షిర్దీ సాయి అనుగ్రహం వల్లే జరిగింది. తొమ్మిది గురువారాల వ్రతం ఆఖరి రోజునే మా మానేజరునించి ఫోన్ వచ్చింది.
బాబా దయవల్ల తిరిగి పాత కంపెనీలో చేరాను.
బాబా నాతప్పులన్నిటినీ క్షమించు. నన్ను వంటరివాడిని చేయవద్దు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- నవ గురవార వ్రత మహిమ
- నమ్మకం వమ్ము కాదు (సాయి వ్రత మహిమ)
- అన్నదాన మహిమ
- బాబా తెలియచేసిన అన్నదాన మహిమ….Audio
- గురు చరిత్ర మహిమ
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “9 గురువారాల వ్రత మహిమ–Audio”
sampath
September 29, 2016 at 7:31 amOm Sai ram
sampath
September 29, 2016 at 7:32 amOm Sai ram