బాబా తెలియచేసిన అన్నదాన మహిమ….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-12-Annadanam-by-Lakshmi-Prasanna 3:27

బాబా తెలియచేసిన అన్నదాన మహిమ.

ఓం సాయి రామ్.

అసలు ఇవ్వడం నేర్పించాడానికే బాబా దక్షిణ అడిగేవారు. అన్నదాన మహిమ మనకు తెలియచేయడానికే బాబా అందరికి ఎవరుతినే పదార్దాలు వారికి బాబా స్వయంగా వండి వడ్డించేవారు.

బాబా కి అన్నదానమంటే ప్రీతీ అని మనకు తెలుసు. బాబా భక్తులు కూడా విరివిగా అన్నదానం చేస్తూ ఉంటారు.

ఆవిధంగా  దానం చేసినప్పుడు ఫలితం ఎలా వస్తుందో బాబా నాకు చూపించారు.

అది ఎలా అంటే కలలో , బాబా బొదలు ఎలా అయినా చెప్తారు. కాల నియమం లేదు. ఒకసారి కలలో అది చాలా పెద్ద గుడి ఆ గుడిలో అందరూ అంగావైకల్యం మరియు వ్యాధిగ్రస్తులు , ఉన్నారు.

అక్కడ నన్ను అన్నదానం కోసం డబ్బులు అడిగారు. నేను వారికి  230 రూపాయలు ఇచ్చాను. దానికి వారు నాకు 100 రూపాయల చిట్టీ ఇచ్చారు. ఇది ఏమిటి నేను ఇచ్చింది 230 కదా ! ,

మరి మీరు 100 రూపాయలు  ఇచ్చినట్టుగా చిట్టీ ఇస్తున్నారు. అని అడిగాను ఇంతలో ఒక పెద్ద పూజారి కషాయం కలర్ బట్టలు వేసుకొని ఉన్నారు.

అతను ఇలా చెప్పారు మీరు ఇచ్చింది 230 రూపాయలే కాని మీ పాప కర్మలు అన్నీ తేసేస్తే మీ కాతాలో పడిన పుణ్యం 100 అందుకే అలా చిట్టీ ఇచ్చారు.

నాకు మెలకువ వచ్చాక ఇది అంతా గుర్తు వస్తే చాలా భయం వేసింది. ఈ చొప్పున మనం ఎంత దానాలు చేయాలి మనం ఇచ్చిన దానికి సగం కూడా పుణ్యం రాలేదు.

అంటే ఈ జన్మకి అంతా కర్మ ,పాపాలు పొతే కదా మరు జన్మ లేకుండా ఉంటుంది. నా ప్రయత్నమే అది అయినప్పుడు మరి నేను చాలా జాగ్రత్త పడాలి కదా అనుకున్నా అంతే వెంటనే అవకాసం ఇచ్చారు బాబా.

ఇంతలో ఒక కాల్ వచ్చింది పలానా చోట అన్నదానం జరుగుతుంది ,మరి మీరు సహాయం చేస్తారా అని ?

బాబా ఇంత వివరంగా చెప్పి మరీ నాతొ ఈ పని చేయించారు అని సంతోషంగా అనిపించిది.

బాబా బొదనల సారం తీసుకున్న వారికి తీసుకున్నంత .

ఇందులో బాబా సచ్చరిత్రలో లాగానే బోదించారు. ఎలా అంటే ముందుగా ఆరోగ్యం బాగాలేనివారికి ,పెట్టి తరువాత మనం తినాలి అనేది చూపించారు అక్కడ ఉన్నది కూడా అందరూ వారే కదా.

నిజానికి మనం చేయవలసిన సేవ కూడా వారికే , అదే బాబా నాకు స్వయంగా చెప్పి మారీ నాకు ఒక అవకాసం ఇచ్చారు బాబా.

ఎప్పటికి నన్ను మీరు వదలొద్దు తాత, మీరు ఇలానే నన్ను కనిపెట్టి నాతొ మిమ్మల్ని చేరుకొనే మార్గం సులువుగా అయ్యేట్టుగా చూడండి తాత ప్లీస్. ఓం సాయి రామ్.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “బాబా తెలియచేసిన అన్నదాన మహిమ….Audio

Sai Baba

I am also requesting Baba after reading this miracle…please give me opportunity to feed at least one person everyday so that my karmas will balance…
Kishore Babu

srinivasa murthy

Chala Bagundi Madam Miracle….Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles