Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీమన్నారాయణ గారు వారి మనమారాలి కంటి సమస్యను తొలగించిన సాయి ఉది మహిమను సాయి బంధువులతో పంచుకోవటానికి saileelas.com కి ఇచ్చారు. వారికీ ధన్యవాదాలు. వారి కుటుంబానికి సాయి ఆశీస్సులు సదా ఉండు గాక.
నా కుటుంబములో స్వయంగా నా మనుమరాలికి ఈ ఊది మహిమ జరిగింది. రెండు నెలల క్రితం మా మనుమరాలు స్కూలు నుంచి వచ్చిన తర్వాత ఏమి చెప్పారమ్మా అని అడిగితే, తాతయ్యా నాకు బ్లాక్ బోర్డు మీది అక్షరాలు కనబడటంలేదు అని చెప్పింది.
ఆమెకు ఏడు సంవత్సరాలు మాత్రమే. మా అబ్బాయి ఆమెను ఐ స్పెషలిస్టు వద్దకు తీసుకెళితే కంటికి స్కాన్ చేసి లేజర్ ట్రీట్మెంట్ చెయ్యాలి. అలా మూడు సార్లు చెయ్యాలి అన్నారు.
ఈలోపున నేను నా స్వానుభవము మీద బాబా గారికి పూజ చేసి ఊదిని రోజూ మూడు రోజుల పాటు నోటిలో కొద్దిగా వేసి, కొద్దిగా నీటిలో కలిపి త్రాగించేవాడిని.
ఆతర్వాత ఎందుకైనా మంచిది అని సెకండ్ ఒపీనియన్ తీసుకుందాము అని వాసన్ ఐ కేర్ కి తీసుకువెళ్ళారు. అక్కడ మొత్తం పరీక్షించి అంతా బాగానే ఉంది ఒకసారి రెటీనా స్కాన్ చేయించండి చాలు అన్నారు.
రెటీనా స్కాన్ చేయిస్తే అంతా బాగానే ఉంది అని వచ్చింది. చాలా ఆనందం పడిపోయాము.
ఇది యంతా బాబాగారి ఊదీ మహిమ.
నా మనుమరాలికి ఇప్పుడు బ్లాక్ బోర్డు మీద అక్షరాలు బాగానే కనపడుతున్నాయి. అంతా ఊదీ మహిమ. నామనుమరాలికి తన చిన్నప్పటి నుంచి ఊదీ తినడం అలవాటు.
ఆమెకే కాదు నాకు కూడా. రోజూ నేను పూజ అయిపోయిన తర్వాత శిరిడీ నుంచి తెచ్చిన ఊదీని నుదుట పెట్టుకుంటాను.
జై శ్రీమన్నారాయణ..🙏🙏
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా తెలియచేసిన అన్నదాన మహిమ….Audio
- తల్లిదండ్రులు చేసిన బాబా నామ జపం, బిడ్డకు ఉద్యోగములో స్థిరత్వం
- 9 గురువారాల వ్రత మహిమ–Audio
- బాబా విభూతి మహిమ(దెబ్బకు రోగం మాయం)–Audio
- శ్రీమన్నారాయణ గారి అనుభవాలు – శ్రీ సాయిబాబా ఊదీ మహిమలు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “శ్రీమన్నారాయణ గారు అందించిన బాబా ఉది మహిమ–Audio”
Sai Suresh
September 19, 2016 at 7:48 amసాయి ఉది పై విశ్వాసమె జయిస్తుంది