శ్రీమన్నారాయణ గారి అనుభవాలు – శ్రీ సాయిబాబా ఊదీ మహిమలు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by : Mrs Lakshmi Prasanna


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఈరోజు విజయవాడ లో  నివాసముంటున్న  శ్రీమన్నారాయణ గారు తెలియజేసిన స్వీయ అనుభవాలు తెలుసుకుందామా

శ్రీ సాయిబాబా ఊదీ మహిమలు :

శ్రీ సాయిబాబా ఊదీ మహత్మ్యము నా(శ్రీమన్నారాయణ గారు) స్వీయ అనుభూతులు రెండు మీ ముందు పెడుతున్నాను.

నేను రాజమండ్రి లో ఉన్నపుడు ధవళేశ్వరంలో మా బంధువుల ఇంటి ప్రక్కన ఉన్న ఒకతని కొడుకుకి బ్లడ్ కేన్సర్ వచ్చింది.

అతనిని చాలా మంది డాక్టర్లకు చూపించి చాలా కాలం మందులు వాడగా ఆ వ్యాధి ఏమి కుదుటపడలేదు సరికదా ఆ కుర్రవాడు లేవలేని స్థితికి వచ్చాడు.

అప్పుడు కొంతమంది డాక్టర్ల సలహామేర హైదరాబాదు అపోలో హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు  సిద్ధమయ్యారు.

ఆ సమయములో ఆ కుర్రవాడి సంగతి తెలిసి నేను ఒక ఆలోచన చేసాను.

అది బాబాగారి మీద భారమేసి. బాబాగారి పూజ చేసి, శిరిడీ నుంచి తెచ్చిన ఊదీని తీసుకొని వాళ్ళు వెళ్ళే గోదావరీ ఎక్స్ ప్రెస్ వద్దకు వెళ్ళి వాళ్ళకి నేను పూజచేసిన ఊదీని ఆ కుర్రవాని క్యాన్సర్‌ వ్యాధి నయమవ్వాలని బాబాగారిని కోరుకొని వాళ్ళకి ఇచ్చి ఇలా చెప్పాను.

ప్రతీ అరగంటకు ఒక చిన్న గ్లాసులో నీళ్ళు పోసి అందులో ఊదీ కలిపి ఆ కుర్రవానికి పట్టమని. వాళ్ళు బాబాయందు నమ్మకముంచి రాత్రంతా నిద్రమానుకొని అతనికి అలానే పట్టారు.

చివరకు హైదరాబాదు అపోలో హాస్పిటల్ కి వెళితే అక్కడ అతనికి అన్ని టెస్టులు చేసి ఇతనికి ఏ జబ్బులేదు మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు అని పంపించేసారు.

తల్లిదండ్రులు చాలా  ఆనందము చెందారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ కుర్రవాడు మామూలుగా తన పనులు తను చేసుకోవడం మొదలుపెట్డాడు. అందరం సంతోషించాము. బాబాగారి ఊదీ మహిమ వల్ల జరిగింది.

ఇంకొకటి నాకు స్వయంగా జరిగింది. బాబాగారే స్వయంగా నాముందుకు వచ్చి వెళ్ళారు అనుకుంటున్నాను.

నేను నాభార్య ముగ్గురు పిల్లలు మా అత్తగారు అందరం కలిసి 1993 వ సంవత్సరములో మా అమ్మగారి అస్తికలు  గంగానదిలో కలపడానికి కాశీ వెళ్ళాము.

ఆ కార్యక్రమం  అంతా పూర్తి చేసుకొని అందరం గంగానదిలో స్నానం చేసి బయటకు వచ్చేసరికి నాకు స్ప్రుహ తప్పి నోటివెంబడి నురగలు వచ్చి క్రింద పడిపోయాను. అందరూ చాల కంగారు పడిపోయార.

నేను బ్రతకను అనుకున్నారు. పిల్లలు చిన్నవాళ్ళు, మావాళ్ళకు భాష రాదు.

ఆ సమయంలో మావాళ్ళు, ఇంక మిగిలింది ఒక్కటే దారియని బిగ్గరగా బాబా సాయిబాబా అని ఏడుస్తుంటే అప్పుడొక వ్యక్తి ఆకుపచ్చ కుర్తా గళ్ళ లుంగీ కట్టుకొని గుమిగూడిన అందరిని తప్పించుకొని నా వద్దకు వచ్చి ఒక ఆయిల్ నా ఒంటికి పూసి తన వద్దనున్న విభూతిని నానుదుట రాసాడు.

మరు నిముషంలో  నాకు తెలివి వచ్చి చూసేసరికి ఎదురుగా ఆయన అలా కనిపించాడు. పైకి లేచేసరికి ఎక్కడా కనిపించకుండా పోయేసరికి అంతలెఖ్ఖా వెతికాను. ఆయన ఎక్కడ కనిపించలేదు.

ఇవి  రెండూ నా స్వీయ అనుభవాలు బాబాగారు నాయందున్నారనటానికి నిదర్శనాలు.

జై శ్రీమన్నారాయణ..🙏🙏

సర్వం సాయినాథర్పాణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీమన్నారాయణ గారి అనుభవాలు – శ్రీ సాయిబాబా ఊదీ మహిమలు–Audio

బాబాగారి విభూతిని నమ్మితే “ఆరోగ్యం”.

నమ్మకపోతే “దానంత దౌర్బాగ్యం ” వేరే ఉండదు.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles