Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
సాయితో సాయిబానిస అనుభవాలు – 3
ప్రతీ వారి జీవితంలో కష్టాలు సుఖాలు సాధారణం. కష్ట సమయాలలోనే భగవంతుడిని గూర్చి ఆలోచించడం సర్వసాధారణం. అన్ని విషయాలలోనూ శ్రీసాయిబాబా యెల్లప్పుడూ నాయందు చాలా దయతో ఉన్నారు. సాయిబానిసా అనుభవాల క్రమంలో ఇది మూడవది. ప్రతీ భక్తుడు మొదటి అనుభూతిని మరవడం అరుదు, నేను దీనికి మినహాయింపు కాదు. 1989 కి ముందు నాకు యిటువంటి సత్పురుషుని గురించి తెలియదు. అప్పుడు జనవరి, ఫిబ్రవరి నెలలలో, నా స్నేహితులలో ఒకరు నాకు సాయి పటాన్నిబహుమతిగా ఇచ్చారు. యెంతో భక్తితో నేను దానిని నా పూజా గదిలో ఏర్పాటుచేసి పెట్టాను. సాయి వదనంలోని చిరునవ్వు నన్నెంతో సమ్మోహితుడ్ణి చేసింది. అది వెంటనే తన వైపుకు లాక్కుని ఇక అప్పటినుంచి నా మనస్సులోశాశ్వతమయింది. నాకు ప్రతీ శనివారమూ D A E కాలనీలోని ఆంజనేయస్వామి గుడికి, పోచమ్మతల్లి గుడికి వెళ్ళడం అలవాటు. రోజులు గడుస్తున్నాయి. నా స్నేహితుడు శ్రీ భోన్స్ లే గారి సలహా మీద 1989 జూలై నెలలో షిరిడీ వెడదామనుకున్నాను. జూలై నెలలో ఒక శనివారము ఉదయము నాలుగు రూపాయలు జేబులో వేసుకుని ఆంజనేయస్వామి గుడికి, పోచమ్మ తల్లి గుడికి బయలుదేరాను. ఆంజనేయస్వామి గుడిలో పూజారికి ఆరతి అనంతరము రెండు రూపాయలు ఇచ్చాను, గుడి బయట వేపచెట్టు కింద ఉన్న ఒక వృధ్ధురాలికి ఒక రూపాయి ఇవ్వదలచినాను. కాని ఆమె ప్రక్కన ఖాకి నిక్కరు ఖాకి చొక్కా తలకి తెల్లటి వస్త్రము భుజాన తెల్లటి జోలి, చేతిలో డాల్డా డబ్బా ఒక పొట్టి కఱ్ఱతో ఉన్న ఒక వృధ్ధుణ్ణి చూశాను. అతను కూడా నా నుండి భిక్షను అడిగినాడు. ఆ వేప చెట్టుకింద ఉన్న ముసలామెకు, ఈవృధ్ధుడికి చెరొక రూపాయి ఇచ్చి పోచమ్మ తల్లి గుడికివెళ్ళి, పోచమ్మ తల్లికినమస్కరించి యింటికి బయలుదేరాను.. పోచమ్మ తల్లి దర్శనం చేసుకుని యింటికి వెళ్ళుతూ వెనక్కి తిరిగి ఆ వృధ్ధుణ్ణి చూశాను. అతను నేనిచ్చిన రూపాయి నాణాన్ని చేతితో రుద్దుతూ చిరునవ్వు చిందించసాగినాడు. నేనుయింటికి చేరుకుని నా పూజా మందిరములోని సాయి పటమును చూసినాను. ఆ పటములోని చిరునవ్వు ఆ వృధ్ధునియొక్క చిరునవ్వు ఒకే విథముగా ఉండుట చేత తిరిగి వేప చెట్టు దగ్గిరకి వచ్చినాను. నేను వేపచెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ వృధ్ధుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడని గమనించాను. ఆవృధ్ధురాలితో ఆ ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్కా ధరించిన వృధ్ధుడిని గురించి అడిగినాను. ఆమె ఆ వృధ్ధుడు ఖాకీ నిక్కరు ఖాకీ చొక్కా ధరించలేదనీ,ఒకతెల్లని కఫనీ మాత్రమే ధరించి ఉన్నడనీ ఆమె చెప్పినది. ఆమె చెప్పిన వర్ణన శ్రీసాయిబాబా రూపముతో పోలియుండుట చేత ఆమె అదృష్టవంతురాలని భావించి శ్రీ సాయి ఆ ముసలివాని రూపములో వచ్చి నా నుండి ఒక రూపాయి దక్షిణ స్వీకరించి నన్ను ఆశీర్వదించారని భావించాను.
విలక్షణమైన చిరునవ్వుతో నావద్ద నించి దక్షిణ తీసుకున్న అతను నాసాయి, మొదటిసారే నేను నా సాయినిగుర్తించడంలో విఫలమయ్యాను. నేను నాస్కూటర్ మీద పిచ్చివాడిలా D A E కాలనీలోని వీథులన్ని తిరిగాను కాని నా సాయి నాకెక్కడా కనపడలేదు. అదేరోజు మధ్యాహ్న్నం మూడు గంటలకి నేను నా మితృడు భోన్స్ లే షిరిడీకి బయలుదేరాము. మరునాడు ఉదయం(ఆదివారం) మేము షిరిడీ చేరుకున్నాము. సమాధి మందిరములోనే బాబాకి కన్నీళ్ళతో ముకిళిత హస్తాలతో నమస్కరిస్తున్నప్పుడు ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్కా ధరించిన సాయినాధులవారు నన్ను ఆశీర్వదించారు. ఆనాటి నుండి నేటి వరకు నా ప్రతి చిన్న పెద్ద విషయాలలో సాయి నాకు తోడుగా ఉండి నిరంతరము సహాయం చేయుచున్నారు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 1(a)
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 1(b)
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 2
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 4
- నా సాయినాధుల వారే ఈటిక్కట్టు కలెక్టరు పై అధికారి రూపములో వచ్చి నన్ను ఆ కష్టము నుండి రక్షించి నన్నుఆశీర్వదించారనే భావన కలిగింది–సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు). — 7–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments