సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 1(a)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

శ్రీ రావాడ గోపాలరావుగారు బాబా వారి అనుగ్రహంతో 1989 లో సాయి భక్తునిగా మారారు. శ్రీ రావాడ వెంకటరావు, రావాడ రమణమ్మ పుణ్యదంపతులకు 24, ఏప్రిల్, 1946 లో ఆయన జన్మించారు. ఒక రోజున ఆయన ధ్యానంలో ఉండగా, బాబా వారు ఆయనకి “సాయిబానిస” అని పేరుపెట్టారు. అంటే దాని అర్థం “బాధ్యతలు నిర్వర్తించే సన్యాసి”

బాబావారి సూచనల ప్రకారం ఆయన 25.12.1998 నుంచి సాయి తత్వాన్ని చాలా చురుకుగా విస్తృతంగా యింటర్నెట్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. saidarbar.org ఆయన ఫౌండర్ మెంబరు. భారత ప్రభుత్వంలో సైంటిఫిక్ ఆఫీసరుగా పని చేస్తూ తన 54 వ ఏట స్వచ్చందంగా పదవీ విరమణ చేసి సాయి సేవకి, సాయి భక్తులకి అంకితమయ్యారు. బాబా ఆయనకి తమ అనుగ్రహాన్ని అందచేశారు. ఆయనకి స్వప్నాలలో ఏ సందేశాలిచ్చినప్పటికీ వాటిని వర్గీకరించి సాయి తత్వంగా అందించారు. సాయిదర్బార్ ద్వారా ఆయన ఇచ్చిన సాయి సందేశాలు యెంతో ప్రజాదరణ పొందాయి.

ఆర్గనైజర్స్ యొక్క ఆహ్వానం మీద ఆయన, నవంబరు 22-25, 2000 సంవత్సరంలో చికాగో, అక్టోబరు, 4-5, 2003 సంవత్సరంలో ఓర్లాండొ, ఫ్లోరిడా, యూ.ఎస్.ఏ. లో జరిగిన సాయి ఉత్సవ్ లకి హజరయారు. అయిదు ఖండాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 14 సాయి దర్బార్ సభలకి ఆయన ముఖ్య సేవకుడు. వాటి ప్రధాన కార్యాలయం విశ్వసాయి దర్బార్ లండన్ యూ.కే. లో ఉంది.

సాయి బానిస గోపాలరావు రావాడగారు ఆధ్యాత్మికోపన్యాసాలు ఈ క్రింద వివరించిన విషయాలమీద ఆంగ్లములోను, తెలుగులోను ఇచ్చారు.

1. స్వప్నంలో సాయి – శాస్త్రీయతకు దగ్గరగా

2. భాగవతంలో సాయి

3. రామాయణంలో సాయి

4. సాయి సంపూర్ణ దత్తవతారం

5. సాయి తత్వం

6. జీవితం మీద సాయి దృక్పధం

7. దంపతులకి సాయి సలహా

8. సాయిబానిసావారి స్వప్నాలలో సాయి

9. సాయితో సాయిబానిసావారి అనుభవాలు

10. తన భక్తుల జీవితాలలో సాయి

11. సాయి చెప్పిన మాటల అంతరార్థాలు

12. సాయి, మరియు పూర్వకాలపు సత్పురుషులు

13. భగవంతుడు సత్యం – సాయి సత్యం

14. నా సమాథినుండి నా ఎముకలు మాట్లాడతాయి – బాబా

సాయిబానిసా వారి ముఖ్యోద్దేశ్యం

“షిరిడీ సాయి భక్తుల హృదయంలోనే సాయి ఉన్నారని వారికి తెలియచేసి వారికి సహాయం చేయడం”.

షిర్డీ సాయితో సాయిబానిస అనుభవాలు — 1

1989 ముందు వరకు నాకు శ్రీ షిరిడీ సాయిబాబా గురించి తెలియదు. 1989, జనవరిలో ఒకరు నాకు శ్రీ సాయిబాబా ఫోటోనిచ్చారు. ఆ ఫొటోని చూసినప్పుడెల్లా సాయి నావైపు నవ్వుతూ ఉన్నట్లుగా నాకు అనిపించేది. నిజంగా అది అయస్కాంతంలా నన్నాకర్షించింది.నేను తప్పకుండా షిరిడి దర్శించాలనిపించింది. 1989 జూలై నెలలో మా పొరింగింటాయన శ్రీ భోన్స్లే గారు తనతో కూడా షిరిడీ కి రమ్మని నన్నాహ్వానించారు. నేను షిరిడీ వెళ్ళాను అదే నా జీవితంలో మలుపు. 07.06.1990 నుంచీ నేను ప్రతీరోజు శ్రీ పత్తి నారాయణరావు గారు వ్రాసిన “సాయి సచ్చరిత్ర” ను చదవడం ప్రారంభించాను, అప్పటినుంచీ నా జీవిత విథానం పూర్తిగా మారిపోయింది.1989 కి ముందు నేను ఒక ఒక గమ్యము లేని మనిషిగా ఉన్నాను. “శ్రీసాయి సచ్చరిత్ర” చదివిన మొదటి రోజునే నా సంసార జీవితంలో బాధ్యత, గౌరవప్రదమైన జీవితం తెలిసింది. 11.04.1991 న సాయి సచ్చరిత్రలో 21 వ అధ్యాయం చదువుతున్నాను, 175 పేజీలోని ఈ క్రింది వాక్యాలు నన్నాకర్షించాయి, “నువ్వీ పుస్తకాన్ని తప్పక చదవాలి, అలా చేస్తే కనక నీ కోరికలు నెరవేరతాయి, నీ విథులు నిర్వర్తించడానికి నువ్వు ఉత్తరం వైపుకు వెళ్ళినప్పుడు నీ అదృష్టము చేత ఒక సాథువును కలుసుకుంటావు, అప్పుడాయన నీకు భవిష్యత్తుకు దారి చూపిస్తారు, నీ మనస్సుకు ప్రశాంతతనిస్తారు”. 1991, మార్చ్ లో , ఆఫీసు పనిమీద కొంతమంది ఆఫీసర్లని స్వీడన్ మరియు దక్షిణ కొరియాకి పంపుతారనే మాట ఆఫీసులో వచ్చింది.

11.04.1991 ఉదయం 7.30, నాకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఇమ్మని బాబాని ప్రార్తించాను. 11.04.1991 న నేను ఆఫీసుకు వెళ్ళేటప్పటికి, పాస్ పోర్ట్స్ పేపర్స్ మీద నన్ను సంతకాలు చేయమన్నారు. ఛీఫ్ ఎగ్జ్యిక్యూటివ్ గారు మరొకరితో స్వీడన్ మరియు దక్షిణ కొరియ వెళ్ళడానికి నా పేరు కూడా రెకమెండ్ చేశారని ఆరోజు తెలిసింది. పాస్పోర్ట్ పేపర్స్ మీద నేను సంతకం చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, శ్రీ షిరిడీ సాయినాథుని చరణ కమలాల మీద శిరసు వంచి నా “ప్రణామాలు” సమర్పించుకున్నాను. 01.05.1991 న అఫీషియల్ పాస్పోర్ట్, విసా నా చేతికి వచ్చాయి. నేను నా తోటి ఆఫీసరు కలసి 05.05.1991 న హైదరాబాదునుంచి దక్షిణకొరియా కు బయలుదేరాము.

06.05.1991 న తెల్లవారుజామున ఒంటి గంటకు, బొంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో నా సెక్యూరిటీ చెక్ పూర్తయింది, స్విస్ యైర్ వారి విమానంలోకి యెక్కడానికి నేను నిరీక్షిస్తున్నాను (ఫ్లైట్ జ్యూరిచ్-బొంబాయి-హాంగ్ కాంగ్-సియోల్). విమానంలోకి యెక్కేముందు బాబాని ప్రార్థించుకోవాలనిపించింది . యైర్ పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ షాపులన్నిటి పక్కనుంచి వెడుతూ ఉండగా ఒక షాపులో శ్రీ సాయి బాబా పటం కనపడేటప్పటికి నాకు సంతోషం కలిగింది. అప్పుడు సమయం తెల్లవారుజాము 1.10 అయింది, విమానం 1.20 కి బయలుదేరుతుంది. నేను ఆ పటంముందు రెండు నిమిషాలు నిలబడి ప్రార్థించుకుని విమానంలోకి యెక్కాను. సమయం 1.20 అయింది, విమానం రన్ వే మీద కదులుతోంది. 1.30 కి విమానం గాలిలోకి లేచింది. యింటర్నేషనల్ ఫ్లైట్ లో విదేశానికి ప్రయాణిం చేయడం అది నాకు మొదటి అనుభవం, నా గుండె వేగంగా కొట్టుకుంటొంది. నేను 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ఓం సాయి – శ్రీ సాయి – జయజయ సాయి’ అని సాయి నామం జపించుకోవడం మొదలెట్టాను. పైలట్ సీట్ బెల్ట్స్తీ తీసి రెలాక్స్ గా కూర్చోమని అనౌన్స్ చేశాక నాకు ఆనందం వేసింది. అప్పుడు విమానం 40,000 అడుగుల యెత్తులో గంటకు 900 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. విమానం టేక్ ఆఫ్ అయ్యేముందు మంచి శరీర దారుఢ్యము గల ఒక పెద్ద మనిషి నాపక్కన కూర్చున్నాడు. యైర్ హోస్టెస్ కూల్ డ్రింక్స్ ఇస్తూండగా, నేనా పెద్దమనిషిని మీరేవరూ, యెక్కడనించి వస్తున్నారని స్నేహపూర్వకంగా అడిగాను. తన పేరు రాజ్.ఐ.మిర్పూర్ అని షిరిడీ నుంచి హాంగ్ కాంగ్ వెడుతున్నట్లుగా చెప్పాడు. నాకెంతో సంతోషం కలిగి ఆయనతో సాయి లీలల గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. మేము తెల్లవారుజాము 3.00 గంటలవరకూ మాట్లాడుకున్నాము. నేను సాయిబాబా కాకడ ఆరతి చదువుకోవడానికి 5.00 గంటలకు అలారం పెట్టుకుని నిద్రపోయాను.

రేపు తరువాయి భాగం….

 

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles