బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పతోమ్మిదవ భాగం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi Prasanna


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

మోరేశ్వర్ ఆస్త్మా నయమగుట

మోరేశ్వర్  బాబాకు సన్నిహిత భక్తుడు. ఆయన బొంబాయి హైకోర్టు జడ్జీ. ఆయన ఆస్త్మాతో విపరీతంగా బాథ పడుతున్నారు. ఆయన మా తాతగారితో బ్రిడ్జ్ ఆట (పేకాట) లో భాగస్వామిగా ఉండేవారు. ఆయన ఆస్త్మా తగ్గడానికి మాతాతగారు ఆయనని షిరిడీ వెళ్ళమని సలహా యిచ్చారు. ఆయనందుకు ఒప్పుకున్నారు. ఆయన షిరిడీకి మొట్ట మొదట వెళ్ళగానే, బాబా ఆయనకి స్వయంగా చిలిం యిచ్చి పీల్చమన్నారు. మోరేశ్వర్ కొంచెం ఆండోళన పడ్డారు, కాని చిలిం పీల్చారు. అది ఒక అద్భుతం. ఆక్షణం నించీ ఆయనకి ఆస్త్మా రాలేదు. ఒక వ్యక్తి వ్యాథిని నయం చేయడానికి యెటువంటి విచిత్రమైన విథానం? మోరేశ్వర్ మా తాతగారికి థన్యవాదాలు చెప్పుకున్నారు. అప్పటినుంచి ఆయన శ్రీ సాయిబాబా కి గొప్ప భక్తుడయ్యారు.

అది 1918 సం. విజయదశమి రోజు మధ్యాహ్న్నం తరువాత హటాత్తుగా మోరేశ్వర్ గారికి ఆస్త్మా వచ్చింది. అది చాలా విపరీతంగా ఉండటంతో ఆయన తన సేవకుడిని బాంద్రా పంపి మా తాతగారిని శాంతాక్రజ్ లో ఉన్న తన యింటికి రమ్మన్నారు. మోరేశ్వర్ గారి సేవకుడు మా తాతగారితో తన యజమాని హటాత్తుగా జబ్బుపడ్డారని, వెంటనే వచ్చి సహాయం చేయమని అడిగాడు. మా తాతగారు మా నాన్నగారితో కలిసి యింటినుంచి బయలుదేరారు. వారు తమతో కూడా వారు ఆఖరుసారి షిరిడీ వెళ్ళినపుడు బాబా స్వయంగా యిచ్చిన ఊదీని తీసుకుని వెళ్ళారు. మోరేశ్వర్ విపరీతమైన బాథతో ఉండటం చూశారు. మాతాతగారాయనని ఓదార్చారు. మా తాతగారు గ్లాసు నీళ్ళలో ఊదీని వేసి మోరేశ్వర్ తో దానిని తాగమన్నారు. మోరేశ్వర్ ఆయనని తన సన్నిహిత స్నేహితునిగా భావిస్తున్నందున ఆయన చెప్పినట్లు చేశారు. యెప్పుడయితే ఆయన ఆనీటిని తాగారో ఆయన బాథయొక్క తీవ్రత తగ్గుతూ కొంత సేపటికి ఆయనకి నయమనిపించింది. మోరేశ్వర్ మా తాతగారితో, బాబా తన ఆస్త్మా పూర్తిగా నయమయిందని చెప్పినా మరి మరలా యెందుకు తిరగబెట్టిందని అడిగారు. మా తాతగారు ఆయనతో చింతించవద్దని, ఒకవేళ మరలా వస్తే కనక బాబా ఊదీనే మందులా తీసుకోమని చెప్పారు.

యేమయినప్పటికీ మోరేశ్వర్ యిక యేమీ చేయనవసరం లేకపోయింది. ఊదీ తీసుకున్నందువల్ల ఖచ్చితంగా ఆస్త్మా తగ్గిపోయింది కాని ఈ సంఘటన వెనుక వేరే ఏదో సందేశం ఉంది. వారికది తరువాత అర్థమయింది. అదేరోజు సుమారు మధ్యాహ్న్నం 2 గంటలకి షిరిడీ సాయిబాబా సమాథి చెందారు. అలా చెందుతూ ఆయన తనదైన సంక్లిష్టమయిన పథ్థతిలో తన అంకిత భక్తులకి తంత్ర రహిత (వైర్లెస్) సందేశం పంపించారు. మ తాతగారికి, నాన్నగారికి ఆ తంత్రరహిత సందేశం వచ్చింది.  అదేమిటో చదవండి.

సాయి మహా నిర్వాణ ఋజువు ముంబాయిలో

మా నాన్నగారు, తాతగారు, యెంతో హామీతో ఇచ్చిన అదే ఊదీని యింత తొందరగా ఆయనకు ఉపయోగించవలసి వస్తుందని వారెప్పుడు ఊహించలేదు. దానికి వారెంతో సంతోషించారు. కాని ఆసక్తికరమయినది ఒకటి జరిగింది. మోరేశ్వర్ యింటినించి వారు బాంద్రాలోని తమ యింటికి తిరిగి వచ్చాక, బాబాకు థన్యవాదాలు తెలుపుకునేందుకు తమ చందనపు మందిరం ముందుకు వెళ్ళారు. అక్కడ బాబా చిత్రపటం అది పెట్టబడిన చెక్క దిమ్మనుండి  జారి కిందకి వేళాడుతూ ఉన్న స్థితిలో చూశారు. తాము లేనప్పుడు పనివాడు శుభ్రం చేయడంలాంటిదేమన్నా చేశాడా అని మా నాన్నమ్మగారిని అడిగారు. ఆరోజు విజయదశమి కనుక అంతా శుభ్రం చేయడం, పూజ అన్నీ కూడా ఉదయమే జరిగాయి కాబట్టి, అలా  అ జరగడానికి అవకాశం లేదు. కాకతాళీయంగా జరిగిన ఈ రెండు సంఘటనలకి యేమన్నా సంబంథం ఉందేమోనని ఆలోచించారు. బాంద్రాలోని వారింటికి దగ్గరలోనే ఉంటున్న టెండూల్కర్ యింటికి గాని, దభోల్కర్ గారి యింటికి గాని వెడదామని అనుకున్నారు. కాని యిది అవసరం లేకపోయింది, కారణం విలే పార్లే నుంచి దీక్షిత్ గారి సేవకుడు సాయంత్రం వారింటికి వచ్చాడు. అతను షిరిడీలో మథ్యాహ్న్నం బాబా మరణించారని చెప్పాడు. దీక్షిత్ గారు షిరిడీకి బయలు దేరుతున్నారనీ బాబా సాహెబ్ తార్ఖడ్ గారిని (మా తాతగారిని) తనతో రమ్మనమని చెప్పారని చెప్పాడు. యిది తెలుసుకున్నాక వారిద్దరూ ఈ రెండు సంఘటనలని క్రోడీకరించుకుని, బాబా తాను ఈ ప్రపంచానికి వీడ్కోలు చెబుతూ మహా సమాథి చెందుతున్నానని తమకు వైర్ లెస్ మెస్సేజ్ యిచ్చినట్లు అర్థమయింది. అంచేత అది తాత్కాలికంగా తిరగబెట్టిన ఆస్త్మా, చందనపు మందిరంలో బాబా చిత్రపటం జారడం, షిరిడీకి బొంబాయికి మథ్యనున్న దూరం ఊహించుకోండి. తాను యిక శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నానని తన ప్రియ భక్తులకి సందేశమిచ్చిన విథానం యెంత విచిత్రం. ప్రియమైన సాయి భక్తులారా బాబా చాలా చక్కగా తగిన విథంగా చెప్పారు. “అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాథిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదాననంద సాయినాథ్” గా బాబా పిలవబడ్డారు . అటువంటి అపూర్వమైన పథ్థతిలో సందేశాన్ని తన ప్రియ భక్తులకివ్వడం వెన్నులోంచి తీవ్రమైన ప్రకంపనాలానుభూతి కలగడం వారికి మాత్రమే బాగా తెలుసు. సాయిబాబా వారి మహా సమాథి శారీరకంగానే జరిగింది కాని, తానెప్పుడూ అక్కడే ఉంటాననీ వారి పిలుపుకి సిథ్థంగా ఉంటానని తన అవతార కార్యంలో ఆయన భక్తుల మదిలో ముద్ర వేశారు. “నా సమాథినుండి నా యెముకలు మాట్లాడతాయి. నా యందు అమితమైన విశ్వాసం పెట్టుకోండి” అని ప్రకటించారు. శాశ్వతమైన సత్యం , నేనెప్పుడు జీవించేవుంటాను. యిది నా వాగ్దానం, వీటిని మీరెప్పుడు మరవద్దు.” (నిత్య మె జీవంత జానా హేచి సత్యా).

మనం 21 వ శతాబ్దంలో ఉన్నాము. యిప్పటికీ మనం రామనవమి, గురుపూర్ణిమ, విజయదశమి, ఉత్సవాల రోజులలో షిరిడీలో ఆయన భక్తులని చూడగలం. లార్డ్ సాయితో అటువంటి ఆథ్యాత్మిక సాహచర్యం పొంది, మా నాన్నగారు మిగిలిన జీవితం ఒక సామాన్యునిలా గడిపే విథానం యెలా స్వీకరించారా అని కూడా ఆశ్చర్య పోతూ ఉంటాను. సామాన్యంగా ఉన్న నియమం యేమిటంటే యెవరయినా ఈ ప్రాపంచిక (సాంసారిక జీవితం) లోని అడ్డంకులను అథిగమించడానికి పరమాత్మని తెలుసుకోవాలనే మార్గాన్ని యెంచుకుంటాడు. కాని మా నాన్నగారి జీవితం దీనికి మినహాయింపు. అది యెవరయినా ఒప్పుకోవలసిందే. మా నాన్నగారి ఆఖరి జీవితం గురించిన వివరాలు అదీ కూడా అద్వితీయమైనది వివరిస్తాను.

రేపు తరువాయి భాగం…

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles