Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
యిపుడు, ఆ రోజులలో ఒక హైందవ స్త్రీ మసీదుకు వెళ్ళి ఒక పీర్ను కలుసుకోవడమంటే చాలా కష్ట సాథ్యమయిన విషయం. మా నాన్నమ్మ్త గారు తన కుమారుడు జ్యోతీంద్ర గారికి సలహా ఇచ్చింది. స్వభావ సిథ్థంగా చాలా థైర్యవంతుడయిన ఆయన ఒక బురఖా యేర్పాటు చేసి తన తల్లిని కారులో పీర్ మౌలానా బాబా వద్దకు తీసుకుని వెళ్ళాడు. కాని ఒక మానవ మాత్రుడు తీరని వ్యాథితో బాథ పడుతున్నప్పుడు మత కట్టుబాట్లను చేదించడం కష్టం కాదు. కాని మౌలానా బాబాని కలుసుకున్న తరువాత వారి కష్టాలు నెమ్మదించడానికి బదులు యెక్కువయాయి. మౌలానా బాబా మా నాన్నమ్మ్త ఆమె బాథ పడుతున్న వ్యాథిని నయం చేయడానికి తన వద్ద మందు లేదని చెప్పాడు. కాని ఆమెతో “షిరిడీలో నా సోదరుడు సాయిబాబా అనే ఆయన ఉన్నాడు. మీరు ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన మీకు నయం చేసి మీ బాథలన్నిటినీ పోగొడతాడు” అని చెప్పాడు.
యిప్పుడు వారిద్దరూ పెద్ద కష్టంలో పడ్డారు. మొదటగా మా తాతగారు ప్రార్థనా సమాజ్ వాది. యెక్కువ అహంకారి. ఆయన అటువంటి బాబాలని కలుసుకోవడానికి అనుమతివ్వరని వారికి తెలుసు. యిక రెండవది, షిరిడీ యెక్కడ ఉంది, అక్కడకు యెలా వెళ్ళాలన్నదే పెద్ద ప్రశ్న. యేమయినప్పటికీ జ్యోతీంద్ర వెనుకాడలేదు. ప్రియ పాఠకులారా ! యిక్కడ నేను నమ్మేదేమిటంటే వారు శ్రీ సాయిబాబాను కలుసుకోవాలని ముందే వారి భవితవ్యం వ్రాసి ఉండబడి ఉంటుంది. అందుచేత యెవరూ కూడా వారిని ఆపలేరు.
ఆయన మెట్రొ థియేటర్ వద్ద నున్న యిరానీ రెస్టారెంట్ యజమానినించి సమాచారాన్నంతా సేకరించారు. షిరిడీ గ్రామం అహ్మద్ నగర్ జిల్లాలో ఉందని, అక్కడికి వెళ్ళాలంటే యెవరైనా రైలులో మన్మాడ్ మీదుగా కోపర్గావ్ వెళ్ళాలని తెలుసుకున్నారు. కోపర్గావ్ నుంచి, 9 కి.మీ. దూరంలో ఉన్న షిరిడీకి గుఱ్ఱపు బండిలో వెళ్ళాలి. దీనర్థం యేమిటంటే యింటి నుంచి బయలుదేరితే కనీసం 3 రోజులు యింటికి దూరంగా ఉండాలి. యేమయినప్పటికీ జ్యోతీంద్ర వాళ్ళ నాన్నగారి అనుమతి సంపాదించి ప్రయాణానికి అన్ని యేర్పాట్లు చేశారు. ఒక శుక్రవారం సాయంత్రం తల్లి, కొడుకులిద్దరూ షిరిడీకి బయలుదేరారు. శనివారం ఉదయానికి వారు షిరిడీలో ఉన్నారు. వారు అంతా విచారించి, తరువాత స్నానాదికాలు అన్నీ కానిచ్చి శ్రీ సాయిని కలుసుకోవడానికి ద్వారకామాయికి చేరుకున్నారు. వారు, సాయిబాబా పవిత్రమైన థుని ముందు కూర్చుని ఉండటం చూశారు. (బాబా వెలిగించిన అగ్ని). మా నాన్నమ్మ్త గారు బాబా ముందు వంగి ఆయన పాదాలను స్పుశించారు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారిద్దరిమథ్య యేమి జరిగిందన్నది ఈ క్రింది విథంగా ఉంది.
బాబా మా నాన్నమ్మ్త గారితో “అమ్మా ! నువ్వు వచ్చావు. బాంద్రా నించి నా సోదరుడు నిన్ను నావద్దకు పంపించాడు. దయచేసి కూర్చో. అమ్మా, నీకు చాలా విపరీతమయిన తలనొప్పి ఉంది అవునా?” అప్పుడు సాయిబాబా తన అయిదు వేళ్ళను ఊదీ ఉన్న పళ్ళెంలో ముంచారు. (పవైత్రమైన భస్మం) ఊదీతో నిండి ఉన్న ఆ చేతితో మా నాన్నమ్మ్త గారి నుదిటి మీద కొట్టారు. ఆయన, నుదిటిని అయిదు వేళ్ళతో గట్టిగా పట్టుకుని అన్నారు “అమ్మా, యిప్పటినుంచి నీవు చనిపోయేవరకు నీ తలకు యిక యెటువంటి నొప్పిరాదు. ఈ తలనొప్పి పూర్తిగా నివారణయింది”
ప్రియ పాఠకులారా, సాయి చేసిన ఈ చర్యకి మా అమ్మమ్మగారు ఆశ్చర్య చకితులయారు. ఆమె తన బాథ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాబాగారికి తమ రాక గురించి, ఆమె బాథ గురించి యెలా తెలుసు? నేననుకునేదేమిటంటే బాబాగారు చేసిన ఈ రెండు చర్యల వల్ల మా నాన్నమ్మ్త గారిని గురించిన విషయం తెలిసింది. ఒకటి వారిద్దరి మథ్య జరిగిన చూపులు, అనగా దృష్టి కలయిక, మరియు ఊదీ నిండిన చేతితో నుదిటి మీద కొట్టడం. మా నాన్నమ్మ గారికి యెప్పుడు అటువంటి శక్తివంతమైన మోతాదులో మందు యివ్వబడలేదు. యేమి జరిగిందన్నది, ఆమెకు అనుభవమైనదల్లా తనకు బాగయినట్టు. తలనొప్పి వల్ల వచ్చిన ఆమె వదనంలోని విచారం మటుమాయమయిపోయింది. ఆమె యిపుడు కొత్తగా కనపడుతోంది. ఆమె మా నాన్నగారు జ్యోతీంద్ర గారితో బాబాకు నమస్కరించమని చెప్పింది. యిదంతా చూసి మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి యింతకు ముందు యెపుడు అలా ఆజ్ఞాపించలేదు. అపుడు మానాన్నగారు బాబా ముందుకు వంగి ఆయన పాదాలను సృశించారు. వెంటనే బాబా ఆయనతో “ప్రియమైన భావూ (సోదరా), నువ్వు నన్ను గుర్తించలేదా?” మా నాన్నగారు లేదన్నట్లుగా జవాబిచ్చారు. అపుడు బాబా ఆయనతో “నా వైపు చూడు, బాగా గుర్తుకు తెచ్చుకో, మరలా జ్ఞప్తికి తెచ్చుకోవటానికి ప్రయత్నించు” అన్నారు. మా నాన్నగారికి యేమీ గుర్తుకు రాలేదు. అపుడు బాబా తన కఫ్నీ జేబులో చేయి పెట్టి ఒక పైసా రాగి నాణెం తీశారు. ఆయన దానినే మా నాన్నగారికి చూపించారు. “ఏయ్ భావూ ! 1894 సం. సంబంథించిన ఈ రాగినాణెం గుర్తుందా? నువ్వు స్కూలికి వెళ్ళేటపుడు ఒక ఫకీరుకు థర్మంగా ఇచ్చావు.”
యిపుడు మా నాన్నగారు ఈ అథ్యాయం మొదటలో వివరించిన సంఘటనని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. ఆయన నేత్రాలు కన్నిళ్ళతో నిండిపోయాయి. ఆయన వెంటనె తన చేతులతో బాబాగారి కాళ్ళు పట్టుకున్నారు. బాబా ఆయనని లేవనెత్తి అన్నారు, “ఏయ్ భావూ, ఆ రోజు మథ్యాన్నం నువ్వు కలుసుకున్న ఫకీరు నేను తప్ప మరెవరూ కాదు, నివ్విచ్చిన ఈ పైసాని నీకు తిరిగి యిస్తున్నాను. దీన్ని తీసుకుని జాగ్రత్తగా భద్రపచుకో. అది నీకు యెన్నో పైసలని పెడుతుంది.”
చదువుతున్న ప్రియమైన భక్తులారా, మా నాన్నమ్మ్త గారికి, నాన్నగారికి ఆనందదాయకమైన సాయి దర్శనం జరిగిందని యిపుడు మీరు నాతో తప్పకుండా ఒప్పుకుంటారు. వారిద్దరికీ అది మరపురానిది. అప్పటినుంచీ వారు తమకు తెలియకుండానే యెప్పటికీ సాయి వైపు ఆకర్షితులయ్యారు. సాయితో ఈ మొట్టమొదటి పరిచయం తరువాత తార్ఖడ్ కుటుంబం సాయిబాబాని తమ గురువుగా యెంచుకున్నారు. వారు పూర్తిగా సాయి భక్తికి అంకితమయి పోయారు. మా నాన్నమ్మ్త గారి తలనొప్పి శాశ్వతంగా నివారింపబడింది. భగవంతుని యందు ఆమె భక్తి రెట్టింపయింది. మా యింటిలో ఆ పైసా నాణెం పూజకోసం ఉంచబడింది.
రేపు తరువాయి భాగం…
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదనాల్గవ భాగం–Audio
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు నాల్గవ భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదవ భాగం–Audio
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఆరవ భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఎనిమిదివ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు మూడవ భాగం”
kishore Babu
August 22, 2016 at 5:39 pmThank you so much Sai Suresh…