బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఎనిమిదివ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

దేవాలయాల్లో మనము దర్శిస్తున్న విగ్రహాలని రాతి విగ్రహాలనుకుంటాము. కాని అవి సజీవం గా ఉన్న విగ్రహాలు. దేవాలయాలలో ప్రతిష్టించేముందు వాటికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు కాబట్టే వాటిలో జీవం ఉంటుంది. వాటిలో జీవకళ తొణికసలాడుతూ ఉంటుందై. అందుచేత మనం యెప్పుడు గుడికి వెళ్ళినా ఆ కాసేపయినా మిగతా విషయాలను పక్కకు పెట్టి మనస్పూర్తిగా ఆ దేవదేవుడిని మనసారా నిండుగా ప్రార్థించుకోవాలి. ఆయన అనుగ్రహాన్ని పొందాలి. దానికి నిర్థారణగా ఈ రోజు మనం తార్ఖడ్ వారి స్వీయానుభూతులలో పండరీపురం గురించిన అద్భుతమైన లీలను తెలుసుకుందాము.

పండరిపూర్ లార్డ్ విఠోభా

ప్రియమైన సాయి భక్త పాఠకులారా ! మా నాన్నగారనుభూతి పొందిన సంఘటనలన్నీ కాలక్రమానుసారం నా వద్ద లేనందుకు, దయ చేసి నన్ను మన్నించమని కోరుతున్నాను. నా మనసులోకి వచ్చిన వాటి ప్రకారం నేను వాటిని వివరిస్తున్నాను. మా నాన్నగారు ఆథ్యాత్మిక స్థితిలోకి వెళ్ళినపుడెల్లా వాటిని మాకు వివరిస్తూ ఉండేవారు. అందుచేత క్రమంలో చెప్పడం నాకు సాథ్యం కాదు.

యింతకుముందు చెప్పినట్లుగా, తార్ఖడ్ కుటుంబమంతా ప్రతిరోజూ సాయిబాబాని పూజించడం ప్రారంభించారు. గురువారం సాయంత్రం వారందరూ కలిసి తమ యింటిలో ఆరతి యిస్తూ ఉండేవారు. మా నానమ్మగారు పూర్తి మనశ్శాంతితో ఉన్నారు. ఆవిడ తన తలనొప్పి పూర్తిగా నివారణ అవడంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఆవిడ యిపుడు ఆథ్యాత్మికత వైపుకు ఆకర్షిలవుతున్నారు. ఆమె ప్రతిరోజూ ఆథ్యాత్మిక పుస్తకాలను చదవడం ప్రారంభించారు. ఒక సారి ఆమె మా నాన్నగారితో పవిత్రమైన పండరీపుర క్షేత్రానికి యాత్రకు వెళ్ళి లార్డ్ విఠోబా దర్శనం చేసుకోవాలనే కోరికను వెల్లడించారు. ఆమె యింకా ఏమి చెప్పిందంటే పవిత్ర గ్రంథాలు చెప్పిన దాని ప్రకారం ప్రతివారు ఈ ప్రపంచాన్ని వదలివెళ్ళే ముందు పండరీపూర్ ను తప్పక దర్శించాలని. మానాన్నగారు బాబాని అడిగి అయన అనుమతి తీసుకోమని చెప్పారు.

ఆ ప్రకారంగా, తరువాత షిరిడీకి వెళ్ళినప్పుడు, ఆవిడ పండరీపూర్ దర్శించడానికి బాబా అనుమతి కోరారు. బాబా ఆవిడతో “అమ్మా! షిర్డీయే మనకన్నీ. అందుచేత అవసరం లేదు.” అన్నారు. ఆవిడ నిరాశ పడ్డారు. ఆమె బాబాతో యాత్రికులు పండరీపురం వెడుతూ ఉంటారని, యెందుకంటే లార్డ్ విఠోబా అక్కడ కొలువై ఉన్నారని, ఒక్కసారి ఆయనని దర్శనం చేసుకుంటే మోక్షానికి దారి సుగమం అవుతుందని వారి గట్టి నమ్మకమని చెప్పారు.

ఆవిడకి తన జీవితంలో ఒక్కసారయినా వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవాలనే గాఢమయిన కోరిక పెరిగిందని వ్యక్తం చేశారు. బాబాగారు ఆవిడ కోరిక సమంజసమయినదేనని తెలిసి “అమ్మా, చింతించవద్దు. నువ్వు పండరీపురం వెళ్ళి నీ కోరిక తీర్చుకో” అని అనుమతించారు. యింటికి చేరుకోగానే బాబా సాహెబ్ తార్ఖడ్ గారికి చెప్పి సరియైన ప్రణాళిక వేసుకుని మానాన్నగారు, మా నాన్నమ్మగారు పండరీపురానికి ప్రయాణం కట్టారు. పాఠకులు ఒక విషయాన్ని మెచ్చుకోవాలి. అదేమిటంటే ముస్లింస్ కి మక్కా, కాథలిక్స్ కి బెథల్ హాం యెలాగో, అలాగే మహారాస్ట్రులకు పండరీపూర్.

అక్కడికి చేరుకోగానే మా నాన్నగారు, అవసరమయిన అన్ని యేర్పాట్లూ చేశారు. స్నానాలు చేసి, పలహారం తీసుకున్న తరువాత, ఉదయం రద్దీ గంటలు అయిపోయాక వారు పూజా సామాగ్రితో విఠోబా మందిరం వరకు నడచుకుంటూ వెళ్ళారు. గర్భ గుడిలోకి ప్రవేశించగానే మందిర పూజారి గారిని పూజ జరుపుకోవడానికి అనుమతి కోరారు. మా నానమ్మగారు ఆమె పథ్థతి ప్రకారం దాదాపు పూజనంతా పూర్తి చేశారు. యిపుడు విఠోబా విగ్రహానికి దండ వేసి అలంకరించే సమయం. యిక అక్కడే సమస్య యెదురయింది. మా నాన్నమ్మగారు తాను స్వయంగా తన చేతులతో దండ వేస్తానన్నారు. కాని పూజారి అలా చేయడానికి అనుమతించలేదు, కారణం విగ్రహం ఉన్న పీఠం మీదకు యెక్కడానికి యెవరికీ కూడా అనుజ్ఞ లేదు. మా నాన్నమ్మగారు, విగ్రహానికి తన చేతులతో దండ వేయలేకపోతే తన పూజ అసంపూర్తిగా మిగిలి పోతుందని మా నాన్నగారితో చెప్పారు. మా నాన్నగారు బాబాగారే ఆమెకు పండరీపురం వెళ్ళడానికి అనుమతిచ్చారు కాబట్టి ఆయననే సహాయం చేయమని ప్రార్థించమని సలహా ఇచ్చారు. ఆవిడ కళ్ళు మూసుకుని దండ పట్టుకుని రెండు చేతులను పైకెత్తి లార్డ్ విఠోబా కు తన పూజను స్వీకరించమని కోరారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ….ఊపిరి బిగపెట్టండి…..ఏమి జరిగిందో చూడండి………లార్డ్ విఠోబావిగ్రహం పీఠం మీదనించి కిందకు దిగింది. మా నాన్నగారు వెంటనే మా నాన్నమ్మగారి శరీరాన్ని కుదిపారు. ఆవిడతో కళ్ళు తెరవమని, లార్డ్ విఠోబా ఆమె ప్రార్థనలకు స్పందించారని యిప్పుడామె ఆయనని దండతో అలంకరించవచ్చని, చూడమని చెప్పారు. ఆవిడ వెంటనే విఠోబా మెడలో దండ వేశారు. తరువాత లార్డ్ విఠోబావిగ్రహం తన యథాస్థానానికి వెళ్ళింది. తల్లీ, కొడుకులిద్దరూ లార్డ్ విఠోబా ముందు సాష్టాంగ నమస్కారం చేశారు.

యిది చూసి పూజారిగారు ఆశ్చర్యచకితులై ఆయన పీఠం మీదనించి కిందకి ఉరికి మా నాన్నమ్మగారి , నాన్నగారి కాళ్ళు పట్టుకుని వారే విఠోబా, రుక్మిణి అని వారిని అక్కడినించి వెళ్ళనివ్వనని చేప్పేశారు.తన అహంకార ప్రవర్తనకి క్షమించమని అడిగారు. మా నాన్నగారు ఆయనను ఓదార్చి తమగురించి యెటువంటి తప్పుడు అభిప్రాయాలు పెట్టుకోవద్దని చెప్పారు. వారు, తాము షిరిడీ సాయిబాబా భక్తులమని, వారి అనుమతి తీసుకున్న తరువాతే పండరీపురానికి వచ్చామని చెప్పారు. ఆయన కింకా, లార్డ్ విఠోబా మీద ఢృఢమైన నమ్మకముంచమని, ఆయన యిక రాతి విగ్రహం కాదు జాగృదావస్థలో (సజీవంగా) ఉన్నరని చెప్పారు. హృదయాంతరాళలో నుంచి పూజ నిర్వహించి ప్రతిగా ఆయన అనుగ్రహాన్ని సంపాదించమని ఆయన సలహా యిచ్చారు.  ప్రసాదం యిస్తే తాము మందిరం నిం చి వెడతామని పూజారిగారిని కోరారు. వారు విఠోబా, రుక్మిణిల యిత్తడి విగ్రహాలను కొన్నారు. వాటిని తమ చందనపుమందిరంలో ప్రతీరోజూ పూజచేయడానికి ఉంచారు.

ఈ అనుభవం వారిద్దరికీ స్వర్గంలో ఉన్నంత సంతోషాన్ని కలిగించింది. వారు భగవంతునికి తమ ప్రార్థనలను యెంతో విధేయతగా సలుపుతున్నపాటికీ, లార్డ్ విఠోబా తమను అంతలా అనుగ్రహిస్తారని వారెప్పుడూ ఊహించలేదు. దీని తరువాత వారు షిరిడీకి వెళ్ళినప్పుడు, బాబా మా నాన్నమ్మగారిని అడిగారు “అమ్మా, విఠోబాని కలుసుకోగలిగావా” అని. “బాబా, యిదంతా నువ్వు చేసినదే” అని మా నాన్నమ్మగారు సమాథానమిచ్చారు. “యిప్పుడు నా జీవితానికి సార్థకత యేర్పడింది. నేనిపుడు ప్రపంచాన్ని వదలిపోవడానికి సిథ్థంగా ఉన్నాను” అని చెప్పారు. ఆవిడ యెంతో కృతజ్ఞతలు తెలిపారు.

ప్రియ సాయి భక్తులారా, పాఠకులారా ! మా నాన్నగారు చెబుతూ ఉండేవారు, మీరు పూజించే ప్రతి రాతి విగ్రహంలోను భగవంతుడు యెపుడూ ఉంటాడని. నేను గాఢంగా నమ్మేదేమిటంటే వారనుభవించిన ఈ దైవ సంబంథమయిన అనుభూతులన్నీ వారు తమ పూర్వ జన్మలో చేసుకున్న మంచి పనులవల్లనేనని, యింకా అనుమానంలేకుండా వారు సాయి దయ, ఆశీర్వాదములు అనే ఛత్రం కింద ఉన్నారు కనక యిదంతా సాథ్యమయింది.

రేపు తరువాయి భాగం…

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఎనిమిదివ భాగం

kishore Babu

Thank you so much Sai Suresh..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles